Animal care
-
మూగ జీవుల సేవలో.. 'సారా అయ్యర్'!
'ఆశ్రయం కోరి వచ్చిన ప్రాణిని ఆదరించు.. అని చెప్పింది అమ్మ. ఒక మూగజీవి గాయాలతో రోదిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఒకప్రాణి కడుపులో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకుంటే దాని ఆకలి తీర్చకుండా నా దారిన నేను వెళ్లలేను. ఒకరోజు గాయపడిన ఓ కుక్కపిల్ల ఏడుపు నాలోని తల్లి మనసును కదిలించింది. దాని బాధ చూసిన తర్వాత మనసు కలచివేసింది. ఆ కుక్కపిల్ల ఆరోగ్యం కుదుటపడే వరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలా మొదలైన ఈ సేవ ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుక్కలతో సాగుతోంది’ అన్నారు 58 ఏళ్ల సారా అయ్యర్.' చెన్నైకి చెందిన సారా అయ్యర్ స్పెషల్ ఎడ్యుకేటర్. స్పెషల్ చిల్డ్రన్ని సమాజంలో సాధారణ పౌరుల్లా తీర్చిదిద్దడంలో దాదాపు పాతికేళ్లు పని చేశారు. ఐదేళ్ల కిందట మూగజీవుల సేవ వైపు మలుపు తీసుకుందామె జీవితం. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిపోయిన మార్పులను ఇలా చెప్పారామె.. ‘‘మా అమ్మయి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ పనుల కోసం నేను టీచింగ్ నుంచి కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు దూరంగా వెళ్లిన తర్వాత ఇంట్లో ఏర్పడే వెలితి. ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ అనేటంత పెద్ద పదం చెప్పను కానీ కొంత మానసికమైన ఖాళీ ఏర్పడిందనే చెప్పాలి. జనవరి ఒకటో తేదీన నేను, నా భర్త గెర్రీ ఇద్దరం పీకే సినిమాకి వెళ్లి వస్తున్నాం. దాదాపుగా ఇంటికి దగ్గరకు వచ్చేశాం. ఎక్కడి నుంచో చిన్న కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. క్షణాల్లోనే తెలిసింది అది అరుపు కాదు ఏడుపు అని. ఎవరో పెంచుకోవడానికి కుక్కపిల్లను తెచ్చుకున్నారు, అది బెంగతో ఏడుస్తుందేమో అనుకున్నాను. అది నిస్సహాయంగా ఏడుస్తోందని కొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఇక ఊరుకోలేకపోయాను. దాని గొంతు వినవస్తున్న దిశగా వెళ్లాను. అది పార్కు చేసిన కారుకి గోడకు మధ్య ఇరుక్కు పోయి ఉంది. తీవ్రంగా గాయపడింది. బయటకు తీయడానికి దగ్గరకు వెళ్తున్నా రానివ్వలేదు. నేను దానిని ఊరడిస్తూ ఉంటే మా వారు మరో వైపు నుంచి వెళ్లి దానిని బయటకు తీశారు. అయితే... కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్లినిక్‌లన్నీ మూసేసి ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్లి మాకు చేతనైన చికిత్స చేసి ఆ మరునాడు దానికి వైద్యం చేయించాం. ఆ కుక్కపిల్ల మామూలయ్యే వరకు మాతోనే ఉంది. ఆ తర్వాత కూడా మాతోనే ఉండిపోయింది. అలా మొదలైన సేవ ఇది. ఓ రోజు.. ఒక ఇండియన్ బ్రీడ్ కుక్క నాలుగు పిల్లలను పెట్టి అలసటతో ఉంది. ఆ దారిన ఓ వ్యక్తి లాబ్రిడార్ను వాకింగ్‌కు తీసుకువెళ్తున్నాడు. వాళ్లను చూసి ఈ కుక్క అరవసాగింది. ఆ వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తన చేతిలో ఉన్న కర్ర ఎత్తాడు. అతడు ఆ కుక్క నడవలేనంత తీవ్రంగా గాయపరిచాడని ఆ మరునాడు తెలిసింది. అప్పుడు ఆ కుక్కను, పిల్లలను ఇంటికి తెచ్చాను. నేను మా వారు ఇద్దరమూ వాటికి ఆహారం పెట్టడం, గాయపడిన వాటికి వైద్యం చేయడం, ఫిజియోథెరపీ చేయడం అన్నీ నేర్చుకున్నాం. మాకు తెలిసిన అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి ‘కుక్కలు, కుక్క పిల్లలు గాయపడి నిరాశ్రయంగా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే మాకు తెచ్చివ్వండి, లేదా సమాచారం ఇవ్వండి, మేము సంరక్షిస్తాం’ అని మెసేజ్ పెట్టాం. మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ అలా ఏర్పడింది. ఇప్పుడు మా దగ్గర గాయపడినవి, చూపు కోల్పోయినవి, అనారోగ్యాలతో పుట్టినవి, ఆదరించే వాళ్లు లేక ఇక్కడే ఉండిపోయినవి అన్నీ కలిసి నాలుగు వందలకు పైగా ఉన్నాయి. మా సర్వీస్‌కి మెచ్చిన మా అమ్మ, అత్తమ్మ ఇద్దరూ తమ వంతుగా ఈ మూగజీవుల సంరక్షణకు అవసరమైన వస్తువులు, ఇతర అవసరాల కోసం డబ్బు ఇచ్చి అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. ‘ఆశ్రయం కోసం వచ్చిన ఏప్రాణినీ నిర్లక్ష్యం చేయవద్దు’ అని వారు మాకు చెప్పిన మాట మాతోనే ఉంది. మేము స్థాపించిన మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ... తమిళనాడు యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో కలిసి పని చేస్తోంది. ఈ మా ప్రయాణంలో ఇన్ని కుక్కలను సంరక్షించడానికి అవసరమైన విశాలమైన స్థలం పెద్ద సమస్య అయింది. చెన్నై నగర శివారు, మహాబలిపురం రూట్లో ఈస్ట్కోస్ట్రోడ్లో మా ఫ్రెండ్‌కి ఓ స్థలం ఖాళీగా ఉంది. దానిని అద్దెకు తీసుకుని కుక్క పిల్లలకు, గాయపడిన వాటికి, అనారోగ్యం పాలైన వాటికి వేరు వేరుగా కెన్నెల్స్ కట్టించి సంరక్షిస్తున్నాం. అవి మమ్మల్ని పేరెంట్స్‌గా ప్రేమిస్తాయి’’ అంటూ తనను ముద్దాడడానికి వచ్చిన పెట్‌ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు సారా అయ్యర్. తన సంరక్షణలో ఉన్న కుక్కలన్నింటికీ పేర్లు పెట్టారామె. వాటికి రిజిస్టర్ నిర్వహిస్తూ వాటికి ఎప్పుడు ఏ మందులు వేశారు, ఇంకా ఎప్పుడు ఏ ఇంజక్షన్లు వేయించాలి... వంటి వివరాలను నమోదు చేస్తారామె. ఇవి చదవండి: Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి -
ఏపీకి యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మకమైన ‘ఇండియా యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు–2023’ వరించింది. పశువైద్య నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిన ఏపీకి ఈ అవార్డు దక్కింది. వివిధ రంగాల్లో అద్భుత పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాలు, శాఖలకు అగ్రికల్చర్ టుడే గ్రూప్ రెండో ఎడిషన్‌లో ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఈనెల 26న జరగనున్న ఇండియా యానిమల్ హెల్త్ సమ్మిట్–23లో రాష్ట్రానికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. పశువైద్యానికి పెద్దపీట.. గతంలో ఎన్నడూలేని విధంగా పశువైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నాలుగేళ్లలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. - ఆర్బీకేల ద్వారా పాడి రైతులకు సరి్టఫై చేసిన పశుగ్రాసం, సంపూర్ణ మిశ్రమ దాణా, చాఫ్ కట్టర్స్ అందించడమే కాక.. గ్రామస్థాయిలో రాజన్న పశువైద్యం పేరిట నాణ్యమైన పశువైద్య సేవలందిస్తోంది. - నియోజకవర్గానికి రెండుచొప్పున వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను తీసుకొచ్చింది. 104, 108 తరహాలో ఫోన్‌చేసిన 20 నిమిషాల్లో మారుమూల పల్లెలకు ఈ రథాలు చేరుకుని రైతుల ముంగిట పశువైద్య సేవలందిస్తున్నాయి. - దేశంలోనే తొలిసారి రూ.7 కోట్లతో ఏర్పాటుచేసిన టెలిమెడిసిన్ కాల్‌సెంటర్ ద్వారా శాస్త్రవేత్తలు, పశు వైద్యాధికారుల ద్వారా పాడి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. - నియోజకవర్గ స్థాయిలో 154 వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్ ద్వారా సకాలంలో వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఏపీ బాటలో అడుగులు.. మరోవైపు.. పశుపోషణ కోసం అవసరమైన బ్రాండెడ్ మందులను చౌకగా అందించేందుకు దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటుచేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మరో 300 ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీ తరహాలోనే.. వెటర్నరీ అంబులెన్స్‌తో పాటు ల్యాబ్స్, కాల్ సెంటర్, గో పుష్టి కేంద్రాలను తమ రాష్ట్రాల్లో కూడా ఏర్పాటుచేసేందుకు పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. ఏపీ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయబోతున్నట్టు కేంద్రం కూడా ఇటీవలే ప్రకటించింది. అవార్డులే అవార్డులు.. ఇలా.. పాడి పరిశ్రమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన సంస్కరణల ఫలితంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖకు గతంలో ఎన్నడూలేని విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. ఫలితంగా పెద్దఎత్తున అవార్డులు, రివార్డులు లభిస్తున్నాయి. అవి.. - పశు సంవర్థక సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే సంకల్పంతో అభివృద్ధి చేసిన ‘పశుసంరక్షక్ యాప్’కు 2021–22లో సిల్వర్ స్కోచ్ అవార్డు దక్కింది. è కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి 2020లో అవార్డు ఆఫ్ ఎక్స్‌లెన్స్ దక్కింది. è ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కోచ్ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో నాలుగు రాష్ట్ర పశుసంవర్థక శాఖకు వరించాయి. - వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలకు సిల్వర్ స్కోచ్ దక్కగా.. వెటర్నరీ టెలీమెడిసిన్ కాల్ సెంటర్, పశువుల వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్‌తో పాటు ఆంధ్ర గోపుష్టి కేంద్రానికి స్కోచ్ మెరిట్ అవార్డులు వరించాయి. - అగ్రికల్చర్ టు డే గ్రూప్ 2022లో ప్రకటించిన మొదటి ఎడిషన్‌లో కూడా బెస్ట్ స్టేట్ ఇన్ యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్ కేటగిరీలో ఇండియా యానిమల్ హెల్త్ లీడర్íÙప్ అవార్డ్–2022 రాష్ట్రానికి దక్కింది. వరుసగా రెండో ఏడాది.. సీఎం జగన్ ఆలోచనల మేరకు నాలుగేళ్లలో పశుసంవర్థక శాఖలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాయి. వరుసగా రెండో ఏడాదీ అవార్డు దక్కడం గర్వంగా ఉంది. – డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ. ఇది కూడా చదవండి: పెత్తందారులకు ‘ప్రైవేట్’ జబ్బు! -
హైదరాబాద్‌లో రోజుకు ఇన్ని వీధి కుక్కలు చనిపోతున్నాయా?
సాక్షి, హైదరాబాద్: సిటీలోని యానిమల్ కేర్ సెంటర్లలో వీధి కుక్కల మృత్యువాత కలకలం రేపుతోంది. జీహెచ్ఎంసీ కుటుంబ నియంత్రణ వికటించి కుక్కలు మరణిస్తున్నాయి. వెటర్నరీ వైద్యులకు బదులు ఔట్సోర్సింగ్ కార్మికులతో సర్జరీలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుల తరబడి ఆహారం పెట్టకపోవడంతో మరికొన్ని శునకాలు మృత్యువాత పడుతున్నాయి. గత వారం రోజులుగా ఎల్బీ నగర్ జోన్‌లోని నాగోల్ యానిమల్ కేర్‌లోనే రోజుకు 30కి పైగా కుక్కలు మరణిస్తున్నట్లు సమాచారం. నిర్వాకం బయటికి పొక్కకుండా వెటర్నరీ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. బల్దియా వెటర్నరీ అధికారుల తీరుపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు తీసుకొని -
మనకు మరింత చేరువగా 'గజరాజు'
కె.జి. రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇకపై ఏనుగులనూ పెంపుడు జంతువులుగా పెంచుకునే వీలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అమ్యూజ్మెంట్ పార్కుల అభివృద్ధి పేరుతో ఏనుగులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తరలించుకోవచ్చు కూడా. మానవ అవసరాలకు సైతం ఏనుగులను ఉపయోగించుకోవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన తాజా సవరణలు ఇందుకు వీలు కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్)–1972 చట్టంలో చేసిన సవరణలకు ఆమోదముద్ర పడింది. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2022కు రాజ్యసభ సైతం గత నెల 19న ఆమోదముద్ర వేయడంతో ఏనుగులను సొంత అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు మరింత అధికారికం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మతపరమైన, ఇతర అవసరాల కోసం ఏనుగులను తరలించేందుకు ప్రత్యేకంగా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తాజా సవరణలో పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో అమ్యూజ్మెంట్, జూ పార్కుల ఏర్పాటుకు ఇది దోహదం చేస్తుందని కొందరు చెబుతుండగా.. తాజా సవరణలపై పర్యావరణ వేత్తలు, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిలయన్స్ సంస్థ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్న అమ్యూజ్మెంట్ పార్కుకు ఏనుగులను తరలించేందుకు ఈ తాజా సవరణలు తోడ్పడతాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అనధికారికంగానే..! దేశంలో మానవ అవసరాలకు ఏనుగులను ఉపయోగించుకోవడం ఎప్పటినుంచో ఉంది. సర్కస్‌లలో ఏనుగులతో ఫీట్లు చేయించడం, కొండ ప్రాంతాల్లో భారీ దుంగలను లాగేందుకు ఏనుగులను ఉపయోగించుకోవడం జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ విధంగా సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్న ఏనుగుల సంఖ్య 2,675 వరకు ఉంది. ఇందులో కేవలం 1,251 ఏనుగులకు సంబంధించి మాత్రమే యాజమాన్య హక్కులను వాటిని వినియోగిసుస్తున్న వ్యక్తులు చూపుతున్నారు. ప్రధానంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో రక్షణ అవసరాలతో పాటు బరువైన మొద్దులను లాగేందుకు ఏనుగులను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంది. అయితే, 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సొంత అవసరాలకు ఏనుగులను వినియోగించడం నిషేధించబడింది. అయినప్పటికీ ఈ వ్యవహారం ఇంకా అనధికారికంగానే కొన్ని రాష్ట్రాల్లో సాగిపోతోంది. అలా చేయడం ఏనుగులను బానిసలుగా మార్చడమేనని, వాటిని గంటల తరబడి నిలబెట్టడం, తరలింపు సమయంలో రోజుల తరబడి ప్రయాణం వంటివి వాటిని క్షోభకు గురి చేస్తాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. ఆ మినహాయింపుతో.. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) చట్టాన్ని 1972లో రూపొందించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని సవరణలు చేసింది. వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2021 పేరుతో కొన్ని సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2021లోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగా.. అది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చేరింది. తాజాగా రాజ్యసభలో కూడా ఆమోదం పొందటంతో త్వరలో వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2022 కాస్తా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్ట రూపంలో అమల్లోకి రానుంది. గతంలో ఉన్న చట్టంలో ఏనుగులను సంరక్షించేందుకు అనేక అంశాలు తోడ్పడేవని.. తాజాగా చట్టంలో సెక్షన్ 43(2) ప్రొవిజన్ చేర్చడంతో చిక్కు వచ్చిపడిందని చెబుతున్నారు. పాత చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి లేకుండా ఏ అడవి జంతువునైనా కలిగి ఉంటే అది వేటాడటం కిందకు వస్తుంది. కానీ.. విద్య, శాస్త్ర పరిశోధనల కోసం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతితో ఏనుగులను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అది కూడా సెక్షన్ 12 నిబంధనలకు లోబడి మాత్రమేనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇలా వినియోగించుకునే వెసులుబాటు కూడా ఆయా జంతువుల సంరక్షణ కేంద్రంగానే జరగాలని పేర్కొన్నారు. అయితే, తాజా సవరణల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రంగా అనే అంశాన్ని మినహాయించారనే ఆరోపణలున్నాయి. సులభంగా తరలించేందుకేనా! దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏనుగులను సులభంగా తరలించేందుకు ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ప్రధానంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మానవ అవసరాలకు ఉపయోగించుకునే (కేప్టివ్) ఏనుగులున్నాయి. వీటిని గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రదేశాలకు తరలించేందుకే కేంద్రం కొత్త చట్టం కేంద్రం తెచ్చిందనేది ప్రధాన ఆరోపణ. గుజరాత్లో ఏర్పాటు చేయనున్న అమ్యూజ్మెంట్ పార్కులతో పాటు కేరళలలోని దేవస్థానాల్లో ఏనుగులను ఉపయోగించేందుకు తాజా సవరణల అసలు ఉద్దేశమనేది పర్యావరణ ప్రేమికుల ఆందోళన. తద్వారా సహజసిద్ధంగా ఏర్పడిన ఏనుగు కారిడార్లను చెరిపివేయడం సరికాదని పేర్కొంటున్నారు. చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తాజా మార్పుల వెనుక ఉన్న అసలు కారణం తెలిసే అవకాశం ఉందని చెప్పక తప్పదు. -
వీధి కుక్కకు చికిత్స కోసం బీదర్ నుంచి సిటీకి..
సాక్షి, బంజారాహిల్స్: నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్‌లో ఓ వీధి కుక్క నడవలేని పరిస్థితుల్లో ఉందని.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు ఇక్కడి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ(ఏడబ్లూసీఎస్)కు ఈ నెల 21వ తేదీన ఫోన్ వచ్చింది. దీంతో ఈ సంస్థకు చెందిన షెల్టర్ నిర్వాహకులు సంతోషినాయర్, రెస్క్యూ కో ఆర్డినేటర్లు మనీష్, గణేష్ తదితరులు తమ సంస్థకు చెందిన రెస్క్యూ అంబులెన్స్‌లో బీదర్ చేరుకున్నారు. అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీధి కుక్కను అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అల్వాల్ మిలటరీ డెయిరీఫామ్ రోడ్డులో ఉన్నో ఆంచల్ ఖన్నా జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చి రెండు రోజుల పాటు వైద్యం చేయించారు. శుక్రవారం మెడలో ఇరుక్కున్న ప్లాస్టిక్ పైప్‌ను సర్జరీ ద్వారా తొలగించారు. జంతు ప్రేమికులు ఈ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: పనసపొట్టు.. షుగర్ ఆటకట్టు) -
వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఏపీలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం
సాక్షి, అమరావతి: పశుపోషకుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలు నేటి (గురువారం) నుంచి అందుబాటులోకి వచ్చాయి. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తుండగా.. తొలిదశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య వాహనాల్లో ఉన్న సదుపాయాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. మలిదశలో రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున 108 అంబులెన్స్ సేవల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ అంబులెన్స్‌లను తీసుకొస్తున్నారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అంబులెన్స్ సేవల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబరు 1962 ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్యసేవలందిస్తారు. అవసరమైతే పశువును దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలీక్లినిక్‌కు తరలించి మెరుగైన వైద్యసేవలందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేరుస్తారు. ప్రస్తుతం ఈ అంబులెన్స్‌లు విజయవాడ నున్న సమీపంలోని ముస్తాబాద శివారు ప్రాంతంలో బారులు తీరి ఉన్నాయి. అంబులెన్స్‌లో సౌకర్యాలు.. ► ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. ► 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల. ► అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతోపాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం ► ప్రాథమిక వైద్యసేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు ఏర్పాట్లు ► అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్రచికిత్స చేసే సౌలభ్యం. -
వారంతా ఉద్యోగులు, విద్యార్థులు.. ఓపిక, సహనంతో పోరాటం.. ఇంతకీ ఏం చేస్తారో తెలుసా?
సాక్షి, రాయదుర్గం: వారంతా ఉద్యోగులు..విద్యార్థులు. ఓపిక, సహనం, ఓర్పుతో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ముఖ్యమైన జంతువులు, పక్షులను రక్షించాలనే తపనతోనే “యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’(ఏడబ్ల్యూసీఎస్)ని స్థాపించారు. ఏడాదిలో 365 రోజులు ఎలాంటి సెలవు, పండగ అనే విరామమే లేకుండా పశుపక్ష్యాదుల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఐటీ కారిడార్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని గోపన్‌పల్లి, కొండాపూర్, హైటెక్‌సిటీ, నానక్‌రాంగూడ, మాదాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో ఆపదలో ఉన్న పక్షులను రక్షించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బావి, చెరువు, సంపులో పడిపోయిన జంతువులు, పక్షులను రక్షించడం, కాళ్లు, రెక్కలకు పతంగుల మాంజా చిక్కి చెట్లకు వేలాడం, టెర్రస్‌లోకి పెంపుడు జంతువులు వెళ్లి అక్కడి నుంచి రాలేకపోవడం వంటి వాటిని రక్షించి, వాటికి సపర్యలు చేసి ఎగిరి వెళ్లగలిగే స్థితికి తెచ్చి పంపించి వేసే విధంగా ఈ బృందం పనిచేస్తోంది. బావిలో పడ్డ కుక్కను రక్షించేందుకు యత్నిస్తున్న ఏడబ్ల్యూసీఎస్ బృంద సభ్యుడు 2019లో ఏడబ్ల్యూసీఎస్ ఏర్పాటు ► సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ప్రదీప్‌నాయర్, అమర్, సంజీవ్‌వర్మ, సంతోషి కలిసి ఈ యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీని 2019 జనవరిలో ఎన్జీఓగా ఏర్పాటు చేశారు. ► మొదట్లో 12 మంది సభ్యులుండగా, ప్రస్తుతం మనీష్, అనిరుద్, రాఘవ, గణేష్, ప్రభు, రాహుల్, శశిధర్‌తో పాటు 18 మంది సభ్యులుగా చేరారు. ► వీరంతా పక్షి, జంతువు ఆపదలో ఉందని ఫోన్ రాగానే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లడం, ఆ తర్వాత దాన్ని రక్షించడంపైనే దృష్టి సారిస్తారు. ► ఇప్పటి వరకు 330 పక్షులు, 44 ఉడుతలు, 50 పాములు, 306 కుక్కలు, 139 పిల్లులు, 19 పశువులు, 14 కోళ్లు, ఇతరత్రా వాటిని ఈ ఏడాది రక్షించారు. ► పర్యావరణ పరిరక్షణలో భాగంగా 1200 కిలోల ప్లాస్టిక్ నెట్లు, ఇతరత్రా సామగ్రి, 455 కేజీల ప్లాస్టిక్ సీసాలు సేకరించారు. ఐటీ కారిడార్‌లో ఏటా మాంజాతోనే 250–300 పక్షులకు ఆపద ► ఐటీకారిడార్‌లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత మాంజాతో ఏటా వందలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ► 250 నుంచి 300 వరకు పక్షులను డిసెంబర్ నుంచి జనవరి చివరి వరకు రక్షించిన దాఖలాలు ఉన్నాయి. ► ప్రధానంగా గాలిపటాలు ఎగురవేసిన తర్వాత అవి కాస్తా దారంతో వెళ్లి చెరువు, ఇతరత్రా ఖాళీ స్థలాలలోని చెట్లపై పడిపోతాయి. ► ఈ మధ్యలో రకరకాల పక్షులు చెరువులో నీరే తాగేందుకు వచ్చి చెట్టుపై సేద తీరే సమయంలో రెక్కలు, కాళ్లకు పతంగి మాంజా చుట్టుకొని గాయాల పాలు కావడం జరుగుతోంది. ఇది ఎవరైనా చూస్తే సమాచారం ఇస్తారు. ► చెట్లకు వేలాడుతూ అలాగే కొన్ని రోజులపాటు గాయాల బారిన పడి అక్కడే మృత్యువాత పడిన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. హెచ్‌సీయూతో పనిచేసిన ఏడబ్ల్యూసీఏ బృందం.. ► హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో కూడా ఏడబ్ల్యూసీఏ బృందం కలిసి పనిచేసింది. ► గత ఏడాది లాక్డౌన్ సమయంలో హెచ్‌సీయూ క్యాంపస్ పరిధిలోని పశు,పక్ష్యాదుల కోసం విద్యార్థులు, అధికార యంత్రాంగంతో కలిసి వాటికి ఆహారం, ఇతరత్రా సేవలందించడంలో తమవంతు పాత్ర పోషించారు. ► హెచ్‌సీయూలో పర్యావరణ పరిరక్షణకు పశు,పక్ష్యాదుల రక్షణ కోసం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ బృందం యత్నిస్తోంది. సంస్థ కోరే సాయం ► సంస్థ నిర్వహణకు ప్రత్యేక స్థలం కేటాయించాలి. ► పశు,పక్ష్యాదులకు తీవ్ర గాయాలైతే రక్షించేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బంది సేవలు అందించాలి. గోపన్‌పల్లిలో వరుసగా మూడోసారి ► ఈ ఏడాది గోపన్‌పల్లిలో ఇటీవలే వరుసగా మూడోసారి చెరువు మధ్యలో ఉన్న కంపచెట్టుకు ఉన్న మాంజా కొంగ కాళ్లకు చుట్టుకొవడంతో వేలాడుతూ ప్రాణాపాయస్థితికి చేరింది. ► ఇలాంటి ఘటనలు ఈ నెలరోజుల్లో 3సార్లు చోటు చేసుకోగా ఈ బృందం భారీ తాడు, కర్రల సహాయంతో పక్షి దగ్గరకు ఛాతీ వరకున్న చెరువునీటిలో సాయంత్రం వేళల్లో వెళ్లి కొంగను రక్షించారు. అగ్నిమాపక శాఖ సాయంతో పావురాన్ని రక్షించిన ఏడబ్ల్యూసీఎస్ బృందం ఐటీ కారిడార్‌లో ఏటా మాంజాతోనే పక్షులకు ప్రమాదం సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసేందుకు వినియోగించే మాంజాతో పక్షులకు ప్రమాదం చోటు చేసుకుంటోంది. ఐటీ కారిడార్ హైటెక్‌సిటీ, కొండాపూర్, గోపన్‌పల్లి పరిసరాల్లో చెరువులు, ఇతరత్రా ఖాళీ స్థలాల్లో చెట్లకు మాంజా తగులుకోవడంతో ఇది పక్షుల కాళ్లు, రెక్కలకు చుట్టుకోవడంతో ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నాయి. చూసిన వాళ్లు సమాచారం ఇస్తే వాటిని రక్షిస్తున్నాం. లేకపోతే అవి మృతి చెందుతున్నాయి. – మనీష్, జాయింట్ సెక్రటరీ, ఏడబ్ల్యూసీఎస్ ఉచితంగానే సేవలు ఆపదలో ఉన్న పశు,పక్ష్యాదులను ఉచితంగానే రక్షిస్తాం. సమాచారం ఇచ్చిన వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండానే వాటిని రక్షిస్తున్నాం. ఒక్కో రెస్క్యూకు వాహనాల వ్యయం రూ.2,500 నుంచి మూడువేల వరకు అవుతుంది. అగ్నిమాపక శాఖ, డీఆర్ఎఫ్ బృందాల సహకారం కూడా తీసుకుంటాం. ప్రభుత్వ సహాయం అందిస్తే మేలు చేకూరుతుంది. ప్రదీప్ నాయర్, ఇతర సభ్యులు, అమర్ వంటి వారితో అవగాహన, శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇవ్వడం చేస్తున్నాం. పశు,పక్ష్యాదులు ఆపదలో ఉంటే 9697887888కు ఫోన్ చేయండి. – సంజీవ్‌వర్మ,ప్రధాన కార్యదర్శి, ఏడబ్ల్యూసీఎస్ -
ZOOలో జంతువులను దత్తత తీసుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణులకు తమవంతు సేవ చేయాలనుకునే వారికి నెహ్రూ జూలాజికల్ పార్కు స్వాగతం పలుకుతోంది. వన్యప్రాణులను దత్తత తీసుకోవాలనుకునేవారికి ఎర్రతివాచీ పరుస్తోంది. జూపార్కును తిలకించేందుకు వస్తున్న సందర్శకులు తమకు నచ్చిన జంతువును లేదా పక్షిని ఎంచుకుని వాటి ఆలనా పాలనకయ్యే ఖర్చులను చెల్లించి దత్తత స్కీమ్‌లో చేరుతున్నారు. ఇటీవల ఓ కుటుంబంలోని చిన్నారులు అయిదు పక్షులను మూడు నెలల పాటు దత్తతకు స్వీకరించడమే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులతో కలసి క్యూరేటర్ వీవీఎల్ సుభద్రా దేవికి అందజేశారు. వన్యప్రాణుల దత్తత ద్వారా ఏడాదికి జూకు కోటి రూపాయల ఆదాయం వస్తోంది. ఏడాది జూ బడ్జెట్ రూ.15 కోట్లుగా ఉంది. పుట్టిన రోజు సందర్భంగా.. పక్షులను దత్తతకు స్వీకరించిన బేబీ సహస్ర శ్రీ, మాస్టర్ చర్విక్ తమ పుట్టిన రోజు వేడుకకు ఖర్చు చేసే మొత్తాన్ని పక్షుల ఆహారం కోసం ఇచ్చారు. సాధారణ సందర్శకులతో పాటు మెగా కోడలు కొణిదెల ఉపాసన, మహేష్‌బాబు కుమార్తె ఘట్టమనేని సితార, మాజీ ఐపీఎస్ అధికారి ఎన్ఎస్ రామ్‌జీ, తుమ్మల రచన చౌదరి, గ్లాండ్ ఫార్మా కంపెనీ యానిమల్ అడాప్షన్ స్కీమ్‌లో చేరారు. ఎస్బీఐ ఇప్పటికే ఇక్కడి పెద్ద పులులను దత్తతకు వరుసగా ప్రతి ఏడాది స్వీకరిస్తూ వస్తోంది. ఫార్మారంగ దిగ్గజం గ్లాండ్ ఫార్మాతోపాటు సినీనటుల కుటుంబ సభ్యులు, అవిశ్రాంత ఉద్యోగులు, ఐటీరంగ నిపుణులు ఉన్నారు. దత్తత ఇలా.. జూలోని వన్యప్రాణులను దత్తత తీసుకోవాలంటే జూ పార్కుకు వెళ్లి క్యూరేటర్‌ను సంప్రదించాలి. జూలోని మీకు నచ్చిన జంతువు లేదా పక్షులను ఎంపిక చేసుకోవాలి. దత్తత తీసుకున్న వన్యప్రాణి నివసించే ప్రదేశంలో మీరు దత్తత తీసుకున్నట్లు పేరు వివరాలు బోర్డుపై రాసి పెడతారు. దత్తత తీసుకున్న వన్యప్రాణిని చూడడానికి మీకు జూలో అనుమతి ఉంటుంది. సంప్రదించాల్సిన నంబర్లు: 040– 24477355, 94408 10182. ఎంతో సంతృప్తిగా ఉంది వ్యప్రాణుల పట్ల చిన్నప్పటి నుంచే సేవ చేయాలని ఉండేది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో జూలోని పక్షులను దత్తత తీసుకొవాలని నిర్ణయించాం. పుట్టిన రోజుకు అయ్యే ఖర్చుతో మూగ జీవాల ఆలనపాలన చూసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. – సహస్ర శ్రీ -
అడవుల పునరుజ్జీవానికి ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: అడవుల పునరుజ్జీవనం, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. కవ్వాల్, అమ్రాబాద్, ఏటూరునాగారం రక్షిత అటవీ ప్రాంతాల్లో నీటి సౌకర్యాల లభ్యత (వాటర్హోల్స్), జంతువుల సంచారంపై ఈనెల 11, 12 తేదీల్లో చేసిన సర్వే సిబ్బందితో శనివారం అరణ్యభవన్‌లో పీసీసీఎఫ్‌లు ఎం. పృథ్వీరాజ్, ఆర్. శోభ, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, ఓఎస్డీ శంకరన్ భేటీ అయ్యారు. వేసవిలో అడవుల్లో జంతు సంరక్షణకు చేసిన ఏర్పాట్లపై సమీక్ష, వాలంటీర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్వేలో పాల్గొన్న సిబ్బందికి అటవీ శాఖ తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. సహజ నీటి కుంటలతో పాటు, కృత్రిమంగా ఏర్పాటు చేసిన సాసర్పిట్లు వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నాయని వాలంటీర్లు పేర్కొన్నారు. కొన్నిచోట్ల గేదెల పెంపకం, ఆక్రమణలు, మానవ సంచారం ఎక్కువగా ఉన్నదని, వీటి కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవుల్లో అక్రమాలు, వేట, స్మగ్లింగ్ చేసేవారి సమాచారం ఇచ్చే వ్యవస్థను పటిష్టం చేయాలని, స్థానికులు, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలన్నారు. దాదాపు కనుమరుగైన కొన్ని జంతువులు (పులులు, అడవి దున్నలు, ఇతర జంతువులు)ఇప్పుడు మంచి సంఖ్యలో పెరిగాయని, అడవులు వన్యప్రాణుల రక్షణ చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. -
జంతు హింస నిరోధానికి ఏం చేస్తున్నారు?
తెలుగు రాష్ట్రాలను ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: జంతు హింస నివారణ, జంతు సంరక్షణ కోసం తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జంతుహింస నివారణ, జంతువుల అక్రమ రవాణా, జంతు సంరక్షణ కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ సంస్థతోపాటు మరొకరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చిన సందర్భంగా ధర్మాసనం.. జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా కమిటీల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నారో, వారికి ఉన్న వసతులు, బాధ్యతలు, విధులు, అక్రమ రవాణాలో పట్టుబడిన జంతువులను ఉంచేందుకు ఏవిధమైన ఏర్పాట్లు చేశారు.. వంటి వివరాలతో నివేదిక అందజేయాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. జిల్లా కమిటీలు సమర్థంగా పనిచేసేలా చూస్తామని ధర్మాసనం పేర్కొంది. అక్రమ రవాణాలో పట్టుబడిన జంతువులు ఎవరి పరిరక్షణలో ఉండాలని, ఈ కేసు తేలేవరకు వాటి విషయంలో ఏం చేయాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. జంతువుల అక్రమ రవాణాను అడ్డుకోవాల్సింది పోలీసులని, వాటి సంరక్షణ బాధ్యత జిల్లా స్థాయిలోని జంతు హింస నిరోధక కమిటీలదేనని న్యాయవాది బదులిచ్చారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. -
ఏం చర్యలు తీసుకొంటున్నారో చెప్పండి
జంతు పరిరక్షణ కమిటీల నిర్వహణపై ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: జంతు పరిరక్షణకు, జంతు హింస నిరోధానికి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన కమిటీల పనితీరు, వాటి సక్రమ నిర్వహణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించింది. అక్రమ రవాణాలో పట్టుబడ్డ జంతువులకు ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన రక్షిత ప్రదేశాలు, నీరు, దాణా తదితరాల కోసం ఎంత మొత్తంలో నిధులు కేటాయించారన్న వివరాలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జంతు హింస నిరోధానికి ప్రతీ జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోవడంలేదంటూ యానిమల్ రెస్కూ ఆర్గనైజేషన్, మరికొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... జంతు పరిరక్షణకు, జంతు హింస నిరోధానికి కమిటీలను ఏర్పాటు చేశామని, వాటికి నిధులను కూడా మంజూరు చేస్తున్నామని విన్నవించారు. -
‘పెటా’ర్యాప్.. ఇలియానా
జంతు సంరక్షణపై అవగాహన ఎంతొస్తుందో తెలీదు గానీ.. క్రేజీ సెలబ్రిటీల అందాల ఆరబోతకు మాత్రం హాట్ స్పాట్‌గా మారాయి పెటా యాడ్స్. జంతువులను రక్షించండంటూ పెటా వినూత్నంగా కల్పిస్తున్న అవేర్నెస్ను అంతే విభిన్నంగా తమకు అనుకూలంగా మార్చుకొంటున్నారు ముద్దుగుమ్మలు. తెలుగులో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్‌కు జంపయిన ఇలియానా... పెటా లేటెస్ట్ పోస్టర్లో ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా వెనుక భాగాన్ని ప్రదర్శించి షాకిచ్చింది.