శిరస్నానం..పవిత్రత ప్రధానం
కృష్ణా పుష్కరాల్లో నదీస్నానమాచరించండానికి చాలా మంది ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. స్నానమెలా ఆచరించాలో చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు..
– పవిత్రమైన హృదయంతో నది దగ్గరకు చేరుకోవాలి.
– తీరం నుంచి నదికి నమస్కరించాలి
– నదిని, తీరాన్ని పవిత్రంగా ఉంచాలి..
– మొదటగా పవిత్ర నదీ జలాలను శిరస్సుపై చల్లుకొని స్నానానికి ఉపక్రమించాలి.
– వీలైతే సమంత్ర పూర్వకంగా సంకల్పం చెప్పుకొని (చెప్పించుకొని) స్నానం చేయాలి.
– లేదంటే తమ గోత్రనామాలను చెప్పుకుని ‘‘కృష్ణా కృష్ణా కృష్ణా’’ అని మూడుసార్లు నదిని స్మరించి స్నానం చేయాలి.
–ఖచ్చితంగా శిరస్నానం చేయాలి.
– నదిలో సూర్యుడికి మూడు అర్ఘ్యములనివ్వాలి.
– స్నానమైన తర్వాత శుభ్రమైన పొడిబట్టలను కట్టుకొని కుంకుమ ధరించాలి.
– కృష్ణానదీమ తల్లిని పూజించి వాయనం సమర్పించాలి.
– ఒడ్డున ఉన్న లేదా దగ్గరలో ఉన్న దేవాలయాలను తప్పక దర్శించాలి.
– యథాశక్తి ధానధర్మాలను ఆరచించాలి.
– పుష్కర సమయంలో పెద్దలకు పిండప్రదానము ఆచరించాలి.
– పిండ ప్రదానినికి ఆకులతో తయారు చేసిన విస్తరాకులనే ఉపయోగించాలి.
– శ్రాద్ధమైన తదుపరి తప్పక పిండములను నదిలో నిమజ్జనం చేయాలి.
– నది ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించాలి.
– పవిత్ర కృష్ణాపుష్కర జలాలను ఇంటికి తీసుకెళ్లి పూజా మందిరంలో ఉంచి నిత్యం పూజించాలి.
– కర్నూలు(న్యూసిటీ)