
సాక్షి, హైదరాబాద్: మృత శిశువు తలను కుక్కలు పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సహారా మొదటి గేటు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం ఉదయం మృత శిశువు తలను కుక్కలు తీసుకువచ్చాయి.
దీనిని గుర్తించిన స్థానిక పాలబూత్ యజమాని కుక్కను తరిమి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మొండెం కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment