కేరళ జట్టు కెప్టెన్ సంజన
పుదుచ్చేరి: జాతీయ సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ జట్టు పరాజయంతో ముగించింది. కేరళతో ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆరు జట్లున్న గ్రూప్ ‘ఎ’ నుంచి మహారాష్ట్ర (16 పాయింట్లు), కేరళ (16 పాయింట్లు) నాకౌట్ దశకు అర్హత సాధించగా... ఒక మ్యాచ్‌లో మాత్రమే నెగ్గిన హైదరాబాద్ నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.
కేరళతో మ్యాచ్‌లో మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 99 పరుగులు చేసింది. రమ్య (27; 3 ఫోర్లు), కీర్తి రెడ్డి (28; 2 ఫోర్లు) రాణించారు. అనంతరం కేరళ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 103 పరుగులు సాధించి గెలిచింది. ఇక ఈ విజయంపై స్పందించిన కేరళ కెప్టెన్ సంజన జట్టు సభ్యులను అభినందించింది.
చదవండి: IPL 2022: ముంబై ఓటమి నం.8
Comments
Please login to add a commentAdd a comment