Kartavya Path
-
Republic Day 2024: నారీశక్తి విశ్వరూపం
న్యూఢిల్లీ: భారత 75వ గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. శుక్రవారం ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టాయి. ఆర్మీ మిలిటరీ పోలీస్ విభాగానికి చెందిన కెపె్టన్ సంధ్య సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. నేవీ, డీఆర్డీఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆసాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్లు గగుర్పొడిచేలా డేర్‌డెవిల్ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు. బీఎస్ఎఫ్, సీఆరీ్ప ఎఫ్ మొదలుకుని ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వీటన్నింటినీ ఆసాంతం ఆస్వాదిస్తూ కని్పంచారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్‌లో ముర్ము, మేక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు. 90 నిమిషాలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వణికించే చలిని, దట్టంగా కమ్మేసిన పొగ మంచును లెక్క చేయకుండా భారీ జనసందోహం వేడుకలను తిలకించింది. ఈసారి ఏకంగా 75 వేల మందికి పైగా గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. మోదీ వారితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. ఫొటోలు, సెలీ్ఫలకు పోజులిచ్చారు. ఆయన ధరించిన రంగురంగుల బంధనీ తలపాగా ఆహూతులను ఆకట్టుకుంది. మోదీ రాక సందర్భంగా భారత్ మాతా కీ జై అంటూ వారు చేసిన నినాదాలతో కర్తవ్య పథ్ మారుమోగింది. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల కవాతు దళం, 30 మందితో కూడిన సైనిక వాయిద్య బృందం కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. చివరగా వాయుసేనకు చెందిన 29 యుద్ధ విమానాలు, ఏడు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు, ఒక హెరిటేజ్ ప్లేన్‌తో పాటు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ ఏ330 మల్టీ ట్యాంకర్ రావాణా విమానం, రెండు రాఫెల్ ఫైటర్ జెట్లు చేసిన ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ విన్యాసాల్లో కూడా 15 మంది మహిళా పైలట్లు పాల్గొనడం విశేషం. అలరించిన నాగ్ మిసైల్ వ్యవస్థ ► వేడుకల్లో ప్రదర్శించిన టీ–90 భీష్మ ట్యాంకులు, నాగ్ మిసైల్ వ్యవస్థ, తేజస్ వంటి యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్ వ్యవస్థ స్వాతి, డ్రోన్లను జామ్ చేసే వ్యవస్థ, అత్యాధునిక ఎల్రక్టానిక్ వార్ఫేర్ వ్యవస్థ, క్యూఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులు అలరించాయి. మోదీ నివాళులు శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ తొలుత నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. దేశమాత రక్షణలో ప్రాణాలొదిలిన సైనిక వీరులకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముర్ము, మేక్రాన్ గుర్రపు బగ్గీలో వస్తున్న దృశ్యాలను కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించేందుకు జనం పోటీ పడ్డారు. అనంతరం జెండా వందనం, జాతీయ గీతాలాపన, 105 ఎంఎం దేశీయ శతఘ్నులతో 21 గన్ సెల్యూట్ అందరినీ ఆకట్టుకున్నాయి. భారత కీర్తి పతాకను వినువీధిలో ఘనంగా ఎగరేసిన చంద్రయాన్ థీమ్‌తో రూపొందిన శకటం అలరించింది. దాంతోపాటు అయోధ్య రామాలయ ప్రారంభం నేపథ్యంలో కొలువుదీరిన బాలక్ రామ్ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర శాఖలకు సంబంధించి 9 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. వేడుకలు ముగిశాక మోదీ కర్తవ్య పథ్ పొడవునా కాలినడకన సాగి ఆహూతులను అలరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు వాటిలో పాల్గొన్నారు. గొప్ప గౌరవం: మేక్రాన్ ‘‘గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాతో పాటు ఫ్రాన్స్‌కు కూడా గొప్ప గౌరవం. థాంక్యూ ఇండియా. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. వేడుకల అనంతరం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది ఆరోసారి కావడం విశేషం! ఈ వేడుకలకు దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహా్వనించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా (1995లో) మొదలుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015లో) దాకా ఎందరో అధినేతలు వీటిలో భాగస్వాములయ్యారు. దేశాధినేతల అభినందనలు బ్రిటన్ రాజు చార్లెస్ 3 మొదలుకుని ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు దాకా పలు దేశాల అధినేతలు భారత్‌కు 75వ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. అభినందన సందేశాలతో సామాజిక వేదికల్లో పోస్టులు పెట్టారు. భారత్‌తో బ్రిటన్ సంబంధాలు నానాటికీ పటిష్టమవుతున్నాయని రాష్ట్రపతి ముర్ముకు పంపిన సందేశంలో కింగ్ చార్లెస్ హర్షం వెలిబుచ్చారు. -
Republic Day 2024: అలా అనకూడదని తెలుసా?
Republic Day Celebrations 2024: ఇవాళ జెండా పండుగ. గణతంత్ర దినోత్సవం. అయితే ఇవాళ జెండా ఎగరేయడం అనొద్దు అంట. అది ముమ్మాటికీ తప్పంట. ఆవిష్కరించడం అనలాట. ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పైగా ఇవాళ జెండా ఆవిష్కరించబోయేది రాష్ట్రపతి. ఈ వేడుకలకు ప్రధాని హాజరైనా జెండా మాత్రం ఆవిష్కరించరు. ప్రధాని కేవలం స్వాత్రంత్య దినోత్సవం నాడు ప్రధాని జెండా ఎర్రకోటపై ఎగరేయడానికి.. జనవరి 26న రాష్ట్రపతి జెండా ఆవిష్కరించడానికి గల కారణం.. ఆ ఆనవాయితీ ఎన్నేళ్ల నుంచి కొనసాగుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి.. జనవరి 26 రిపబ్లిక్ డే, ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే.. ఈ రెండు తేదీలలో దేశవ్యాప్తంగా జెండాను రెపరెపలాడిస్తారు. పంద్రాగష్టున ప్రధాని ఎర్రకోటలో జెండా ఎగరేస్తారు. అయితే ఈ రోజు జనవరి 26న రాష్ట్రపతి న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జెండా ఆవిష్కరిస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. కాబట్టే దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాం. అదే ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగుతారు. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. కాబట్టే.. జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేశారు. అది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీక. అదలా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. నేడు రాష్ట్రపతి.. ఆరోజున ప్రధాని.. కారణం ఇదే.. ఇక్కడ గమనించాల్సిన మరో వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఘనంగా పరేడ్ నిర్వహిస్తారు. ఇక.. దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి ప్రత్యేకంగా కారణం చెప్పనక్కర్లేదు. ఎర్రకోటపై జెండా ఎగరేశారక ఆయన ప్రసంగం ఇస్తారు. -
‘కర్తవ్య పథ్’లోనే గణతంత్ర వేడుకలు ఎందుకంటే..
భారతదేశం రేపు (జనవరి 26) 75వ గణతంత్ర దినోత్సవాలను చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర బిందువు న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్ (గతంలో రాజ్‌పథ్). ఇక్కడ జరిగే రిపబ్లిక్ డే పరేడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పరేడ్‌లో సాయుధ బలగాలకు చెందిన మూడు శాఖల బృందాలు చేసే కవాతు, ఆయుధాలు, సైనిక పరికరాల ప్రదర్శనలు, మోటార్ సైకిల్ విన్యాసాలు భారతదేశ సైనిక సత్తాను చాటుతాయి. ఈ సంవత్సరం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఆహ్వానించారు. ‘కర్తవ్య పథ్’ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రదేశానికి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1911లో బ్రిటిష్ సర్కారు తన రాజధానిని కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) నుండి ఢిల్లీకి మార్చిన తర్వాత ఈ రహదారిని నిర్మించి, ‘కింగ్స్‌వే’ అనే పేరు పెట్టింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రహదారిని ‘రాజ్‌పథ్’గా మార్చారు. ఆ తరువాత దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరుపెట్టారు. ఇది కూడా చదవండి: గణతంత్ర దినోత్సవ థీమ్ ఏమిటి? ముఖ్య అతిథి ఎవరు? గత ఏడు దశాబ్దాలుగా అంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వార్షిక గణతంత్ర దినోత్సవ వేడుకలను ‘కర్తవ్య పథ్’లోనే నిర్వహిస్తున్నారు. ఈ రహదారి వలస పాలన నుంచి సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం వరకు సాగిన భారతదేశ ప్రయాణానికి చిహ్నంగా నిలిచింది. 2022లో ‘రాజ్‌పథ్’ను ‘కర్తవ్య పథ్’గా మార్చారు. అనంతరం దీనికి సెంట్రల్ విస్టా అవెన్యూలో చేర్చారు. ఒకప్పడు ‘రాజ్‌పథ్’ అధికార చిహ్నంగా ఉండేది. దానిని ‘కర్తవ్య పథ్’గా మార్చాక ఈ రహదారి సాధికారతకు చిహ్నంగా మారింది. ‘కర్తవ్య పథ్’ ప్రారంభోత్సవాన ప్రధాని మోదీ మాట్లాడుతూ నాటి ‘కింగ్స్‌వే’ లేదా ‘రాజ్‌పథ్’ బానిసత్వానికి చిహ్నంగా నిలిచిందని, ఇటువంటి గుర్తింపును శాశ్వతంగా తుడిచివేయడానికే దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. -
గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో ఈ సారి త్రివిధ దళాలకు చెందిన మహిళా బృందంతోపాటు.. మహిళా అగి్నవీర్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. త్రివిధ దళాలు, అగి్నవీర్‌ల్లోని మహిళా బృందం సంయుక్తంగా అడుగులో అడుగు వేసి ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26న సరికొత్త విన్యాసాలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఏ గణతంత్ర వేడుకల్లోనూ త్రివిధ దళాల ఉమ్మడి మహిళా దళం పరేడ్‌లో పాల్గొనలేదు. ఈ బృందానికి త్రివిధ దళాలకు చెందిన మహిళా ఆధికారులే నాయకత్వం వహిస్తారు. ఈసారి జరిగే బీటింగ్ రిట్రీట్‌లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలే వినిపించనున్నాయి. 1950 నుంచి జనవరి 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్ లో ‘అబైడ్ విత్ మి’ అనే విదేశీ స్వరాన్ని వాయించడం ఆనవాయితీ. అయితే దీనిపై విమర్శలు, వివాదం తలెత్తడంతో 2022లో నిలిపివేశారు. ఈసారి జరిగే బీటింగ్ రిట్రీట్‌లో పూర్తిగా స్వదేశీ స్వరాలే వాయించబోతున్నారు. -
నేతాజీ జీవిత రహస్యాలతో...
‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించి మీరు ఎప్పుడూ వినని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందుకే మొదటి టీజర్‌ని నేతాజీ విగ్రహం వద్ద విడుదల చేయాలనుకున్నాం. ఇక్కడ టీజర్‌ను విడుదల చేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాం. నేతాజీ జీవితంపై సాగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రం ఇది’’ అన్నారు నిఖిల్. స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ జీవితంలోని రహస్యాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘స్పై’. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర రిలీజ్ చేశారు. నేతాజీ మరణం తాలూకు మిస్టరీని ఛేదించే స్పై పాత్రలో నిఖిల్ కనిపిస్తారు. ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలుగా, ప్రత్యేక పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపించనున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్. -
ఢిల్లీలో ఘనంగా 74వ రిపబ్లిక్ డే.. అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రత్యేక అతిథి, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా పాల్గొన్నారు. సైనికులు కవాతు నిర్వహించి వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం 21 గన్‌సెల్యూట్‌తో త్రివర్ణపతాక ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకల్లో ప్రదర్శించిన 23 శకటాలు దేశంలో భిన్న సంస్కృతిని ప్రతిబింబించాయి. 17 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించారు. ఈ ఈజిప్టు సైనికులు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశనలుమూల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. సైనికుల సాహసాలు అబ్బురపరిచాయి. ఆత్మనిర్బర్ భారత్.. ఆత్మనిర్బర్ భారత్ ప్రతిబించేలా ఈసారి వేడుకల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలనే ప్రదర్శించారు. 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ తుపాకులు, ఇటీవలే సైన్యంలో చేరిన ఎల్సీహెచ్ ప్రచండ్, కే-9 వజ్ర హోవిట్జర్, ఎంబీటీ అర్జున్, నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్స్‌ను ప్రదర్శించారు. పరేడ్ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించడంతో గణతంత్ర వేడుకలు ముగిశాయి. 11:20 AM అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన.. కర్తవ్యపథల్ గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన అబ్బురపరిచింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతింబింబించేలా ఉన్న ఈ శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. అలాగే గుజరాత్, అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. The tableau of Andhra Pradesh depicts 'Prabhala Theertham'- a festival of the peasantry during Makara Sankranti, at the Republic Day parade pic.twitter.com/YXPdmuUFET — ANI (@ANI) January 26, 2023 10:30 AM పరేడ్‌లో రాష్ట్రపతి, ప్రధాని.. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వేడుకలకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా గణతంత్ర పరేడ్‌లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. 21-గన్ సెల్యూట్‌తో జాతీయ గీతం ఆలపించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ గణతంత్ర పరేడ్‌లో ఈజిప్టు సైన్యం కూడా పాల్గొంది. Delhi | President Droupadi Murmu leads the nation in celebrating Republic Day Egypt’s President Abdel Fattah al-Sisi attends the ceremonial event as the chief guest Simultaneously, National Anthem and 21-gun salute presented pic.twitter.com/hi3joxFs57 — ANI (@ANI) January 26, 2023 10:20 AM పరేడ్‌కు రాష్ట్రపతి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాతో కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్‌కు బయల్దేరారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అక్కడ ఘనంగా నిర్వహించే 74వ గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. Delhi | President Droupadi Murmu and Egyptian President Abdel Fattah El –Sisi depart from the Rashtrapati Bhavan to attend the Republic Day celebrations at Kartavya Path pic.twitter.com/tvhgjnwsC7 — ANI (@ANI) January 26, 2023 10:10 AM అమరులకు మోదీ నివాళులు.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులను స్మరించుకున్నారు. అనతరం కర్తవ్య పథలో గణతంత్ర పరేడ్‌కు హాజరవుతారు. #RepublicDay | PM Modi leads the nation in paying homage to the fallen soldiers at the National War Memorial in Delhi pic.twitter.com/CE9B2CPZmB — ANI (@ANI) January 26, 2023 న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్‌లో నిర్వహించే గణతంత్ర పరేడ్‌కు అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో పరేడ్ ప్రారంభం కానుంది. మొదట జాతీయ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ పరేడ్‌లో పాల్గొననున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ హాజరవుతున్నారు. ఈజిప్టు సైన్యం కూడా కవాతులో పాల్గొంటుంది. ఈ సారి నిర్వహించే పరేడ్ ప్రత్యేకంగా ఉండనుంది. సైనిక శక్తిసామర్థ్యాలతో పాటు, భారతీయ భిన్న సంస్కృతి, స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతో పాటు మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించనున్నారు. వారం రోజుల పాటు జరుగుతున్న గణతంత్ర వేడుకలు జనవరి 23న నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రారంభమయ్యాయి. జనవరి 24, 25 తేదీల్లో 'ఆది శౌర్య- పర్వ్ పరాక్రమ్ కా' ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఢిల్లీలో నిర్వహించారు. -
కర్తవ్యపథ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
కర్తవ్యపథ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రక మార్గమైన రాజ్‌పథ్.. కర్తవ్యపథ్గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. కొత్త రూపం సంతరించుకున్న ఈ సెంట్రల్ విస్టా స్ట్రెచ్‌ను కాసేపటి కిందట ప్రధాన మంత్రి నరేంద్రం మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు సైతం పాల్గొన్నారు. గురువారం సాయంత్రం.. ఇండియా గేట్ దగ్గర 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ముందుగా ఆవిష్కరించారు. పూలు జల్లి స్వాతంత్ర ఉద్యమ వీరుడికి నివాళి అర్పించారు. అనంతరం కర్తవ్యపథ్ మార్గాన్ని ఆయన ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి.. రైజినా హిల్స్ రాష్ట్రపతి భవన్ దాకా మూడున్నర కిలోమీటర్ల మేర కర్తవ్యపథ్ కొత్త హంగులతో సిద్ధమైంది ఇప్పుడు. PM Modi inaugurates all new redeveloped Rajpath as Kartvyapath in New Delhi pic.twitter.com/owdlU05VKl — ANI (@ANI) September 8, 2022 #WATCH | PM Narendra Modi unveils the statue of Netaji Subhas Chandra Bose beneath the canopy near India Gate (Source: DD) pic.twitter.com/PUJf4pSP9o — ANI (@ANI) September 8, 2022 వలస పాలనలోని అవశేషాలు, కట్టడాల తొలగింపులో భాగంగా నరేంద్ర మోదీ హయాంలోని కేంద్రం ప్రభుత్వం పలు పేర్లను మార్చేయడం, కట్టడాలను పునర్మించడం చేస్తోంది. నూతన పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసం-కార్యాలయంతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తున్న వాళ్లను శ్రమజీవులుగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తానని స్వయంగా వాళ్లతోనే వెల్లడించారు కూడా. అనంతరం సెంట్రల్ విస్టా అవెన్యూ పునరద్దరణ ప్రాజెక్టును ప్రధాని మోదీ పరిశీలించారు. Shedding Colonial Past! A Special Day for India - Visuals of the Central Vista Avenue#KartavyaPath pic.twitter.com/rP2QSipyuS — Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) September 8, 2022 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ రోజు అతిపెద్ద పరివర్తన ప్రాజెక్టు ఆవిష్కృతమవుతోంది. కర్తవ్య మార్గం దేశరాజధాని గుండెలాంటిది. ఈ దేశ ప్రజలకు సేవ చేయడమే మన కర్తవ్యం. వారిని పాలించడం కాదని గుర్తు చేసేందుకే కర్తవ్య మార్గం అని పేరుపెట్టాం అని కేంద్రం మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. #WATCH | PM Modi interacts with workers who were involved in the redevelopment project of Central Vista in Delhi PM Modi told 'Shramjeevis' that he will invite all of them who worked on the redevelopment project of Central Vista for the 26th January Republic Day parade pic.twitter.com/O4eNAmK7x9 — ANI (@ANI) September 8, 2022 20 నెలల తర్వాత పునరాభివృద్ధి పనుల అనంతరం ఈ మార్గం(కర్తవ్యపథ్).. ప్రజా సందర్శనార్థం రేపటి(శుక్రవారం) నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. సరికొత్త హంగులతో కర్తవ్యపథ్ జనాలను ఆకట్టుకుంటుందని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: రాజ్‌పథ్‌ను కట్టిందెవరు? చారిత్రక నేపథ్యం వెనుక ఆసక్తికరమైన అంశాలెన్నో.. -
రాజ్‌పథ్ ఇక గతం.. కర్తవ్యపథ్ ఎంతో ఘనం
నిత్యం జనాల కోలాహలంతో సందడిగా ఉండే చారిత్రక మార్గం అది. అలాంటిది దాదాపు 20 నెలల పాటు మూగబోయింది అది. ఇప్పుడు కొత్త పేరుతో.. సరికొత్త హంగులతో సందర్శకులకు స్వాగతం పలకనుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ స్ట్రెచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. కర్తవ్య పథ్‌గా మారిన రాజ్‌పథ్ నేపథ్యం ఓసారి గుర్తు చేసుకుందాం. రాజ్‌పథ్.. చారిత్రక మార్గం. ఈ పేరు వినగానే గణతంత్ర దినోత్సవం నాడు జరిగే సైనిక పరేడ్లు, విన్యాసాలు గుర్తుకు రావడం ఖాయం. ఢిల్లీ వాసులకైతే ఇదొక సేదతీరే అడ్డా. చలికాలం సీజన్లో సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంటారు అక్కడి ప్రజలు. అక్కడే ఉన్న రైల్ భవన్, శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, విజ్ఞాన్ భవన్ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయాల్లో ఇక్కడే సేద తీరుతుంటారు. రాజధాని చూడడానికి వచ్చే యువత, జంటలు, కుటుంబాలు చాలావరకు ఇక్కడే టైం పాస్ చేస్తుంటాయి. నేరెడు చెట్లు, ఇంకా ఎన్నో నీడను పంచేవి. అలాంటి.. దారి రూపం.. పేరు మారిపోయాయి. అధికారికంగా ఇప్పుడది కర్తవ్య పథ్ అయ్యింది. బుధవారం అంటే ఇవాళ(సెప్టెంబర్ 7, 2022).. జరిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ భేటీ రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్‌గా మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. ► ప్రధాని నరేంద్ర మోదీ కొత్తరూపం సంతరించుకున్న ఈ మార్గాన్ని ప్రారంభిస్తారు. కానీ, సాధారణ ప్రజానీకం మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా ఒక్కరోజు తర్వాతే(శుక్రవారం) నుంచి ఈ కొత్తదారిని వీక్షించొచ్చు. ఈమధ్యలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయని ఢిల్లీ వాసులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ► ప్రజాశక్తీకి నిదర్శనంగా ఉండేందుకే కర్తవ్యపథ్గా అనే పేరుపెట్టినట్లు కేంద్రం చెబుతోంది. వసలవాద మైండ్‌సెట్‌ను తొలగించే క్రమంలో భాగంగానే.. అప్పటి పేర్లు, కట్టడాలను మార్చేయాలనే గట్టి ఉద్దేశంతో ఉంది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ► 1911లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ సమయంలో నిర్వహించిన దర్బార్ కోసం వచ్చిన అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ 5 ఢిల్లీకి వచ్చారు. ఆ టైంలోనే వైశ్రాయ్ భవన్(నేటి రాష్ట్రపతి భవన్) దాకా ఒక రాచబాటను వాడుకలోకి తీసుకొచ్చారు. అదే తర్వాత రాజ్‌పథ్(కర్తవ్యపథ్) అయ్యింది. ► లండన్‌లో జార్జ్ 5 తండ్రి ఎడ్వర్డ్ 7 స్మారకార్థం 1905లో ‘కింగ్స్‌వే’ను ప్రారంభించారు. రాజ్‌పథ్ నమునా కూడా కింగ్స్‌వేను దాదాపుగా పోలి ఉంటుంది. దీంతో ఆనాడు ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్న పెర్సివల్ స్పియర్.. ఢిల్లీ రాజమార్గానికి ‘కింగ్స్‌వే’ పేరును ప్రతిపాదించారు. దీంతో మనదగ్గరా కింగ్స్వేగానే అది ఉండిపోయింది. ► అయితే స్వాతంత్రం అనంతరం ఢిల్లీ కింగ్స్‌వే పేరును.. రాజ్‌పథ్ అని మార్చేశారు. 1961లో ఈ పేరు మారింది. ► రాజ్‌పథ్ నిర్మించింది.. సర్దార్ నారాయణ్ సింగ్ అనే కాంట్రాక్టర్. బ్రిటిషర్ల పాలనలో ఈ మార్గం ఒక్కటే కాదు.. ఢిల్లీలో చాలారోడ్లను నిర్మించిన కాంట్రాక్టర్ కూడా ఈయనే. ► రైజినా హిల్స్ మీద ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్ మీదుగా ఇండియా గేట్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవు మార్గంగా రాజ్‌పథ్ ఉండేది. ► గత కొన్ని సంవత్సరాలుగా రాజ్‌పథ్.. దానికి అనుసంధానంగా ఉండే సెంట్రల్ విస్టా ఎవెన్యూలు.. ట్రాఫిక్, ఇతర కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ► పబ్లిక్ టాయిలెట్స్, తాగు నీటి సవతి, కుర్చీలు-బల్లలు, పార్కింగ్ స్పేస్ తగినంత లేకపోవడం.. తదితర కారణాలతో రూపురేఖలు మార్చేయాలని నిర్ణయించింది కేంద్రం. వీటికి తోడు రిపబ్లిక్ డే పరేడ్, ఇతర కార్యక్రమాల నిర్వాహణ.. వీక్షకులకు సరిపడా జాగా లేకపోవడంతో ఇక్కడ అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ► బ్రిటిష్ వలసపాలనలో కట్టించిన కట్టడాల తొలగింపులో భాగంగా.. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు తెర మీదకు వచ్చింది. త్రికోణాకారంలో నూతన పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయం, ఉప రాష్ట్రపతి ఎన్క్లేవ్ రానున్నాయి. ఈ క్రమంలోనే రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్ రూపు రేఖలు మారిపోయాయి. ► 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. బ్రిటిషర్లు, వలసపాలనలో పేర్లకు, గుర్తులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ► కర్తవ్యపథ్.. ఇక సువిశాలంగా ఉండనుంది. ఎటు చూసినా పచ్చదనంతో లాన్స్, వాక్‌వేస్, కాలువలు, స్నాక్స్ దొరికేలా దుకాణాలు, లైటింగ్ సిస్టమ్స్, టాయిలెట్స్ సౌకర్యాలు, సైన్ బోర్డులు.. ఏర్పాటు చేశారు. ► కొత్త రూపం సంతరించుకోనున్న ఈ తోవ గుండా రాష్ట్రాల వారీగా ఫుడ్‌స్టాల్స్, గ్రానైట్ వాక్‌వేలు ఏర్పాటు చేశారు. వెండింగ్ జోన్లు, పార్కింగ్ స్థలాలు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉండనుంది. వర్షపు నీటిని, రీయూజ్ వాటర్ ప్రాజెక్టులను సైతం అమలు చేయనున్నారు. ► సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా.. ఈ రోడ్డును మీడియా, ప్రభుత్వ డాక్యుమెంట్లు ‘సెంట్రల్ విస్టా ఎవెన్యూ’గా పేర్కొన్నాయి. కానీ, అధికారికంగా మాత్రం ఇప్పుడదిక కర్తవ్య పథ్. ► శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 28 అడుగుల గ్రానైట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి మరీ.. కర్తవ్యపథ్, సెంట్రల్ విస్టా లాన్స్ స్ట్రెచ్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. #WATCH | Delhi: Visuals from the redeveloped Kartavya Path that will soon be opened for public use pic.twitter.com/YUoNXFToRL — ANI (@ANI) September 7, 2022