
ఖాళీ గ్యాస్ సిలిండర్ అయినా సరే, నెత్తి మీద పెట్టుకోవడం కష్టం. అలాంటింది డ్యాన్స్ చేయాలాంటే ‘అయ్ బాబోయ్’ అంటాం. దుర్గ అనే ఈ మహిళ మాత్రం ‘అయామ్ ఓకే’ అంటూ నెత్తి మీద గ్యాస్‌బండ పెట్టుకొని చిన్న స్టీలు బిందె ఎక్కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో 23 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేయవద్దు’ అంటూ నెటిజనులు ఆమెను హెచ్చరించారు. కొందరు మాత్రం ఆమె ‘బ్యాలెన్సింగ్ స్కిల్స్’కు భేష్ అన్నారు. ‘ఈ డేంజరస్ డ్యాన్స్‌ను పొరపాటున కూడా అనుకరించవద్దు’ అంటూ కొందరు హెచ్చరిక కామెంట్‌లు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment