ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: సిటీలోని యానిమల్ కేర్ సెంటర్లలో వీధి కుక్కల మృత్యువాత కలకలం రేపుతోంది. జీహెచ్ఎంసీ కుటుంబ నియంత్రణ వికటించి కుక్కలు మరణిస్తున్నాయి. వెటర్నరీ వైద్యులకు బదులు ఔట్‌సోర్సింగ్ కార్మికులతో సర్జరీలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుల తరబడి ఆహారం పెట్టకపోవడంతో మరికొన్ని శునకాలు మృత్యువాత పడుతున్నాయి.
గత వారం రోజులుగా ఎల్‌బీ నగర్ జోన్‌లోని నాగోల్ యానిమల్ కేర్‌లోనే రోజుకు 30కి పైగా కుక్కలు మరణిస్తున్నట్లు సమాచారం. నిర్వాకం బయటికి పొక్కకుండా వెటర్నరీ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. బల్దియా వెటర్నరీ అధికారుల తీరుపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు తీసుకొని
Comments
Please login to add a commentAdd a comment