ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత హాకీ జట్టు మరో అద్భుత విజయం సాధించింది. శుక్రవారం పూల్-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 3-2 తేడాతో భారత్ గెలుపొందింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ జట్టుపై భారత్ విజయం సాధించడం 52 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
చివరగా జర్మనీ వేదికగా జరిగిన 1972 ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ జట్టును భారత్ ఓడించింది. మళ్లీ ఇప్పుడు ప్యారిస్‌లో ఆస్ట్రేలియాను భారత హాకీ జట్టు చిత్తు చేసింది. ఇక ఈ విజయంతో టీమిండియా లీగ్ స్టేజి(పూల్-బి)ని రెండో స్ధానంతో ముగించింది. పూల్-బిలో బెల్జియం తొలి స్ధానంలో ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత విజయంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మరోసారి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన గోల్స్‌తో హర్మన్ ప్రీత్ మెరిశాడు. అతడితో పాటు అభిషేక్ ఓ గోల్ సాధించాడు. మరోవైపు ఆస్ట్రేలియా సెకెండ్ క్వార్టర్‌లో ఓ గోల్ సాధించగా.. ఆఖరి క్వార్టర్‌లో మరో గోల్ చేసింది. ఇక క్వార్టర్ ఫైనల్లో భారత్ జర్మనీ లేదా గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment