జైపూర్: అవు పాలలోనే కాదు, మేక పాలలోనూ పోషకాలు ఉంటాయి. కానీ అవి అదో రకమైన వాసన రావడం వల్ల ఎవరూ పెద్దగా తాగడానికి ఇష్టపడరు. మరి మగ మేక పాలు కూడా ఇలాగే ఉంటాయా? ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని విసుక్కోకండి. ఓ చోట నిజంగానే మగ మేక పాలిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విడ్డూరం రాజస్థాన్‌లో బయటపడింది. ఢోల్‌పూర్‌లోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్ కుశ్వాహ ఓ మగ మేకను పెంచుకుంటున్నాడు. (వీటిలో జాగ్వారేదో.. చిరుతేదో చెప్పగలరా?)
అది పాలివ్వడం గురించి ఆయన మాట్లాడుతూ.. "దాన్ని రెండున్నర నెలల వయసు ఉన్నప్పుడు తీసుకొచ్చి పెంచుకుంటున్నాం. ఆరు నెలల వయసొచ్చేసరికి దానికి పొదుగులు వచ్చాయి. మేకకు పాలు తాగించేందుకు ప్రయత్నిస్తే అదే తిరిగి పాలిచ్చింది. రోజుకు 200- 250 గ్రాముల పాలను ఉత్పత్తి చేస్తుంది" అని తెలిపారు. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్లే ఇలా జరుగుతుందని వెటర్నటీ సర్జన్ జ్ఞాన్ ప్రకాశ్ సక్సేనా వివరించారు. ఇలాంటి కేసులు లక్షల్లో ఒకటి వెలుగు చూస్తాయని ఆయన పేర్కొన్నారు. (ట్రోలింగ్: యూపీ పోలీసుల బిత్తిరి చర్య)
Comments
Please login to add a commentAdd a comment