సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో ఈ సారి త్రివిధ దళాలకు చెందిన మహిళా బృందంతోపాటు.. మహిళా అగి్నవీర్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. త్రివిధ దళాలు, అగి్నవీర్‌ల్లోని మహిళా బృందం సంయుక్తంగా అడుగులో అడుగు వేసి ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26న సరికొత్త విన్యాసాలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఏ గణతంత్ర వేడుకల్లోనూ త్రివిధ దళాల ఉమ్మడి మహిళా దళం పరేడ్‌లో పాల్గొనలేదు.
ఈ బృందానికి త్రివిధ దళాలకు చెందిన మహిళా ఆధికారులే నాయకత్వం వహిస్తారు. ఈసారి జరిగే బీటింగ్ రిట్రీట్‌లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలే వినిపించనున్నాయి. 1950 నుంచి జనవరి 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్ లో ‘అబైడ్ విత్ మి’ అనే విదేశీ స్వరాన్ని వాయించడం ఆనవాయితీ. అయితే దీనిపై విమర్శలు, వివాదం తలెత్తడంతో 2022లో నిలిపివేశారు. ఈసారి జరిగే బీటింగ్ రిట్రీట్‌లో పూర్తిగా స్వదేశీ స్వరాలే వాయించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment