రైస్ భరోసా
ఇంటిప్స్
వెండి వస్తువులు ఎక్కడ పెట్టినా త్వరగా రంగు మారుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఆ వస్తువులు ఉన్న చోట ఒక మూత లేని గిన్నెలో కొన్ని బియ్యం పోసి ఆ వస్తువుల పక్కనే పెట్టండి. గాల్లోని తేమనంతా బియ్యం లాక్కొని వస్తువుల రంగు మారనివ్వవు.
గాజు సీసాలు, పింగాణీ కుండీలను శుభ్రం చేయడం చాలా కష్టం. అలాంటప్పుడు వాటిలో పిడికెడు బియ్యం, కొద్దిగా సబ్బు పొడి, కొన్ని నీళ్లు పోసి జాగ్రత్తగా ఊపండి. అలా చేస్తే అడుగున ఉన్న మట్టి, మురికి శుభ్రమవుతుంది.లోహాలతో చేసిన పరికరాలను ఎక్కువ కాలం బయటపెడితే అవి తుప్పుపడుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే టూల్‌బాక్స్‌లో కొన్ని బియ్యం పోయండి. అవి గాలిలోని తేమను గ్రహించి పరికరాలకు తుప్పు పట్టకుండా చేస్తాయి.
అనుకోకుండా మీ ఫోన్ నీళ్లలో కానీ వర్షానికి గానీ తడిసిందా? అయితే వెంటనే బ్యాటరీ లాంటి భాగాలను విడివిడిగా తొలగించి ఓ గిన్నెలో కొన్ని బియ్యం పోసి అందులో పెట్టండి. మీ ఫోన్‌కు ఏ డ్యామేజీ ఉండదు. అలా కాకుండా హెయిర్ డ్రైయర్ వాడితే ఫోన్‌లోని మెటల్ భాగాలు కరిగిపోయే అవకాశం ఉంటుంది.