
తల్లికి తలకొరివి పెట్టిన కూతురు
మోత్కూరు : కుమారులు లేకపోవడంతో కూతురే తల్లికి తలకొరివి పెట్టిన సంఘటన మోత్కూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. ఆరెగూడేనికి చెందిన కొణతం ఎల్లమ్మ(70) మృతి చెందడంలో తన చిన్న కూతురు అరుణ తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. మృతురాలికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయితే భర్త లేకపోవడంతో కూతుర్ల వద్ద ఉంటోంది. వర్ధమాన్‌కోటలో చిన్న కూతురు వద్ద ఉంటూ అనారోగ్యంతో మృతి చెందిందని మృతురాలు బంధువులు తెలిపారు. కాగా మృతదేహాన్ని ఆరెగూడెం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.