indian hockey taem
-
పటిష్ట జట్టుతో పోటీ అంటే సవాలే: భారత కెప్టెన్
ఢిల్లీలో హాకీ మ్యాచ్ ఆడనుండటం ఎంతో సంతోషంగా ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. ఇది కేవలం రెండు జట్ల మధ్య పోటీ కాదని.. దేశ రాజధానిలోని యువత హాకీ వైపు ఆకర్షితులయ్యేలా స్ఫూర్తి నింపేందుకు తమకు దక్కిన గొప్ప అవకాశమని పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జర్మనీ హాకీ జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది. ప్యారిస్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 23, 24న ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా దాదాపు దశాబ్ద కాలం తర్వాత తొలిసారి ఢిల్లీ అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. ప్రపంచ హాకీలో జర్మనీ అగ్రశ్రేణి జట్టుఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘దేశ రాజధానిలో.. చారిత్రాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ఆడనుండటం మాకు దక్కిన గొప్ప గౌరవం. ఎంతో ప్రత్యేకం కూడా! దేశ రాజధానిలో మరోసారి హాకీ స్ఫూర్తిని జ్వలింపచేసే అవకాశం రావడం.. ఆ జట్టుకు నేను సారథిగా ఉండటం నా అదృష్టం.ప్రపంచ హాకీలో జర్మనీ అగ్రశ్రేణి జట్టుగా ఉంది.వారితో పోటీ పడటం అంటే కఠిన సవాలుకు ఎదురీదడమే. అయితే, ప్రత్యర్థి ఎంత పటిష్టంగా ఉంటే మాలోని అత్యుత్తమ ప్రదర్శన అంతగా బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాడు. కాగా భారత హాకీ జట్టు ఇటీవలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.హాకీలో ఇరు జట్లకు గొప్ప వారసత్వం ఉంది‘భారత్, జర్మనీ హాకీ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించనున్నాం. ఇది ఆట ఉన్నతితో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యేందుకు తోడ్పడుతుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య సమరం రసవత్తరంగా సాగడం ఖాయమని హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్ పేర్కొన్నాడు. ‘భారత్, జర్మనీ మధ్య హాకీ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తికరమే. హాకీలో ఇరు జట్లకు గొప్ప వారసత్వం ఉంది. జర్మనీ వంటి పటిష్ట జట్టుతో తలపడేందుకు టీమిండియా ప్లేయర్లు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు’ అని భోళానాథ్ సింగ్ అన్నాడు.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్..
ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ-2024 విజేతగా భారత్ నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించిన భారత్.. వరుసగా రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో చివరి క్వార్టర్లో గోల్‌కొట్టిన జుగ్రాజ్ సింగ్.. టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు.తొలి మూడు క్వార్టర్స్‌లోనూ ఇరు జట్ల డిఫెండర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మూడు క్వార్టర్స్ ముగిసే సరికి భారత్-చైనా జట్లు కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. ఆఖరికి నాలుగో క్వార్టర్ 51వ నిమిషంలో డిఫెండర్ జుగ్రాజ్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు.ఐదో సారి..కాగా టీమిండియా ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీని సొంతం చేసుకోవడం ఇది ఐదోసారి. 2011, 2016, 2018, 2021 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. కాగా భారత హాకీ జట్టు ప్యారిస్ ఒలిపింక్స్‌లో కూడా సత్తాచాటింది. కాంస్య పతకంతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన మెరిసింది. Full TimeHero Asian Champions Trophy Moqi China 2024#hact2024#asiahockey pic.twitter.com/zHqk9A1LNN— Asian Hockey Federation (@asia_hockey) September 17, 2024 -
భారత్ శుభారంభం.. చైనాపై ఘన విజయం
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. ఆతిథ్య చైనా జట్టుతో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (14వ ని.లో), ఉత్తమ్ సింగ్ (27వ ని.లో), అభిõÙక్ (32వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మలేసియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ 2–2తో... జపాన్, దక్షిణ కొరియా మధ్య మ్యాచ్ 5–5తో ‘డ్రా’గా ముగిశాయి. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది. తొలి విజయంతో భారత్ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈనెల 17 వరకు మొత్తం ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.చదవండి: IND vs BAN: అప్పుడు జీరో.. కట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ? -
వివేక్‌కు కోటి.. అతడికి రూ. 4 కోట్లు: ప్రభుత్వాల భారీ నజరానాలు
భారత హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల రివార్డుతో సత్కరించనుంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారంటూ వివేక్‌తో పాటు భారత హాకీ జట్టు ఆటగాళ్లందరినీ ప్రశంసించారు.వరుస ఒలింపిక్స్లోకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. స్పెయిన్‌తో గురువారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 2-1తో విజయం సాధించింది.టోక్యో ఫలితాన్ని పునరావృతం చేస్తూ మరోసారి మెడల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన హాకీ జట్టుగా నిలిచింది. విశ్వ క్రీడల్లో హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఇది 13వ పతకం.వివేక్‌కు ఇప్పటికే డీఎస్పీ ఉద్యోగంఈ నేపథ్యంలో హాకీ ఇండియా కాంస్యం గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు నజరానా ప్రకటించింది. ప్లేయర్లలో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత వివేక్ సాగర్ ప్రసాద్‌కు ఫోన్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.. ‘‘అద్బుతమైన ప్రదర్శన. దేశం మొత్తం మిమ్మల్ని చూసి సంతోషిస్తోంది. జట్టుకు అభినందనలు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీ అకౌంట్‌కు కోటి రూపాయలు రివార్డుగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీసుగా మీరు పనిచేస్తున్నారు. మీకు ఈ కోటి రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.అమిత్‌కు రూ. 4 కోట్లుకాగా టోక్యోలో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడైన వివేక్‌కు నాటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో పాటు కోటి రూపాయలు ఇచ్చింది. మరోవైపు.. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ తమ హాకీ స్టార్ అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానా ప్రకటించారు. జట్టులోని ఇతర సభ్యులకు రూ. 15 లక్షల చొప్పున అందిస్తామని తెలిపారు. -
భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: పారిస్ ఒలంపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించింది. ఈ క్రమంలో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.కాగా, ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్.. 2024 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు!. మీ విజయంతో భారత జెండా రెపరెపలాడుతోంది అంటూ పోస్టు చేశారు. Congratulations to the Indian men’s hockey team on bringing home the Bronze at the 2024 Olympics!The Indian flag continues to fly high!#IndiaAtOlympics pic.twitter.com/wEuOfpePcI— YS Jagan Mohan Reddy (@ysjagan) August 8, 2024 -
Paris Olympics 2024: ఫైనల్ వేటలో...
పారిస్: ఒలింపిక్స్‌లో భారత హాకీకి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో పురుషుల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ను ‘షూటౌట్’లో ఓడించిన భారత్... మంగళవారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ జర్మనీతో అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన టీమిండియా... ఇప్పుడు పతకం రంగు మార్చాలని కృతనిశ్చయంతో ఉంది. 1980కి ముందు ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలతో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన భారత్.. తిరిగి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగు పెట్టిన హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం.. క్వార్టర్స్‌లో బ్రిటన్‌పై అసమాన ప్రదర్శన కనబర్చింది. స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ రెడ్ కార్డుతో మైదానాన్ని వీడగా.. మిగిలిన 10 మందితోనే అద్భుతం చేసింది. ఇక ‘షూటౌట్’లో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ అడ్డుగోడలా నిలవడంతో 1972 తర్వాత భారత్ వరుసగా రెండోసారి ఒలింపిక్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అదే జోరులో జర్మనీని కూడా చిత్తుచేస్తే.. 44 ఏళ్ల తర్వాత టీమిండియా విశ్వక్రీడల తుదిపోరుకు అర్హత సాధించనుంది. చివరిసారి భారత జట్టు 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరి విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న శ్రీజేశ్ మరోసారి కీలకం కానుండగా.. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిదాస్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడటంతో అతడు జర్మనీతో సెమీస్ పోరుకు అందుబాటులో లేడు. అయితే ఇలాంటివి తమ చేతిలో లేవని... మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతామని ఈ టోరీ్నలో ఏడు గోల్స్ చేసిన భారత సారథి హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై విజయంతోనే పతకం దక్కించుకున్న టీమిండియా... మరోసారి జర్మనీని చిత్తు చేసి ముందంజ వేయాలని ఆశిద్దాం. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్‌తో స్పెయిన్ తలపడనుంది. రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధం భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా.. రోహిదాస్ హాకీ స్టిక్ బ్రిటన్ ప్లేయర్ తలకు తగిలింది. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. మ్యాచ్ రిఫరీ అతడికి రెడ్ కార్డు చూపి మైదానం నుంచి తప్పించాడు. దీనిపై భారత జట్టు అప్పీల్ చేయగా.. వాదనలు విన్న అనంతరం అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఒక మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అతడు నేడు జరిగే సెమీఫైనల్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.‘నియమావళిని అతిక్రమించినందుకు అమిత్ రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించాం’అని ఎఫ్ఐహెచ్ పేర్కొంది. -
Paris Olympics: ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. 52 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత హాకీ జట్టు మరో అద్భుత విజయం సాధించింది. శుక్రవారం పూల్-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 3-2 తేడాతో భారత్ గెలుపొందింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ జట్టుపై భారత్ విజయం సాధించడం 52 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. చివరగా జర్మనీ వేదికగా జరిగిన 1972 ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ జట్టును భారత్ ఓడించింది. మళ్లీ ఇప్పుడు ప్యారిస్‌లో ఆస్ట్రేలియాను భారత హాకీ జట్టు చిత్తు చేసింది. ఇక ఈ విజయంతో టీమిండియా లీగ్ స్టేజి(పూల్-బి)ని రెండో స్ధానంతో ముగించింది. పూల్-బిలో బెల్జియం తొలి స్ధానంలో ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత విజయంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మరోసారి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన గోల్స్‌తో హర్మన్ ప్రీత్ మెరిశాడు. అతడితో పాటు అభిషేక్ ఓ గోల్ సాధించాడు. మరోవైపు ఆస్ట్రేలియా సెకెండ్ క్వార్టర్లో ఓ గోల్ సాధించగా.. ఆఖరి క్వార్టర్లో మరో గోల్ చేసింది. ఇక క్వార్టర్ ఫైనల్లో భారత్ జర్మనీ లేదా గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. -
అదరగొట్టిన భారత హాకీ జట్టు.. ఐర్లాండ్‌పై ఘన విజయం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషల హాకీ జట్టు అదరగొడుతోంది. పూల్-బిలో భాగంగా మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత హాకీ జట్టు పూల్ బిలో అగ్రస్ధానానికి చేరుకుంది.దీంతో పూల్ బి నుండి టాప్ 4 క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లే అవకాశాలను భారత్ మరింత మెరుగుపరుచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ సత్తాచాటాడు. భారత్ సాధించిన రెండు గోల్స్ కూడా హర్మన్ కొట్టినవే కావడం గమనార్హం.11వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో గోల్ చేసిన హర్మన్‌ప్రీత్ సింగ్.. 19వ నిమిషంలో రెండో గోల్ చేశాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 1న బెల్జియంతో తలపడనుంది. -
41 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.. కానీ ఓవర్ నైట్ స్టార్ కాలేకపోయాడు
ప్రపంచవ్యాప్తంగా క్రీడా అభిమానులు, అథ్లెట్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఒలింపిక్స్-2024కు సర్వం సిద్దమైంది. జూలై 26న ప్యారిస్ వేదికగా ఈ విశ్వక్రీడలకు తెరలేవనుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు సత్తాచాటేందుకు సిద్దమయ్యారు.బంగారు పతకాలే లక్ష్యంగా భారత క్రీడాకారులు ప్యారిస్‌కు పయనమయ్యారు. ఇక గత ఒలింపిక్స్‌లో తృటిలో పసిడి పతకాన్ని చేజార్చుకున్న భారత హకీ జట్టు.. ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించి తమ 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. భారత హాకీ జట్టుపై ఈసారి భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ విశ్వక్రీడ్లలో భారత హాకీ జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. ఒలింపిక్స్‌లో ఏకంగా 8 బంగారు పతకాలు గెలుచుకున్న ఘనత భారత హాకీ టీమ్‌ది. ఇండియా హాకీ టీమ్ ఖాతాలో ఇప్పటివరకు 8 బంగారు పతకాలు, మూడు కాంస్య, ఒక రజత పతకం ఉన్నాయి. 1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన తొట్టతొలి ఒలింపిక్స్‌లోనే పసిడి పతకం సాధించిన భారత హాకీ జట్టు.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో మొదలైన భారత స్వర్ణయాత్ర 1980 మాస్కో ఒలిపింక్స్ వరకు కొనసాగింది. ఆ మధ్యలో ఓ సిల్వర్, రెండు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విశ్వక్రీడల్లో ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించిన భారత హాకీ జట్టుకు అనూహ్యంగా గడ్డు కాలం ఎదురైంది. 1980 తర్వాత దాదాపు 41 ఏళ్ల పాటు హాకీలో భారత్ పతకం సాధించలేకపోయింది.ఈ సమయంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు.. తమ 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే టోక్యో ఒలిపింక్స్‌లో భారత్ కాంస్య పతకాన్ని ముద్దాడడంలో ఓ ఆటగాడిది కీలక పాత్ర. ఆ మిడ్ ఫీల్డర్ అద్బుతమైన గోల్‌తో భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చి బ్రాంజ్ మెడల్ నెగ్గేలా చేశాడు. కానీ అతడు మాత్రం ఓవర్ నైట్‌స్టార్‌గా మారలేకపోయాడు. ఇప్పటికి ఆ హాకీ ప్లేయర్ పేరు చాలా మందికి తెలియదు. అతడే భారత మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్.సూపర్ గోల్.. సూపర్ విన్2020 టోక్యో ఒలింపిక్స్ హాకీ క్వార్టర్-ఫైనల్లో భారత్, గ్రేట్ బ్రిటన్ తలపడ్డాయి. క్వార్టర్ఫైనల్లో భారత్ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్లో 7వ నిమిషంలో భారత్ మొదటి గోల్ చేయగా.. రెండో క్వార్టర్ ప్రారంభమైన వెంటనే 16వ నిమిషంలో రెండో గోల్ చేసింది. దీంతో సెకెండ్ క్వార్టర్ ముగిసే సరికి భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే మూడో క్వార్టర్ ఆఖరి నిమిషంలో బ్రిటన్ గోల్ సాధించి తిరిగి గేమ్‌లోకి వచ్చింది. దీంతో భారత డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగో క్వార్టర్స్ ఆరంభం నుంచే స్కోర్‌ను సమం చేయడానికి బ్రిటన్ తీవ్రంగా శ్రమించింది. దీంతో భారత ఆటగాళ్లు సైతం ఒత్తడిలోకి వెళ్లారు. బ్రిటన్ను గోల్లు చేయనివ్వకుండా భారత్ డిఫెన్స్ ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. మ్యాచ్ ముగిసే సమయం దగ్గరపడుతున్న కొద్ది అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఏ క్షణాన బ్రిటన్ గోల్ కొట్టి స్కోర్ సమం చేస్తుందోనని అంతా భయపడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో 57వ నిమషాన భారత మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్ అద్భుతమైన గోల్ కొట్టి అందరిని ఊపిరి పీల్చుకునేలా చేశాడు. దీంతో భారత్ 3-1 తేడాతో బ్రిటన్ను ఓడించి 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. ఇక టోక్యోలో భారత్‌కు కాంస్య పతకం అందించిన హార్దిక్ సింగ్.. ఇప్పుడు ప్యారిస్ వెళ్లిన హాకీ జట్టులోనూ సభ్యునిగా ఉన్నాడు. కాగా పంజాబ్‌కు చెందిన హార్దిక్ సింగ్.. 2018 నుంచి భారత హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
Hockey World Cup 2023: 48 ఏళ్ల కల నెరవేరేనా!
