తలకు మించిన పాగా
తిక్క లెక్క
సాధారణంగా ఎవరైనా తలకు మించిన భారాన్ని స్వచ్ఛందంగా తలకెత్తుకోరు. అయితే, సిక్కువీరుడు అవతార్సింగ్ మౌని మాత్రం ఇందుకు మినహాయింపు. తలకు మించిన పాగాను ఈ పెద్దమనిషి పదహారేళ్లుగా మోస్తూనే ఉన్నాడు. పాగాకు తగిలించిన వెండి అలంకరణల వల్ల దీని బరువు మరింత పెరిగినా, ఈయన మాత్రం ఏనాడూ ఈ పాగా లేకుండా బయట కనిపించడు. ఎందుకంటే, ఆయనకు అదో తుత్తి. ఈ పాగాకు వాడిన వస్త్రం పొడవు 645 మీటర్లు. పాగా బరువు 45 కిలోల పైమాటే! ఈయన కీర్తి ఈనోటా ఆనోటా... గిన్నిస్బుక్ వరకు వ్యాపించింది. ఈయనగారి పాగా ప్రపంచంలోనే అతిపెద్ద పాగాగా గిన్నిస్ బుక్ గత ఏడాది గుర్తించింది.