
న్యూఢిల్లీ: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో ఇటీవల ఇంగ్లండ్‌తో ఆడిన టి20 సిరీస్‌లో ఎలాంటి మార్పులు లేకుండా టీమ్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే 15 మందితో పాటు అదనంగా మరో ఇద్దరు ప్లేయర్లు తానియా భాటియా, సిమ్రన్ బహదూర్‌లకు స్టాండ్‌బైగా అవకాశం లభించింది.ఇంగ్లండ్‌తో సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఆడిన ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసియా కప్ అక్టోబర్ 1 నుంచి 15 వరకు బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. అక్టోబర్ 1న జరిగే తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో భారత మహిళల బృందం తలపడుతుంది.
భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్, స్నేహ్ రాణా, హేమలత, మేఘనా సింగ్, రేణుక సింగ్, పూజ వస్త్రకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, కిరణ్ నవ్‌గిరే. స్టాండ్‌బై: తానియా భాటియా, సిమ్రన్ బహదూర్ .
Comments
Please login to add a commentAdd a comment