తలకు మించిన పాగా | Beyond the head paga | Sakshi
Sakshi News home page

తలకు మించిన పాగా

Sep 19 2015 12:34 AM | Updated on Aug 21 2018 2:34 PM

తలకు మించిన పాగా - Sakshi

తలకు మించిన పాగా

సాధారణంగా ఎవరైనా తలకు మించిన భారాన్ని స్వచ్ఛందంగా తలకెత్తుకోరు.

తిక్క  లెక్క
సాధారణంగా ఎవరైనా తలకు మించిన భారాన్ని స్వచ్ఛందంగా తలకెత్తుకోరు. అయితే, సిక్కువీరుడు అవతార్‌సింగ్ మౌని మాత్రం ఇందుకు మినహాయింపు. తలకు మించిన పాగాను ఈ పెద్దమనిషి పదహారేళ్లుగా మోస్తూనే ఉన్నాడు. పాగాకు తగిలించిన వెండి అలంకరణల వల్ల దీని బరువు మరింత పెరిగినా, ఈయన మాత్రం ఏనాడూ ఈ పాగా లేకుండా బయట కనిపించడు. ఎందుకంటే, ఆయనకు అదో తుత్తి. ఈ పాగాకు వాడిన వస్త్రం పొడవు 645 మీటర్లు. పాగా బరువు 45 కిలోల పైమాటే! ఈయన కీర్తి ఈనోటా ఆనోటా... గిన్నిస్‌బుక్ వరకు వ్యాపించింది. ఈయనగారి పాగా ప్రపంచంలోనే అతిపెద్ద పాగాగా గిన్నిస్ బుక్ గత ఏడాది గుర్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement