ఒక వ్యక్తి తన భార్యను 12 ఏళ్ల పాటు గదిలో బంధీగా ఉంచాడు. ఈ సమయంలో ఆమెకు టార్చర్ చూపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని ఇంటికి చేరుకోగా బాధితురాలు సెమీన్యూడ్ స్థితిలో శిరోముండనంతో పోలీసులకు కనిపించింది. ఆ మహిళ భర్త చేతిలో అత్యంత దయనీయమైన పరిస్థితులను చవిచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఉదంతం జర్మనీలో చోటుచేసుకుంది.
ఫోను చేతికి చిక్కడంతో..
53 ఏళ్ల నిందితుడిని పోలీసులు జర్మనీలోని ఫోర్‌బ్యాక్ పట్టణంలోని ఒక అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూమ్‌లో తమ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం 2011లో భర్త ఆమెను కిడ్నాప్ చేశాడు. రెండు రోజుల క్రితం ఆమెకు ఫోను అందుబాటులోకి రావడంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త తనను గత కొన్నేళ్లుగా హింసిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడని అరెస్టు చేశారు. తరువాత అతనిని.. భార్య తెలిపిన చిరునామాకు తీసుకువచ్చారు. అయితే నిందితుడు తన భార్యను దాచివుంచిన టార్చర్ రూం చూపించేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసుల తమదైన శైలిలో అతని చేత టార్చర్ రూమ్ తలుపులు తెరిపించారు.
సెమీ న్యూడ్‌గా బాధితురాలు
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక గదిలో బంధీగా పోలీసులకు కనిపించింది. భర్త ఆమెను ఇనుప తీగలతో కట్టేశాడు. ఆ గదిలోకి వెళ్లిన ముగ్గురు పోలీసులకు బాధితురాలు సెమీ న్యూడ్‌గా గుండుతో కనిపించింది. ఆమె చేతి వేళ్లు, కాలి వేళ్లు పనిచేయని స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. అలాగే ఆమెకు కొంతకాలంగా ఆహారం ఇవ్వడం లేదని కూడా పోలీసులు తెలుసుకున్నారు. టార్చర్ రూమ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది.
నోట్ బుక్‌లో టార్చర్ వివరాలు
ఆ ఇంటి ఇరుగుపొరుగువారు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటినుంచి ఒక మహిళ అరుపులు వినిపించేవని, తాము ఆ ఇంటి యజమానిని దీని గురించి అడిగినప్పుడు తన భార్యకు క్యాన్సర్ అని, బాధతో అలా అరుస్తుంటుందని చెప్పేవాడన్నారు. అయితే తాము ఎప్పుడూ ఆ బాధిత మహిళను చూడలేదని వారు తెలిపారు. అయితే పొరుగింటికి చెందిన ఒక వ్యక్తి తాను 10 ఏళ్ల క్రితం ఆ ఇంటిలో ఒక మహిళను చూశానని, ఇన్నాళ్లుగా కనిపించకపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందని, లేదా వేరే ప్రాంతానికి వెళ్లిందని అనుకున్నానని తెలిపారు. ఫ్రాన్సిసీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం పోలీసులకు ఆ ఫ్లాట్‌లో ఒక నోట్ బుక్ లభ్యమయ్యింది. దానిలో నిందితుడు తన భార్యను టార్చర్ పెట్టిన విధానాలను, ఆమెకు ఆహారం ఇచ్చిన తేదీలను రాశాడని సమాచారం.
ఇది కూడా చూడండి: చాలామంది డబ్బులు కట్టి మోసపోయారు.. ఆ ట్రాప్‌లో పడితే ... అంతే సంగతులు !
Comments
Please login to add a commentAdd a comment