scalped
-
అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!
ఖాళీ గ్యాస్ సిలిండర్ అయినా సరే, నెత్తి మీద పెట్టుకోవడం కష్టం. అలాంటింది డ్యాన్స్ చేయాలాంటే ‘అయ్ బాబోయ్’ అంటాం. దుర్గ అనే ఈ మహిళ మాత్రం ‘అయామ్ ఓకే’ అంటూ నెత్తి మీద గ్యాస్‌బండ పెట్టుకొని చిన్న స్టీలు బిందె ఎక్కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో 23 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేయవద్దు’ అంటూ నెటిజనులు ఆమెను హెచ్చరించారు. కొందరు మాత్రం ఆమె ‘బ్యాలెన్సింగ్ స్కిల్స్’కు భేష్ అన్నారు. ‘ఈ డేంజరస్ డ్యాన్స్‌ను పొరపాటున కూడా అనుకరించవద్దు’ అంటూ కొందరు హెచ్చరిక కామెంట్లు పెట్టారు. -
అమానుష దాడి: నెత్తిపై జుట్టు చర్మంతో సహా వచ్చేలా మహిళ పై దాడి!!
woman had hair ripped from her scalp in a racial attack: లండన్‌లో జాతి విద్వేషపూరిత దాడిలో భాగంగా ఒక వ్యక్తి మహిళ పై అత్యంత అమానుషంగా దాడి చేశాడు. ఆ మహిళ నెత్తిపై జుట్టు చర్మంతో సహా వచ్చేలా భయంకరంగా దాడి చేశాడు. అయితే ఈ సంఘటన డిసెంబర్ 18, 2021న దక్షిణ లండన్‌లోని ఈస్ట్ క్రోయ్డాన్ రైల్వే స్టేషన్ వెలుపల చోటు చేసుకుంది. ఆమె రూట్ నెం 119 బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక దుండగుడు ఆమె పై దాడి చేశాడు. స్కాట్లాండ్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..మహిళ జుట్టును దుండగడు గట్టిగా లాగాడని చెప్పారు. ఫలితంగా ఆమె నెత్తిపై ఒక వైపు భాగం జుట్టు చర్మంతో సహా ఊడిపోయిందని తెలిపారు. అంతేగాక ఆ నిందితుడు ఆమెను తల వెనుక భాగంలో గట్టిగా కొట్టడంతో ఆమె పడిపోయిందని కూడా చెప్పారు. పైగా సుదీర్ఘమైన జాతి విద్వేషపూరిత దాడిలో బాధితురాలి ముఖానికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు. ఈ మేరకు డిటెక్టివ్ కానిస్టేబుల్ బెక్కీ హ్యూస్ మాట్లాడుతూ, "ఇది పూర్తిగా రెచ్చగొట్టబడని దాడి. బాధితురాలు నేలపై పడిపోయినప్పుడు ఈ దుశ్చర్యకు పూనకున్నాడు. అంతేకాదు ఆ ఘటనకు సంబంధించిన ఫోటోని కూడా విడుదల చేశాం. ఆ సంఘటన జరిగినప్పుడూ ఉన్నవారు ఎవరైన మా ముందుకు రావాలి. ఆ నిందుతుడి గురించి తెలియజేయాలి" అని కోరారు. పైగా హింసాత్మక దాడులను ఎదుర్కొంటున్న మహిళల, పిల్లలను రక్షించడమే తమ తక్షణ కర్తవ్వం అని బెక్కీ హ్యూస్ చెప్పారు. (చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!) -
మాడు సమస్యలతో జాగ్రత్త...
మాడును ఇంగ్లిష్‌లో స్కాల్ప్ అని అంటారు. నిజానికి స్కాల్ప్ అనేది ఒక పదం కాదు. ‘ఎస్’ అంటే స్కిన్, ‘సీ’ అంటే కనెక్టివ్ టిష్యూ, ‘ఏ’ అంటే ఎపోన్యూరోటికా, ‘ఎల్’ అంటే లూజ్ ఏరియోలా, ‘పీ’ అంటే పెరియాస్టియమ్ అని అర్థం. ఆయా ఇంగ్లిష్ మాటల్లోని మొదటి అక్షరాలను కలిపితే ‘స్కాల్ప్’ అనే మాట రూపొందింది. మిగతా చర్మంతో పోలిస్తే... మాడు మీద నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అనీ... ఆ నూనెను సీబమ్ అని అంటారు. మనం ఎండలోకి వెళ్లినప్పుడు మన సెబేషియస్ గ్లాండ్స్ సీబమ్‌ను ఎక్కువగా స్రవించవచ్చు. దాంతో మన జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. నేరుగా మాడుపై ఎండ పడుతూ ఉండటం వల్ల కొందరిలో జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే నేరుగా వెంట్రుకలపై పడే ఎండ వల్ల ‘రోమాంకురాలు’ (హెయిర్ ఫాలికిల్స్) దెబ్బతింటాయి. ఫలితంగా వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సమస్యనే ‘ఎక్టినిక్ టెలోజెన్ ఎఫ్లువియమ్’ అని కూడా అంటారు. అందుకే మనమంతా మాడుకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. -
జెయింట్ వీల్ సెల్ఫీ ఎంత పనిచేసింది...
లక్నో: యువతలో సెల్పీ పట్ల ఉన్న మోజు మామూలుదికాదు . ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. ప్రాణాలు పోతున్నా..క్రేజ్ కొనసాగుతూనే ఉంది.. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని భాగపత్ జిల్లాలో ఇలాంటి సెల్పీ ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది. ఇలాగే మేళా ఉత్సవానికి హాజరైన ఓ బాలిక జెయింట్ వీల్ ఎక్కింది. ఈ ఉత్సాహంలో సెల్పీ తీసుకుంటూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా జరిగే ఉత్సవానికి హాజరైన ఓ 16 ఏళ్ల అమ్మాయి ఫెర్రీస్ వీల్ (జెయింట్ వీల్) సెల్పీ తీసుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆమె ఏమరుపాటుతో ప్రాణాల మీదికి తెచ్చుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ఉండగా ఫెర్రీస్ వీలు చక్రంలో జుట్టు చిక్కుకొంది. దీంతో జుట్టంతా ఊడి వచ్చి, మొఖమంతా రక్తమోడుతో విలవిల్లాడింది. దీంతో కంగారు పడిన జెయింట్ వీల్ నిర్వాహకులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అమ్మాయి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు వెల్లడించారు. ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది.