సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మకమైన ‘ఇండియా యానిమల్ హెల్త్ లీడర్‌షిప్ అవార్డు–2023’ వరించింది. పశువైద్య నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిన ఏపీకి ఈ అవార్డు దక్కింది. వివిధ రంగాల్లో అద్భుత పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాలు, శాఖలకు అగ్రికల్చర్ టుడే గ్రూప్ రెండో ఎడిషన్‌లో ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఈనెల 26న జరగనున్న ఇండియా యానిమల్ హెల్త్ సమ్మిట్–23లో రాష్ట్రానికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.
పశువైద్యానికి పెద్దపీట..
గతంలో ఎన్నడూలేని విధంగా పశువైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నాలుగేళ్లలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
- ఆర్బీకేల ద్వారా పాడి రైతులకు సరి్టఫై చేసిన పశుగ్రాసం, సంపూర్ణ మిశ్రమ దాణా, చాఫ్ కట్టర్స్ అందించడమే కాక.. గ్రామస్థాయిలో రాజన్న పశువైద్యం పేరిట నాణ్యమైన పశువైద్య సేవలందిస్తోంది.
- నియోజకవర్గానికి రెండుచొప్పున వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను తీసుకొచ్చింది. 104, 108 తరహాలో ఫోన్‌చేసిన 20 నిమిషాల్లో మారుమూల పల్లెలకు ఈ రథాలు చేరుకుని రైతుల ముంగిట పశువైద్య సేవలందిస్తున్నాయి.
- దేశంలోనే తొలిసారి రూ.7 కోట్లతో ఏర్పాటుచేసిన టెలిమెడిసిన్ కాల్‌సెంటర్ ద్వారా శాస్త్రవేత్తలు, పశు వైద్యాధికారుల ద్వారా పాడి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు.
- నియోజకవర్గ స్థాయిలో 154 వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్ ద్వారా సకాలంలో వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నారు.
ఏపీ బాటలో అడుగులు..
మరోవైపు.. పశుపోషణ కోసం అవసరమైన బ్రాండెడ్ మందులను చౌకగా అందించేందుకు దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటుచేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మరో 300 ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీ తరహాలోనే.. వెటర్నరీ అంబులెన్స్‌తో పాటు ల్యాబ్స్, కాల్ సెంటర్, గో పుష్టి కేంద్రాలను తమ రాష్ట్రాల్లో కూడా ఏర్పాటుచేసేందుకు పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. ఏపీ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయబోతున్నట్టు కేంద్రం కూడా ఇటీవలే ప్రకటించింది.
అవార్డులే అవార్డులు..
ఇలా.. పాడి పరిశ్రమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన సంస్కరణల ఫలితంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖకు గతంలో ఎన్నడూలేని విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. ఫలితంగా పెద్దఎత్తున అవార్డులు, రివార్డులు లభిస్తున్నాయి. అవి..
- పశు సంవర్థక సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే సంకల్పంతో అభివృద్ధి చేసిన ‘పశుసంరక్షక్ యాప్’కు 2021–22లో సిల్వర్ స్కోచ్ అవార్డు దక్కింది. è కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి 2020లో అవార్డు ఆఫ్ ఎక్స్‌లెన్స్ దక్కింది. è ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కోచ్ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో నాలుగు రాష్ట్ర పశుసంవర్థక శాఖకు వరించాయి.
- వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలకు సిల్వర్ స్కోచ్ దక్కగా.. వెటర్నరీ టెలీమెడిసిన్ కాల్ సెంటర్, పశువుల వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్‌తో పాటు ఆంధ్ర గోపుష్టి కేంద్రానికి స్కోచ్ మెరిట్ అవార్డులు వరించాయి.
- అగ్రికల్చర్ టు డే గ్రూప్ 2022లో ప్రకటించిన మొదటి ఎడిషన్‌లో కూడా బెస్ట్ స్టేట్ ఇన్ యానిమల్ హెల్త్ మేనేజ్‌మెంట్ కేటగిరీలో ఇండియా యానిమల్ హెల్త్ లీడర్íÙప్ అవార్డ్–2022 రాష్ట్రానికి దక్కింది.
వరుసగా రెండో ఏడాది..
సీఎం జగన్ ఆలోచనల మేరకు నాలుగేళ్లలో పశుసంవర్థక శాఖలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాయి. వరుసగా రెండో ఏడాదీ అవార్డు దక్కడం గర్వంగా ఉంది.
– డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ.
ఇది కూడా చదవండి: పెత్తందారులకు ‘ప్రైవేట్’ జబ్బు!
Comments
Please login to add a commentAdd a comment