తలలోకి దూసుకెళ్లిన కత్తెరను తొలగిస్తున్న వైద్యులు
బీజింగ్ : మనకేమైనా ప్రమాదం ఏర్పడి తృటిలో తప్పిపోతే... హమ్మయ్యా పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశామో? అనుకుంటాం. చైనాకు చెందిన ఓ మహిళ కూడా ఇలానే అనుకునే సందర్భం ఎదురైంది. కత్తెరతో చెట్ల ఆకులను కత్తిరిస్తోండగా ప్రమాదవశాత్తు ఆమె తలలోకి కత్తెర దూసుకెళ్లింది. వెంటనే ఆమె అలాగే బస్సు ఎక్కి హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకుంది.
ఉదయాన్నే ఇంట్లోని మొక్కలకు ఉన్న ఆకులను కత్తిరిస్తూ ఉంది. అక్కడే ఉన్న వెదురు చెట్టుకు ఆ కత్తెరను గుచ్చిపెట్టింది. దురదృష్టవశాత్తు గుచ్చిన కత్తెర జారీ కింద ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు మహిళకు చికిత్స చేసి ఆ కత్తెరను తొలగించారు.
తలలో రెండు నుంచి మూడు మిల్లిమీటర్ల దూరం కత్తెర దూసుకెళ్లిందని వైద్యులు పేర్కొన్నారు. కత్తెర నిలువుగా మహిళ తలలోకి దూసుకెళ్లి వుంటే ఆమె కోమాలోకి వెళ్లిపోయేదని చెప్పారు. ప్రస్తుతం ఆమెను పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment