women team
-
గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో ఈ సారి త్రివిధ దళాలకు చెందిన మహిళా బృందంతోపాటు.. మహిళా అగి్నవీర్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. త్రివిధ దళాలు, అగి్నవీర్‌ల్లోని మహిళా బృందం సంయుక్తంగా అడుగులో అడుగు వేసి ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26న సరికొత్త విన్యాసాలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఏ గణతంత్ర వేడుకల్లోనూ త్రివిధ దళాల ఉమ్మడి మహిళా దళం పరేడ్‌లో పాల్గొనలేదు. ఈ బృందానికి త్రివిధ దళాలకు చెందిన మహిళా ఆధికారులే నాయకత్వం వహిస్తారు. ఈసారి జరిగే బీటింగ్ రిట్రీట్‌లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలే వినిపించనున్నాయి. 1950 నుంచి జనవరి 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్ లో ‘అబైడ్ విత్ మి’ అనే విదేశీ స్వరాన్ని వాయించడం ఆనవాయితీ. అయితే దీనిపై విమర్శలు, వివాదం తలెత్తడంతో 2022లో నిలిపివేశారు. ఈసారి జరిగే బీటింగ్ రిట్రీట్‌లో పూర్తిగా స్వదేశీ స్వరాలే వాయించబోతున్నారు. -
ఆసీస్‌ను ఓడించాం
ముంబై: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు పదకొండో ప్రయత్నంలో ఆ్రస్టేలియా మహిళల జట్టుపై భారత జట్టు తొలిసారి టెస్టు విజయాన్ని అందుకుంది. ఇక్కడి వాంఖెడె మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన నాలుగు రోజుల ఏకైక టెస్టులో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సమష్టిగా ఆడితే ఎంతటి మేటి జట్టునైనా ఓడించవచ్చని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం నిరూపించింది. ఆ్రస్టేలియా నిర్దేశించిన 75 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌తో గత ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వారం తిరిగేలోపు మరో మేటి జట్టు ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ఈ ఏడాదిని దిగ్విజయంగా ముగించింది. రాణించిన స్నేహ్, రాజేశ్వరి ఆట చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 233/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా కేవలం 28 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 261 పరుగుల వద్ద ఆలౌటైంది. యాష్లే గార్డ్నర్ (7)ను ఆట రెండో ఓవర్లోనే పూజ వస్త్రకర్ వికెట్లముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్ పతనం మొదలైంది. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన అనాబెల్ సదర్లాండ్ (102 బంతుల్లో 27; 3 ఫోర్లు)ను...అలానా కింగ్ (0)ను వరుస బంతుల్లో స్నేహ్ రాణా అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు. చివరి రెండు వికెట్లను రాజేశ్వరి గైక్వాడ్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 261 పరుగులవద్ద ముగిసింది. 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్లోనే దెబ్బ పడింది. షఫాలీ వర్మ (4) నాలుగో బంతికి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత రిచా ఘోష్ (32 బంతుల్లో 13; 3 ఫోర్లు)తో కలిసి స్మృతి మంధాన (61 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించింది. రిచా అవుటయ్యాక జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి స్మృతి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 219; భారత్ తొలి ఇన్నింగ్స్: 406; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: బెత్ మూనీ (రనౌట్) 33; లిచ్‌ఫెల్డ్ (బి) స్నేహ్ రాణా 18; ఎలీస్ పెరీ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 45; తాలియా మెక్‌గ్రాత్ (బి) హర్మన్‌ప్రీత్ 73; అలీసా హీలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్మన్‌ప్రీత్ 32; అనాబెల్ సదర్లాండ్ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 27; యాష్లే గార్డ్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పూజ 7; జెస్ జొనాసెన్ (బి) రాజేశ్వరి 9; అలానా కింగ్ (బి) స్నేహ్ రాణా 0; కిమ్ గార్త్ (బి) రాజేశ్వరి 4; లారెన్ చీట్లె (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–49, 2–56, 3–140, 4–206, 5–221, 6–233, 7–251, 8–251, 9–260, 10–261. బౌలింగ్: రేణుక 11–4–32–0, పూజ వస్త్రకర్ 11–1–40–1, స్నేహ్ రాణా 22–5–66–4, దీప్తి శర్మ 22–7– 35–0, రాజేశ్వరి గైక్వాడ్ 28.4–11 –42–2, జెమీమా 2–0–13–0, హర్మన్‌ప్రీత్ 9–0–23–2. భారత్ రెండో ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అలీసా (బి) గార్త్ 4; స్మృతి మంధాన (నాటౌట్) 38; రిచా ఘోష్ (సి) తాలియా (బి) గార్డ్నర్ 13; జెమీమా (నాటౌట్)12; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.4 ఓవర్లలో రెండు వికెట్లకు) 75. వికెట్ల పతనం: 1–4, 2–55. బౌలింగ్: కిమ్ గార్త్ 5–1–19–1, యాష్లే గార్డ్నర్ 9–2–18–1, తాలియా 2–0–14–0, జెస్ జొనాసెన్ 2.4–0–16–0. 7: ఓవరాల్‌గా టెస్టు ఫార్మాట్లో భారత మహిళల జట్టు గెలిచిన టెస్టుల సంఖ్య. 1976 నుంచి 2023 వరకు భారత జట్టు 40 టెస్టులు ఆడింది. ఇందులో ఏడింటిలో గెలిచి, ఆరింటిలో ఓడిపోయింది. మిగతా 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 11: ఆస్ట్రేలియా జట్టుతో 1977 నుంచి 2023 మధ్యకాలంలో భారత్ 11 టెస్టులు ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ్రస్టేలియా చేతిలో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి, ఆరింటిని ‘డ్రా’ చేసుకుంది. 2: స్వదేశంలో భారత జట్టు ఒకే ఏడాది రెండు టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. భారత్ నెగ్గిన ఏడు టెస్టుల్లో నాలుగు స్వదేశంలో, మూడు విదేశీ గడ్డపై వచ్చాయి. హర్మన్‌ప్రీత్ కెపె్టన్సీలో భారత జట్టు ఆడిన రెండు టెస్టుల్లోనూ నెగ్గడం విశేషం. 9: గత 17 ఏళ్లలో భారత జట్టు తొమ్మిది టెస్టులు ఆడింది. ఇందులో ఒక టెస్టులో ఓడి, ఐదు టెస్టుల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. -
ఆల్ ఉమెన్ టీమ్
కొన్ని నాటకాలు మన జీవితాల్లో నుంచే నడిచొస్తాయి. మన జీవితాన్ని కొత్తగా చూపుతాయి. ఆలోచనలకు పదును పెడతాయి. ఆల్–ఉమెన్ బృందం ‘దేఖ్ బహెన్’ అచ్చంగా అలాంటి నాటకమే! తల్లి, కూతురు, భార్య, సోదరి, ప్రియురాలు... ఇలా రకరకాల పాత్రలలో ఉన్న మహిళలకు సంబంధించిన నాటకం దేఖ్ బహెన్. ఎనభై నిమిషాల నిడివిగల ఈ ఆల్–ఉమెన్ ప్లే రకరకాల మహిళలకు సంబంధించి రకరకాల భావోద్వేగాల సమ్మేళం. జీవితంలోని తీపి, చేదుల కలయిక. అస్త అరోర, ప్రీతి చావ్లా, ప్రేరణ చావ్లా, శిఖా తల్పానియా, తహీరనాథ్ కృష్ణన్ ఈ నాటకంలో నటించారు. ‘రచన అనేది సులువైన పనేమీ కాదు. కత్తి మీద సాము. కొన్నిసార్లు మనతో మనమే పోరాడవలసి ఉంటుంది. ఇది కఠినమైన ప్రయాణమే అయినప్పటికీ మంచి అనుభూతిని కలిగించే ప్రయాణం. ఎన్నో విలువైన జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకునే ప్రయాణం’ అంటుంది ప్లే రైటర్ దిల్షాద్ ఎడిబమ్ ఖురానా. నాటక రచనలో ఖురానాకు కో–రైటర్ తహీరనాథ్ క్రిష్ణన్ సహకరించారు. ఈ ఆప్తమిత్రులు నాటకరచన సమయంలో కొన్నిసార్లు ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకుంటారు. అలా అని మొండిగా వ్యవహరించరు. ఒకరి కాన్సెప్ట్ మరొకరికి నచ్చితే మళ్లీ ఆప్తమిత్రులు అవుతారు.‘నాటక రచనలో ఇద్దరు వ్యక్తులు పాలుపంచుకున్నప్పుడు వాదోపవాదాలు సహజమే. అలా ఉంటేనే నాటకం బలంగా వస్తుంది. కొన్ని విషయాల్లో మా ఇద్దరి ఆలోచనల్లో తేడా ఉన్నప్పటికీ అనేక విషయాల్లో మేము ఒకేలా ఆలోచిస్తాం. ఇదే మా బలం’ అని కో–రైటర్ తహీరనాథ్ క్రిష్ణన్ గురించి చెబుతుంది దిల్షాద్. ‘మహిళల బృందానికి సంబంధించిన నాటకం ఇది. నేల విడిచి సాము చేయని నాటకం. హృదయానికి దగ్గరయ్యే నాటకం. రంగస్థలంపై కనిపించే దృశ్యాలు మనల్ని నిజజీవిత దృశ్యాలతో మమేకమయ్యేలా చేస్తాయి. కొత్తగా ఆలోచించేలా చేస్తాయి. అతి నాటకీయత లేకుండా డైలాగులు సహజంగా ఉంటాయి’ అంటుంది కో–రైటర్ తహీరనాథ్ కృష్ణన్. ముంబైకి చెందిన ప్రేరణ చావ్లా ఈ నాటకానికి దర్శకత్వం వహించింది. ‘నన్ను సవాలు చేసే పనులను నెత్తికెత్తుకోవడం అంటే నాకు మొదటి నుంచి ఇష్టం. ఈ నాటకానికి డైరెక్టర్‌గా బాధ్యత తీసుకోవడం కూడా అలాంటిదే. టీమ్ నన్ను బలంగా నమ్మింది. ఆ నమ్మకమే నాకు మరింత బలాన్ని ఇచ్చింది. గొప్ప నటులతో పనిచేయాలనే నా కల దేఖ్ బహెన్ నాటకంతో నిజమైంది’ అంటుంది ప్రేరణ చావ్లా. నాటక రిహార్సెల్ కార్యక్రమాలు ముంబైలో మిలిటరీ క్రమశిక్షణ ప్రమాణాలతో సాగాయి. ‘మూస విధానంలో ఈ నాటకాన్ని రూపొందించలేదు. మహిళలకు సంబంధించిన అన్ని కోణాలను వ్యక్తీకరించే నాటకం ఇది’ అంటున్నారు నిర్మాత ఆకర్ష్. ఆకర్ష్ తప్ప ఈ నాటకానికి సంబంధించిన దర్శకులు, సాంకేతిక నిపుణులు, డిజైనర్లు, నటులు అందరూ మహిళలే. ‘స్క్రిప్ట్ నచ్చిన తరువాత నాటకం విషయంలో జోక్యం చేసుకోలేదు. వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాను. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ నాటకం గొప్పగా వచ్చేలా చేశారు. ఈ నాటకం ద్వారా మేము ముందడుగు వేసినట్లుగా భావిస్తున్నాం’ అంటున్నాడు ఆకర్ష్. -
T20 WC 2023: న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్
Morne Morkel: సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ న్యూజిలాండ్ కోచింగ్ స్టాఫ్‌లో భాగం కానున్నాడు. స్వదేశంలో జరుగనున్న మహిళా టీ20 ప్రపంచకప్ టోర్నీ నేపథ్యంలో వైట్ఫెర్న్స్కు బౌలింగ్‌లో మెళకువలు నేర్పించనున్నాడు. కివీస్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా 38 ఏళ్ల మోర్నీ మోర్కెల్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో నమీబియా పురుషుల జట్టు కోచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రొటిస్ పొట్టి లీగ్‌లో అతడు డర్బన్ సూపర్‌జెయింట్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. సౌతాఫ్రికాలో టోర్నీ ఈ క్రమంలో మెగా టోర్నీ నేపథ్యంలో న్యూజిలాండ్ ఈ మేరకు మోర్కెల్ నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం విశేషం. సౌతాఫ్రికాలో ఈ వరల్డ్‌కప్ జరుగనున్న తరుణంలో అక్కడి పిచ్‌ల గురించి అవగాహన ఉన్న మేటి బౌలర్‌ను తమ కోచ్‌గా ఎంపిక చేసుకోవడం గమనార్హం. కాగా 2006- 2018 మధ్య కాలంలో మోర్నీ మోర్కెల్ సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. జాతీయ జట్టు తరఫున మొత్తంగా 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ టెస్టులో 309, వన్డేల్లో 188, టీ20లలో 47 వికెట్లు తీశాడు. ఇక న్యూజిలాండ్ మహిళా జట్టు ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరిలో మహిళ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 10 చదవండి: IND vs SL: శ్రేయస్ అయ్యర్ సూపర్ బౌలింగ్.. కోహ్లి షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్ Sarfaraz Khan: అప్పుడేమో సిద్ధంగా ఉండమన్నారు! కానీ చివరకు.. నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి.. -
మార్పుల్లేకుండా ఆసియా కప్ టోర్నీకి...
న్యూఢిల్లీ: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో ఇటీవల ఇంగ్లండ్‌తో ఆడిన టి20 సిరీస్‌లో ఎలాంటి మార్పులు లేకుండా టీమ్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే 15 మందితో పాటు అదనంగా మరో ఇద్దరు ప్లేయర్లు తానియా భాటియా, సిమ్రన్ బహదూర్‌లకు స్టాండ్‌బైగా అవకాశం లభించింది.ఇంగ్లండ్‌తో సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఆడిన ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసియా కప్ అక్టోబర్ 1 నుంచి 15 వరకు బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. అక్టోబర్ 1న జరిగే తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో భారత మహిళల బృందం తలపడుతుంది. భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్, స్నేహ్ రాణా, హేమలత, మేఘనా సింగ్, రేణుక సింగ్, పూజ వస్త్రకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, కిరణ్ నవ్‌గిరే. స్టాండ్‌బై: తానియా భాటియా, సిమ్రన్ బహదూర్ . -
T20 Trophy: ఓటమితో నిష్క్రమించిన హైదరాబాద్
పుదుచ్చేరి: జాతీయ సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ జట్టు పరాజయంతో ముగించింది. కేరళతో ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆరు జట్లున్న గ్రూప్ ‘ఎ’ నుంచి మహారాష్ట్ర (16 పాయింట్లు), కేరళ (16 పాయింట్లు) నాకౌట్ దశకు అర్హత సాధించగా... ఒక మ్యాచ్‌లో మాత్రమే నెగ్గిన హైదరాబాద్ నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. కేరళతో మ్యాచ్‌లో మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 99 పరుగులు చేసింది. రమ్య (27; 3 ఫోర్లు), కీర్తి రెడ్డి (28; 2 ఫోర్లు) రాణించారు. అనంతరం కేరళ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 103 పరుగులు సాధించి గెలిచింది. ఇక ఈ విజయంపై స్పందించిన కేరళ కెప్టెన్ సంజన జట్టు సభ్యులను అభినందించింది. చదవండి: IPL 2022: ముంబై ఓటమి నం.8 -
Basketball Championship: రన్నరప్ తెలంగాణ
National Basketball Championship Runner Up Telangana- చెన్నై: జాతీయ సీనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 82–131 పాయింట్ల తేడాతో ఇండియన్ రైల్వేస్ జట్టు చేతిలో ఓడిపోయింది. రైల్వేస్ తరఫున పూనమ్ చతుర్వేది (26 పాయింట్లు), దర్శిని (19 పాయింట్లు), పుష్ప (19 పాయింట్లు), మధు కుమారి (16 పాయింట్లు) అదరగొట్టారు. తెలంగాణ తరఫున అన్బారసి (20 పాయింట్లు), ప్రియాంక (20 పాయింట్లు), అశ్వతి థంపి (18 పాయింట్లు) ఆకట్టుకున్నారు. పురుషుల ఫైనల్లో తమిళనాడు 87–69తో పంజాబ్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. చదవండి: IPL 2022: స్టొయినిస్ ఆటలు సాగనివ్వని కుల్దీప్... లక్నో జోరుకు బ్రేక్! -
ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి..
కాబుల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరిపాలన పేరుతో రాక్షస పాలనను కొనసాగిస్తున్నారని ఇప్పటికే ప్రజలు నిరసనలు చేస్తున్నా, వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారి తమదే అన్నట్లు చెలరేగిపోతున్నారు. తాజాగా అఫ్గన్ జూనియర్ మహిళల జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికినట్లు ఆ జట్టు కోచ్ ఓ ప్రముఖ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అయితే ఈ దారుణానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు. ఆ ఇంటర్యూలో.. కోచ్ అఫ్జలీ అక్టోబర్‌లో మహబజిన్ హకీమి అనే మహిళా క్రీడాకారిణిని తాలిబాన్లు చంపడంతో పాటు కిరాతకంగా ఆమె తలను నరికేశారని తెలిపింది. అయితే ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని తాలిబన్లు ఆమె కుటుంబాన్ని బెదిరించారని అందుకే తాను ఇప్పటి వరకు చెప్పలేకపోయినట్లు పేర్కొంది. మహబజిన్ అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున హకీమి ఆడేదని పైగా క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఆమె ఒకరని చెప్పింది. ఆగష్టులో తాలిబన్లు పూర్తి నియంత్రణ తీసుకోవడానికి ముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ చెప్పింది. ( చదవండి: VIDEO: బాబోయ్ అంత పెద్ద కొండచిలువనా? ఈ వైరల్ వీడియో వెనుక కథేంటంటే.. ) ప్రస్తుతం వాలీబాల్ జట్టులోని ఆటగాళ్లు, మిగిలిన మహిళా అథ్లెట్లు గత కొంత కాలంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు ఏ క్షణాన ఏం జరుగుతోందో అనే భయంతో బతుకుతున్నారని అఫ్జలీ వెల్లడించారు. ఈ క్రమంలో చాలా మంది క్రిడాకారులు ఎవరికీ కనిపించకుండా అండర్‌గ్రౌండ్‌లో కూడా జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. గత వారం, ఫిఫా, ఖతర్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్ నుంచి జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యులను, వారి కుటుంబ సభ్యులతో సహా 100 మంది మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ఆ దేశం నుంచి తరలించారు. మరో వైపు ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చినప్పటి నుంచి క్రీడలు, రాజకీయ, సామాజిక రంగాలలో మహిళల కార్యకలాపాలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. బాలికల్లోనూ అత్యధికులు సెకండరీ స్కూలుకు వెళ్లడం కూడా మానేశారు. భవిష్యత్తులో అక్కడ ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తోందోనని అఫ్గన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. Mahjabin Hakimi, a member of the Afghan women's national volleyball team who played in the youth age group, was slaughtered by the Taliban in Kabul. She was beheaded. @EUinAfghanistan @unwomenafghan https://t.co/wit0XFoUaQ — Sahraa Karimi/ صحرا كريمي (@sahraakarimi) October 19, 2021 చదవండి: Woman Eats Her Dead Husband Ashes: భర్తపై ఎనలేని ప్రేమ.. అతని చితాభస్మం కుళ్లిన వాసన వస్తున్నప్పటికీ.. -
భారత జట్లలో కల్పన, అంజలి, అరుంధతి
ముంబై: సీనియర్ మహిళల టి20 చాలెంజర్ ట్రోఫీలో పాల్గొనే భారత ‘ఎ’... ‘బి’... ‘సి’ జట్లను సోమవారం ప్రకటించారు. ఈ టోర్నీ జనవరి 4 నుంచి 11 వరకు కటక్‌లో జరుగుతుంది. భారత ‘బి’ జట్టులో ఆంధ్ర అమ్మాయిలు రావి కల్పన, అంజలి శర్వాణిలకు స్థానం లభించగా... భారత ‘సి’ జట్టులో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి ఎంపికైంది. భారత ‘ఎ’ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్... ‘బి’ జట్టుకు స్మృతి మంధాన... ‘సి’ జట్టుకు వేద కృష్ణమూర్తి సారథ్యం వహిస్తారు. -
మహిళకు సు‘భద్రతా’ వాహిని
సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం ముకుల్ శరణ్మాథుర్ తెలిపారు. సోమవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైల్వే భద్రతా దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్, కమర్షియల్ సిబ్బందితో ప్రత్యేక రక్షణ విభాగం ‘సుభద్ర వాహిని’ని ఆయన సోమవారం ప్రారంభించారు. సుభద్ర వాహినికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆయన ప్రారంభించారు. ఈ టీమ్‌లో 10 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, 10 మంది మహిళా టికెట్ తనిఖీ సిబ్బంది ఉంటారు. ఈ టీమ్‌కు ప్రత్యేక డ్రెస్‌ను కూడా ఆవిష్కరించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా శరణ్మాథుర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేకంగా కేటాయించిన టోల్‌ఫ్రీ నంబరు 182ను ఏ సమయంలోనైనా వినియోగించి ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. రైళ్లల్లో మహిళలకు ఎదురైయ్యే సమస్యలను ఈ బృందం పరిష్కరించడంలో సహకరిస్తారన్నారు. రైళ్లలో గానీ, రైల్వేస్టేషన్లలో గానీ మహిళలకు ఇబ్బందులు ఎదురుకాకుండా వీరు పని చేస్తుంటారు. ఒకొక్కసారి పురుష భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయడానికి మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వాల్తేరు డివిజన్లో మొట్టమొదటిసారిగా సుభద్రవాహిని టీంను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ఇటువంటి టీంను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని ఆయన తెలిపారు. ఈ కమిటీలో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్పీఎఫ్), సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్లు సభ్యులుగా ఉన్నారు. ఎవరైనా 182 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని, లేదా వాట్సాప్ నెంబరు 8978080777కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ విధంగా అందిన ఫిర్యాదులకు వెంటనే సమీప ఆర్పీఎఫ్ సిబ్బందికి చేరవేయడం ద్వారా వారిని అప్రమత్తం చేస్తారని, తద్వారా వెంటనే తప్పు చేసిన వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీనియర్ డీఎస్పీ జితేంద్ర శ్రీ వాత్సవ, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్‌కుమార్, సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చారుమతి, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భారత జట్లకు చుక్కెదురు
స్టార్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గైర్హాజరీ భారత బ్యాడ్మింటన్ జట్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రతిష్టాత్మక థామస్–ఉబెర్ కప్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత పురుషుల, మహిళల జట్లకు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలి లీగ్ మ్యాచ్‌లోనే ఓటమితో భారత జట్లకు నాకౌట్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. బ్యాంకాక్: కోచ్‌ల వ్యూహాత్మక తప్పిదమో... ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేశారో గానీ భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు మూల్యం చెల్లించుకుంది. థామస్ కప్‌లో భాగంగా ఫ్రాన్స్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–4తో ఓడిపోయింది. సింగిల్స్‌లో అగ్రశ్రేణి షట్లర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌ను... డబుల్స్‌లో మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంటను ఆడించకుండా విశ్రాంతి ఇవ్వడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–7, 21–18తో బ్రైస్ లెవెర్డెజ్ను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంట 13–21, 16–21తో బాస్టియన్ కెర్సాడీ–జూలియన్ మాయో జోడీ చేతిలో ఓడిపోయింది. స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో 21వ ర్యాంకర్ సమీర్ వర్మ 18–21, 22–20, 18–21తో ప్రపంచ 43వ ర్యాంకర్ లుకాస్ కోర్వీ చేతిలో ఓటమి చవిచూశాడు. దాంతో ఫ్రాన్స్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా జంట 10–21, 12–21తో థోమ్ గికెల్–రోనన్ లాబెర్ ద్వయం చేతిలో ఓడిపోవడంతో ఫ్రాన్స్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామ మాత్రమైన ఐదో మ్యాచ్‌లో జూనియర్ మాజీ వరల్డ్ నంబర్‌వన్ లక్ష్య సేన్ 20–22, 21–19, 19–21తో తోమా పపోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. ఇదే గ్రూప్‌లో చైనా కూడా ఉంది. నాలుగు జట్లున్న ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. సైనాకు షాక్... ఉబెర్ కప్‌లో భాగంగా కెనడాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు 1–4తో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ 21–15, 16–21, 16–21తో ప్రపంచ 14వ ర్యాంకర్ మిచెల్లి లీ చేతిలో పరాజయం పాలైంది. గతంలో మిచెల్లితో ఆడిన రెండుసార్లూ నెగ్గిన సైనాకు ఈసారి నిరాశ ఎదురైంది. రెండో మ్యాచ్‌లో రాచెల్ హోండెరిచ్ 21–11, 21–13తో జక్కా వైష్ణవి రెడ్డిని ఓడించి కెనడాకు 2–0తో ఆధిక్యం అందించింది. మూడో మ్యాచ్‌లో మేఘన–పూర్వీషా ద్వయం 21–19, 21–15తో మిచెల్లి టాంగ్–జోసెఫిన్ వు జంటను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో బ్రిట్నీ టామ్ 21–11, 21–15తో శ్రీకృష్ణప్రియపై నెగ్గడంతో కెనడా 3–1 తో విజయాన్ని దక్కించుకుంది. చివరి మ్యాచ్‌లో రాచెల్–క్రిస్టెన్ సాయ్ ద్వయం 21–14, 21–16తో సంయోగిత–ప్రాజక్తా జంటను ఓడించి కెనడాకు 4–1తో విజయాన్ని అందించింది. -
వరల్డ్ కప్ కు మహిళా క్రికెట్ జట్టు ఇదే..
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న మహిళా ట్వంటీ 20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును సెలక్షన్ ప్రకటించింది. శుక్రవారం భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ )సెలక్షన్ కమిటీ చీఫ్ సందీప్ పాటిల్ నేతృత్వంలో సమావేశమైన బోర్డు సభ్యులు జట్టును ఎంపిక చేశారు. ఈ నెలలో శ్రీలంకతో ఆడనున్న భారత మహిళల జట్టునే ఆసియా, టీ 20 వరల్డ్ కప్ టోర్నీలకు దాదాపు ఎంపిక చేశారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఎంపికతో పాటు, మహిళల జట్టును కూడా సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ రెండు టోర్నీలకు మిథాలీ రాజ్ కే పగ్గాలు అప్పజెబుతూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ నుంచి బంగ్లాదేశ్ ఆసియా కప్ ఆరంభం అవుతుండగా, మార్చి 15 నుంచి మహిళల టీ 20 వరల్డ్ కప్ భారత్ లో జరుగనుంది. ఆసియా కప్, టీ 20 వరల్డ్ కప్ లకు భారత మహిళా జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), జూలన్ గోస్వామి, స్మృతీ మందనా, వేదా కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్ కౌర్, శిఖా పాండే, రాజేశ్వరి గ్వైక్వాడ్, సుష్మా వర్మ, పూనమ్ యాదవ్, వీఆర్ వినీత, అనుజా పాటిల్, ఏక్తా బిస్త్, దీప్తి శర్మ, నిరంజనా నాగరాజన్, తిరుష్ కామిని -
మనోళ్లు... ఎన్నాళ్లిలా..!
ఉసేన్ బోల్ట్ పరుగు తీస్తుంటే ఊపిరి బిగబట్టుకుని చూశాం. కెన్యా ఇథియోపియా లాంటి దేశాల అథ్లెట్లు పతకాలు కొల్లగొడుతుంటే అవాక్కయ్యాం. మరి విశ్వవేదికపై మనమెక్కడ? 130 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారతదేశం ప్రపంచ అథ్లెటిక్స్ వేదికపై పతకాలు తెచ్చే అథ్లెట్స్‌ను ఎందుకు తయారు చేయలేకపోతోంది? ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చైనాలో వైభవంగా ముగిసింది. బోల్ట్ మెరుపులతో, ఇతర అథ్లెట్ల విన్యాసాలతో ప్రపంచం ఆనందించింది. కానీ చైనా పక్కనే ఉన్న భారత దేశం మాత్రం ఎప్పటిలాగే కళ్లు కాయలు కాచేలా పతకం కోసం ఎదురుచూసి నిరాశ చెందింది. నిజానికి మన అథ్లెట్లు ప్రపంచ పోటీల్లో పతకం తెస్తారనే ఆశ లేకపోయినా... మెరుగైన ప్రదర్శన కనబరచాలని కోరుకున్నాం. కానీ ఎప్పటిలాగే నిరాశనే మిగిల్చారు. గతంతో పోలిస్తే ఇంకా దిగజారారు కూడా. మనతో పోలిస్తే చాలా చిన్న దేశాలు కూడా పతకాలు కొల్లగొట్టాయి. కెన్యా ఎంతుంటుంది..? చాలా చిన్న దేశం. కానీ అథ్లెటిక్స్‌లో మాత్రం చెలరేగుతుంది. ఈసారి ఏకంగా ఏడు స్వర్ణాలతో కలిపి మొత్తం 16 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జమైకా ఏడు స్వర్ణాలతో కలిపి మొత్తం 12 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు చిన్న దేశాల ధాటికి గతంలో 10 సార్లు టాప్ ర్యాంక్‌లో నిలిచిన అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. ఆసియా స్థాయిలో ఫర్వాలేదు: ఆసియా స్థాయిలో భారత అథ్లెట్లు ఎప్పుడూ ఫర్వాలేదనే ప్రదర్శన కనబరుస్తారు. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో మనకు అన్నింటికంటే అత్యధికంగా అథ్లెటిక్స్‌లోనే 13 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణాలు కూడా ఉన్నాయి. మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా, 4x400 మీటర్ల రిలేలో మహిళల జట్టు స్వర్ణ పతకాలు సాధించాయి. ఈసారి ప్రపంచ అథ్లెటిక్స్‌కు సీమా అర్హత సాధించలేదు. రిలే జట్టు కేవలం హీట్స్ దశలోనే ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఆసియా క్రీడల్లో రజతాలు, కాంస్యాలు సాధించిన వారెవరూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తమ సత్తాను చాటుకోలేకపోయారు. ఎందుకిలా?: ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించాలంటే మంచి మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన శిక్షణ ఉండాలి. అయితే ఇవి లేకుండా కూడా పతకాలు సాధించొచ్చని కెన్యా, ఇథియోపియా, ఎరిత్రియా లాంటి చిన్న దేశాల అథ్లెట్లు నిరూపించారు. మన దగ్గర క్రీడలకు చాలా దేశాలతో పోలిస్తే మంచి సదుపాయాలే ఉన్నాయి. అయితే శిక్షణ, సదుపాయాల్లో కచ్చితమైన ప్రమాణాలను పాటించడం లేదనేది కూడా అంగీకరించాల్సిన వాస్తవం. మూలాల్లోకి వెళ్లాలి: ఇంత పెద్ద దేశంలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు దొరకరు అనుకోలేం. కానీ ప్రాథమిక స్థాయిలోనే మంచి అథ్లెట్లను ఒడిసిపట్టుకునే వ్యవస్థ లేకపోవడం అసలు సమస్య. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో జరిగే పోటీలపై దృష్టి పెట్టడం, పాఠశాల క్రీడలను మెరుగుపరచడం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ వీటిని ప్రణాళికా బద్ధంగా నిర్వహించే పరిస్థితి మన దగ్గర లేదు. కాబట్టి వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ముందు మూలాల్లోకి వెళ్లి చిన్న వయసులోనే అథ్లెట్లను గుర్తించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే... ప్రపంచ పతకం కోసం తర్వాతి తరాలు కూడా నిరీక్షించాల్సే ఉంటుంది. -సాక్షి క్రీడావిభాగం 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ ప్రస్థానం - మొత్తం 206 దేశాలు పాల్గొన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో మూడు దేశాలతో సంయుక్తంగా 65వ స్థానంలో నిలిచింది. 33 ఏళ్ల ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో 2003లో అంజూ జార్జి లాంగ్‌జంప్‌లో కాంస్యం సాధించింది. - 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో లలితా శివాజీ బాబర్ ఫైనల్లో ఎనిమిదో స్థానంలో నిలవడంతో ఒక్క పాయింట్ వచ్చింది. దీనివల్ల భారత్‌కు ప్లేసింగ్ టేబుల్లో కనీసం స్థానం దక్కింది. - మొత్తం 18 మంది అథ్లెట్లు ఈసారి పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ఆరుగురు 4x400 మీ. రిలే జట్టు సభ్యులు. నేరుగా ఫైనల్స్ జరిగే విభాగాలను మినహాయిస్తే... కేవలం మూడు విభాగాల్లోనే భారత అథ్లెట్లు ఫైనల్‌కు చేరారు. -
భారత జట్లకు క్లిష్టమైన ‘డ్రా’
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ న్యూఢిల్లీ: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ టీమ్ పోటీల్లో భారత జట్లకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. అంచనాలకు అనుగుణంగా సమష్టిగా రాణిస్తే మహిళల జట్టు సెమీఫైనల్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే పురుషుల జట్టు మాత్రం తొలి రౌండ్ దాటడమే అనుమానంగా ఉంది. దక్షిణ కొరియాలోని ఇంచియోన్ నగరంలో ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. బ్యాడ్మింటన్ టీమ్ విభాగం ‘డ్రా’ వివరాల ప్రకారం... పురుషుల విభాగంలో భారత జట్టు తొలి రౌండ్లో ఆతిథ్య దక్షిణ కొరియాతో తలపడుతుంది. భారత్ నెగ్గాలంటే మూడు సింగిల్స్ మ్యాచ్‌లపైనే ఆధారపడాలి. డబుల్స్‌లో కొరియాకు చెందిన మూడు జోడిలు టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఉన్నాయి. ఒకవేళ కొరియాను భారత్ ఓడిస్తే క్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన జపాన్ ఎదురవుతుంది. ఇక మహిళల విభాగంలో భారత జట్టు తొలి రౌండ్లో మకావు జట్టుతో ఆడుతుంది. ఈ రౌండ్ దాటితే క్వార్టర్ ఫైనల్లో 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల రన్నరప్ థాయ్‌లాండ్ ప్రత్యర్థిగా ఉంటుంది. థాయ్‌లాండ్‌పై భారత్ నెగ్గాలంటే సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, సింధు తప్పనిసరిగా గెలవడంతోపాటు డబుల్స్‌లో జ్వాల-అశ్విని పొన్నప్ప జంట కూడా విజయం సాధించాలి. భారత మహిళల జట్టు విశేషంగా ఆడితే సెమీఫైనల్ చేరుకోవచ్చు. ఆసియా క్రీడల్లో టీమ్ విభాగంతోపాటు వ్యక్తిగత విభాగాలలో సెమీఫైనల్ చేరుకుంటే జట్లకు కాంస్య పతకాలు ఖాయమవుతాయి.