ఎప్పుడో 1975లో... భారత హాకీ జట్టు అజిత్‌పాల్ సింగ్ నాయకత్వంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నాటి మేటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన టీమ్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించే అంశం. వరుసగా రెండో సారి మనమే ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత జట్టు రాత మారుతుందా... కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి కాంస్యం సాధించిన మన టీమ్ అదే జోరును చూపిస్తుందా అనేది ఆసక్తికరం. భువనేశ్వర్: భారత గడ్డపై మరో విశ్వ సంబరానికి సమయం ఆసన్నమైంది. 15వ హాకీ వరల్డ్ కప్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఒడిషాలోని రెండు వేదికలు భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజుల పాటు మొత్తం 44 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. తొలి రోజే బరిలోకి దిగనున్న భారత్... స్పెయిన్‌ను ఎదుర్కోనుంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉండగా... కొత్తగా ఈ టోర్నీ కోసం మరో పెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. 24 మ్యాచ్‌లు భువనేశ్వర్‌లో, 20 మ్యాచ్‌లు రూర్కెలాలో జరుగుతాయి. మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతుండగా వాటిని నాలుగు పూల్‌లుగా విభజించారు. ముందుగా తమ గ్రూప్‌లో ఇతర మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘క్రాస్ ఓవర్స్’, క్వార్టర్స్, సెమీస్ ఉంటాయి. జనవరి 29న ఫైనల్ నిర్వహిస్తారు. నేటి మ్యాచ్‌లు అర్జెంటీనా X దక్షిణాఫ్రికా (మ.గం. 1.00 నుంచి) ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (మం.గం. 3.00 నుంచి) ఇంగ్లండ్ X వేల్స్ (సా.గం. 5.00 నుంచి) భారత్ X స్పెయిన్ (సా.గం. 7.00 నుంచి) పూల్ల వివరాలు ‘ఎ’ – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా ‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ ‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ * ప్రపంచకప్‌ను అత్యధికంగా పాకిస్తాన్ (4 సార్లు) గెలవగా...నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో 3 టైటిల్స్ సాధించాయి. జర్మనీ రెండు సార్లు విజేతగా నిలవగా...భారత్, బెల్జియం ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. -
మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్దం
టెరసా (స్పెయిన్): మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 17 రోజుల పాటు అమ్మాయిలు స్టిక్స్‌తో అలరించనున్నారు. స్పెయిన్, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. నేడు జరిగే మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో స్పెయిన్‌తో కెనడా తలపడుతుంది. భారత అమ్మాయిల జట్టు ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. డిఫెండింగ్ చాంపియన్, టోర్నీ హాట్ ఫేవరెట్ నెదర్లాండ్స్ మరోసారి హ్యాట్రిక్ టైటిళ్లపై కన్నేసింది. 2014, 2018లో విజేతగా నిలిచిన డచ్ అమ్మాయిలు 1983, 1986, 1990లలో హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచారు. ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యమవని రీతిలో 8 టైటిల్స్‌ను నెదర్లాండ్స్ కైవసం చేసుకుంది. భారత మహిళలు గత టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో ప్రపంచకప్‌లోనూ రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. 48 ఏళ్ల అమ్మాయిల ప్రపంచకప్ హాకీ చరిత్రలో భారత్ మెరుగైన ప్రదర్శన ‘నాలుగో స్థానం’. మెగా ఈవెంట్ ఆరంభమైన 1974లో కాంస్య పతక పోరులో వెస్ట్ జర్మనీ చేతిలో ఓడింది. ఆ తర్వాత మళ్లీ పతక పోటీలో ఏనాడు నిలువలేకపోయింది. 4 పూల్స్... 16 జట్లు... పూల్–ఎ: నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, చిలీ. పూల్–బి: భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, చైనా. పూల్–సి: స్పెయిన్, అర్జెంటీనా, దక్షిణ కొరియా, కెనడా. పూల్–డి: ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, దక్షిణాఫ్రికా. చదవండి: SL-W vs IND-W: శ్రీలంకతో భారత్ తొలి పోరు.. -
‘షూటౌట్’లో భారత్ ఓటమి
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా జర్మనీ మహిళల జట్టుతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్’లో 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ‘షూటౌట్’లో నెగ్గిన జర్మనీకి రెండు పాయింట్లు, భారత్‌కు ఒక పాయింట్ లభించాయి. సాకేత్ ఖాతాలో 26వ డబుల్స్ టైటిల్ సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో 26వ అంతర్జాతీయ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. శనివారం భోపాల్‌లో ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట విజేతగా నిలిచింది. 56 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 6–1తో లోహితాక్ష–అభినవ్ సంజీవ్ (భారత్) జోడీపై గెలిచింది. చదవండి: IND vs SL: అశ్విన్ ఏం చేస్తున్నావు.. ఏంటి ఆ పని..! -
చివరి వరకు వెనుకబడి.. ఆఖర్లో అద్భుతం
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ పురుషుల జట్టుతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. ఒక దశలో 1–4తో వెనుకబడి ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి టీమిండియా అనూహ్యంగా తేరుకుంది. వరుసగా నాలుగు గోల్స్ సాధించి చివరకు 5–4తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మరో ఎనిమిది సెకన్లలో ముగుస్తుందనగా హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను లక్ష్యానికి చేర్చి భారత్‌ను గెలిపించాడు. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ, 60వ ని.లో) రెండు గోల్స్ చేయగా... శిలా నంద్ లాక్రా (41వ ని.లో), షంషేర్ సింగ్ (43వ ని.లో), వరుణ్ కుమార్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్ జట్టుకు కెప్టెన్ మార్క్ మిరాలెస్ (20వ, 23వ, 40వ ని.లో) మూడు గోల్స్, పౌ కునిల్ (14వ ని.లో) ఒక గోల్ అందించారు. మహిళల జట్టూ గెలిచింది... మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2–1తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలో మార్టా సెగూ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో జ్యోతి గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం 52వ నిమిషంలో నేహా చేసిన గోల్‌తో భారత్ 2–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రొ లీగ్‌లో భారత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఇటీవల ఒమన్‌లో చైనాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందింది. -
మిఠాయిలు, మసాలాలు వద్దే వద్దు..
న్యూఢిల్లీ: భారత హాకీ క్రీడాకారిణిలు తమకిష్టమైన అభిరుచులకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ (2020) అర్హతే లక్ష్యంగా క్రీడాకారిణిలు తీసుకునే ఆహారంలో జట్టు సైంటిఫిక్ అడ్వైజర్ వేన్ లాంబర్డ్ కాస్త కఠినమైన ఆంక్షలు విధించారు. క్వాలిఫయింగ్ పోటీలు ముగిసేదాకా స్వీట్లు, మసాలా వంటకాలకు దూరంగా ఉండాలని లాంబర్డ్ సూచించారు. దీనిపై భారత హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ మాట్లాడుతూ ‘నా దృష్టిలో మెరుగైన ఫిట్నెస్ ఉన్న జట్టు మాది. ఫిట్‌నెస్‌పై లాంబర్డ్ చాలా శ్రద్ధ కనుబరుస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఫిట్‌గా ఉండేందుకు కష్టపడుతున్నారు. మేమంతా ఆయన సూచించిన ఆహార నియమాల్ని పాటిస్తున్నాం కాబట్టే మాలో ప్రతి ఒక్కరు అసాధారణ ఫిట్నెస్తో ఉన్నారు. మేమిప్పుడు స్వీట్లు, చాక్లెట్లు, మసాలా, నూనె పదార్థాలు తినటం మానేశాం. ఆరోగ్యాన్ని, శారీరక సత్తా పెంచే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. మైదానంలో శ్రమించేందుకు అవసరమైన సమతుల, పోషకాహారాన్ని తీసుకుంటున్నాం’ అని చెప్పింది. రాణి సేన ఇటీవల జపాన్‌లో జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ సిరీస్‌లో టైటిల్ నెగ్గింది. ఈ నేపథ్యంలో టోక్యో బెర్తుపైనే ప్రధానంగా దృష్టిపెట్టింది. నవంబర్‌లో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలు జరుగునున్న నేపథ్యంలో క్రీడాకారిణిల డైట్‌పై ఈ విధమైన ఆంక్షలు విధించారు. భారత మహిళల జట్టు వచ్చే నెలలో టోక్యోలో జరిగే నాలుగు దేశాల హాకీ టోర్నీలో తలపడనుంది. ఇందులో ఆతిథ్య దేశం జపాన్‌తో పాటు ఆస్ట్రేలియా తలపడనుంది. -
సెమీస్ లో భారత్
కెప్టెన్ రాణీ రాంపాల్ హ్యాట్రిక్ తో రాణించడంతో... ఇక్కడ జరుగుతున్న ఉమెస్స్ జూనియర్ ఆసియా కప్ లో భారత్ సెమీస్ లోకి అడుగు పెట్టింది. ఇవాళ మలేషియాతో జరిగిన నిర్ణాయక మ్యాచ్ లో భారత్ 9-1 తేడాతో విజయం సాధించింది. సెమీస్ చేరాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బారత్ దూకుడుగా ఆడింది. ఆట ప్రారంభమైన ఎనిమిదో నిమిషంలోనే చక్కటి ఫీల్డ్ గోల్ తో రాణీ కౌంట్ స్టార్ట్ చేసింది. తర్వాత 15వ నిమిషంలో జస్ ప్రీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి లీడ్ రెండుకు పెంచింది. హాఫ్ టైమ్ కి ఆరునిమిషాల ముందు ప్రీతీ దూబే గోల్ తో లీడ్ మూడుకు పెరిగింది. హాఫ్ టైమ్ కు కాస్త ముందు భారత డిఫెన్స్ ను దాటుకుని మలేషియ గోల్ చేయగలిగింది. సెకండ్ హాఫ్ లో భారత్ మహిళలు రెచ్చిపోయారు. ఆరు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ చేశారు. ఆట 51 నిమిషంలో పూనమ్ బల్రా ఫీల్డ్ గోల్ చేయగా.. జస్ ప్రీత్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ గా మలిచింది. దీంతో మలేసియా పై భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆదివారం సెమీ ఫైనల్ మ్యాచ్ జరగ నుంది. ఈ టోర్నీ వచ్చే ఏడాది జరగ నున్న ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచ కప్ కు క్వాలిఫైయ్యింగ్ టోర్నీ కావడం విశేషం. -
పోరాడి ఓడిన భారత్
మహిళల జూనియర్ ఆసియా కప్ లో భారత హాకీ జట్టు పోరాడి ఓడింది. ఇవాళ అతిథ్య జట్టు చైనాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 2-4 తేడాతో పరాజయం పాలైంది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్ ల్లో అదరగొట్టిన మనమ్మాయిలు.. పటిష్ట చైనా పైన మ్యాచ్ లో చమటోడ్చారు. మ్యాచ్ తొలి నుంచి చైనా ప్లేయర్లు భారత గోల్ పోస్టు పై పదే పదే దాడి చేశారు. దీంతో చైనాకు తొలి అర్థ భాగంలో నిమిషాల తేడాలో మూడు గోల్స్ లభించాయి. అయితే వెంటనే తేరుకున్న భారత డిఫెండర్లు చైనాను నిలువరించారు. ఇక జస్ ప్రీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంతో తొలి అర్ధ భాగంలో భారత్ ఒక గోల్ చేయగలిగింది. ఇక రెండో అర్ధ భాగంలో చైనా దూకుడును భారత డిఫెండర్ లు సమర్ధంగా అడ్డుకోడంతో.. చైనా కేవలం ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. ఆట ముగిసే ముందు గుర్ జిత్ కౌర్ మరో గోల్ చేయడంతో చైనా ఆధిక్యం 2కు తగ్గించగలిగింది. పూల్ లో మూడు విజయాలతో చైనా తొలి స్ధానం సాధించి.. సెమీస్ కు చేరింది. ఇక రెండో స్ధానం భారత్, మలేషియాలు పోటీ పడుతున్నాయి. రేపు జరిగే ముఖా ముఖి మ్యాచ్ లో మలేషియా గెలిస్తే.. సెమీస్ లో అడుగుపెడుతుంది. ఒక వేళ భారత్ గెలిస్తే.. భారత్ సెమీస్ బెర్త్ దక్కించు కుంటుంది. ఈ మ్యాచ్ డ్రా అయినా.. భారత్ కే సెమీస్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. ఈనెల 12 నుంచి నాకౌట్ మ్యాచ్ లు ప్రారంభమైతాయి.