ఎవరు నువ్వు అంటుండగానే పోలీసును కాల్చేశాడు | New York City Police Officer Shot in Head, Suspect in Custody | Sakshi
Sakshi News home page

ఎవరు నువ్వు అంటుండగానే పోలీసును కాల్చేశాడు

Published Sun, May 3 2015 1:51 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

ఎవరు నువ్వు అంటుండగానే పోలీసును కాల్చేశాడు - Sakshi

ఎవరు నువ్వు అంటుండగానే పోలీసును కాల్చేశాడు

న్యూయార్క్: ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావ్ అని ప్రశ్నించినందుకు ఓ పోలీస్ ఆఫీసర్పై కాల్పులు జరిగిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీస్ అధికారి తలపై కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూయార్క్ సిటీలో బ్రియాన్ మోర్ (25) అనే పోలీసు అధికారి శనివారం విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఆయన తన గస్తీ వాహనాన్ని నిలిపేసి అతడిని ప్రశ్నిస్తుండగా ఒక్కసారిగా ఆ వ్యక్తి తుపాకీ తీసి బ్రియాన్ తలపై గురిపెట్టి కాల్చాడు. ప్రస్తుతం బ్రియాన్కు జమైకా ఆస్పత్రిలో ఓ శస్త్ర చికిత్స పూర్తి చేశారు. అయితే, పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని వైద్యులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement