ఇంటిప్స్
గుప్పెడు ఉప్పును నీటిలో వేసి ఆ నీటితో గాజు, పింగాణీ పాత్రలను శుభ్రం చేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. లంచ్ బాక్స్ శుభ్రం చేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు వాసన వస్తుంటుంది. ప్లాస్టిక్ మూతలపై నూనె మరకలు కూడా పోవు. అలాంటప్పుడు నిమ్మ చెక్కతో పాత్రను రబ్ చేసి మరొకసారి కడగితే ఎలాంటి దుర్వాసన ఉండదు.పొడిబారిపోయి గట్టిపడ్డ గమ్ బాటిల్‌లో కొంచెం వెనిగర్ వేస్తే ఆ గమ్‌ను మళ్లీ వాడుకోవచ్చు. గడ్డ పెరుగుపై తేలిన నీటితో నల్లబడిన వెండి సామాన్లు కడిగితే కొత్తవాటిలా తయారవుతాయి. ఆపిల్ ముక్కలు కట్ చేయగానే, వాటికి కాస్త నిమ్మరసం రుద్దితే నల్లగా మారకుండా సహజమైన రంగులో ఉంటాయి.
టొమాటోలు లేని సీజన్‌లో ప్రత్యామ్నాయంగా టొమాటో కెచప్‌గాని, టొమాటో సాస్‌ని గాని గ్రేవీల్లో వాడితే పెద్దగా తేడా ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూరల్లో వాడేటప్పుడు అల్లం 60 శాతం, వెల్లుల్లి 40 శాతం ఉండేలా పేస్ట్ చేసుకోవాలి. శనగలు, రాజ్‌మాని ముందు రోజు నానబెట్టడం మరిచిపోతే, అరగంటపాటు వేడినీటిలో నానబెట్టి వండితే సరిపోతుంది. నూడుల్స్‌ని ఉడకబెట్టిన వెంటనే, చన్నీటిలో వేస్తే నూడుల్స్ విడివిడిగా అవుతాయి.