![Afghanistan: Taliban Behead Junior Volleyball Player Women National Team - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/20/Volleyball-Player-Wome.jpg.webp?itok=n2Qdirdm)
కాబుల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరిపాలన పేరుతో రాక్షస పాలనను కొనసాగిస్తున్నారని ఇప్పటికే ప్రజలు నిరసనలు చేస్తున్నా, వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారి తమదే అన్నట్లు చెలరేగిపోతున్నారు. తాజాగా అఫ్గన్ జూనియర్ మహిళల జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికినట్లు ఆ జట్టు కోచ్ ఓ ప్రముఖ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అయితే ఈ దారుణానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు.
ఆ ఇంటర్యూలో.. కోచ్ అఫ్జలీ అక్టోబర్‌లో మహబజిన్ హకీమి అనే మహిళా క్రీడాకారిణిని తాలిబాన్లు చంపడంతో పాటు కిరాతకంగా ఆమె తలను నరికేశారని తెలిపింది. అయితే ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని తాలిబన్లు ఆమె కుటుంబాన్ని బెదిరించారని అందుకే తాను ఇప్పటి వరకు చెప్పలేకపోయినట్లు పేర్కొంది. మహబజిన్ అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున హకీమి ఆడేదని పైగా క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఆమె ఒకరని చెప్పింది. ఆగష్టులో తాలిబన్లు పూర్తి నియంత్రణ తీసుకోవడానికి ముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ చెప్పింది. ( చదవండి: VIDEO: బాబోయ్ అంత పెద్ద కొండచిలువనా? ఈ వైరల్ వీడియో వెనుక కథేంటంటే.. )
ప్రస్తుతం వాలీబాల్ జట్టులోని ఆటగాళ్లు, మిగిలిన మహిళా అథ్లెట్లు గత కొంత కాలంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు ఏ క్షణాన ఏం జరుగుతోందో అనే భయంతో బతుకుతున్నారని అఫ్జలీ వెల్లడించారు. ఈ క్రమంలో చాలా మంది క్రిడాకారులు ఎవరికీ కనిపించకుండా అండర్‌గ్రౌండ్‌లో కూడా జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. గత వారం, ఫిఫా, ఖతర్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్ నుంచి జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యులను, వారి కుటుంబ సభ్యులతో సహా 100 మంది మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ఆ దేశం నుంచి తరలించారు.
మరో వైపు ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చినప్పటి నుంచి క్రీడలు, రాజకీయ, సామాజిక రంగాలలో మహిళల కార్యకలాపాలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. బాలికల్లోనూ అత్యధికులు సెకండరీ స్కూలుకు వెళ్లడం కూడా మానేశారు. భవిష్యత్తులో అక్కడ ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తోందోనని అఫ్గన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
Mahjabin Hakimi, a member of the Afghan women's national volleyball team who played in the youth age group, was slaughtered by the Taliban in Kabul. She was beheaded.
— Sahraa Karimi/ صحرا كريمي (@sahraakarimi) October 19, 2021
@EUinAfghanistan @unwomenafghan https://t.co/wit0XFoUaQ
Comments
Please login to add a commentAdd a comment