భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా జర్మనీ మహిళల జట్టుతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్’లో 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ‘షూటౌట్’లో నెగ్గిన జర్మనీకి రెండు పాయింట్లు, భారత్‌కు ఒక పాయింట్ లభించాయి.
సాకేత్ ఖాతాలో 26వ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్‌లో 26వ అంతర్జాతీయ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. శనివారం భోపాల్‌లో ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట విజేతగా నిలిచింది. 56 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 6–1తో లోహితాక్ష–అభినవ్ సంజీవ్ (భారత్) జోడీపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment