గణతంత్ర వేడుకలకు 10 వేల మందికి ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: 76వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పదివేల మంది హాజరుకానున్నారు. 26వ తేదీన ఢిల్లీ కర్తవ్య పథ్‌లో జరిగే పరేడ్‌కు ‘స్వర్ణిమ్ భారత్’వాస్తు శిల్పులు, పారాలింపియన్లు, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఆహ్వానిస్తున్నట్లు గురువారం పేర్కొంది. వీరిలో ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ సర్పంచ్‌లు, చేనేత నిపుణులు, విపత్తు సహాయక సిబ్బంది, అటవీ, వన్యమృగ సంరక్షణ కేంద్రాల ఉద్యోగులు తదితరులు ఉంటారని తెలిపింది.
ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆరు ప్రధాన పథకాల్లో లక్ష్యాలను సాధించిన పంచాయతీ సర్పంచిలు, ఈ శాన్య రాష్ట్రాలు, బెస్ట్ స్టార్టప్‌లు, రహదారి నిర్మాణ కార్మికులు కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. వీరందరికీ ఢిల్లీలోని పలు ప్రముఖ ప్రదేశాలైన జాతీయ యుద్ధ స్మారకం, ప్రధానమంత్రి సంగ్రహాలయ వంటివాటిని సందర్శించేందుకు వీలు కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment