ఆసియా ఛాంపియ‌న్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్‌.. | Asian Champions Trophy: India beat China 1-0 to clinch record fifth title | Sakshi
Sakshi News home page

ఆసియా ఛాంపియ‌న్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్‌..

Published Tue, Sep 17 2024 5:20 PM | Last Updated on Tue, Sep 17 2024 6:14 PM

Asian Champions Trophy: India beat China 1-0 to clinch record fifth title

ఆసియా ఛాంపియ‌న్స్ హాకీ ట్రోఫీ-2024 విజేత‌గా భార‌త్ నిలిచింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఫైన‌ల్లో చైనాను 1-0 తేడాతో ఓడించిన భార‌త్‌.. వరుసగా రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో చివరి క్వార్టర్‌లో గోల్‌కొట్టిన జుగ్రాజ్ సింగ్.. టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు.

తొలి మూడు క్వార్ట‌ర్స్‌లోనూ ఇరు జ‌ట్ల డిఫెండ‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. మూడు క్వార్ట‌ర్స్ ముగిసే సరికి భార‌త్‌-చైనా జ‌ట్లు క‌నీసం ఒక్క గోల్ కూడా సాధించ‌లేక‌పోయాయి. ఆఖ‌రికి నాలుగో క్వార్ట‌ర్‌ 51వ నిమిషంలో డిఫెండర్ జుగ్‌రాజ్ సింగ్ అద్భుత‌మైన ఫీల్డ్ గోల్‌తో భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు.

ఐదో సారి..
కాగా టీమిండియా ఆసియా ఛాంపియ‌న్స్ హాకీ ట్రోఫీని సొంతం చేసుకోవడం ఇది ఐదోసారి. 2011, 2016, 2018, 2021 టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది. కాగా భారత హాకీ జట్టు ప్యారిస్‌ ఒలిపింక్స్‌లో కూడా సత్తాచాటింది. కాంస్య పతకంతో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన మెరిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement