జంతు హింస నిరోధానికి ఏం చేస్తున్నారు?
ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చిన సందర్భంగా ధర్మాసనం.. జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా కమిటీల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నారో, వారికి ఉన్న వసతులు, బాధ్యతలు, విధులు, అక్రమ రవాణాలో పట్టుబడిన జంతువులను ఉంచేందుకు ఏవిధమైన ఏర్పాట్లు చేశారు.. వంటి వివరాలతో నివేదిక అందజేయాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. జిల్లా కమిటీలు సమర్థంగా పనిచేసేలా చూస్తామని ధర్మాసనం పేర్కొంది. అక్రమ రవాణాలో పట్టుబడిన జంతువులు ఎవరి పరిరక్షణలో ఉండాలని, ఈ కేసు తేలేవరకు వాటి విషయంలో ఏం చేయాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. జంతువుల అక్రమ రవాణాను అడ్డుకోవాల్సింది పోలీసులని, వాటి సంరక్షణ బాధ్యత జిల్లా స్థాయిలోని జంతు హింస నిరోధక కమిటీలదేనని న్యాయవాది బదులిచ్చారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.