scissor
-
షాకింగ్ ఘటన.. 5 ఏళ్లుగా మహిళ పొట్టలోనే కత్తెర..!
తిరువనంతపురం: ఆపరేషన్ చేస్తూ పొట్టలోనే కత్తెర, బ్లెడ్ వంటివి వదిలేసే సంఘటనలు సినిమాల్లో చూసే ఉంటారు. అయితే, నిజ జీవితంలో అలాంటి షాకింగ్ సంఘటన కేరళలోని కోజికోడ్‌లో వెలుగు చూసింది. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 5 ఏళ్ల పాటు ఓ మహిళ పొట్టలోనే కత్తెర ఉండిపోయిన ఈ సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఐదేళ్ల తర్వాత ఆపరేషన్ చేసి మహిళ పొట్టలోంచి 11 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను తొలగించారు వైద్యులు. ఐదేళ్ల క్రితం హర్షీనా అశ్రఫ్ అనే మహిళకు ఆపరేషన్ చేసిన క్రమంలో పొట్టలోనే కత్తెరను వదిలేశారు వైద్యులు. ఏం జరిగిందింటే? 2017లో మూడో కాన్పు కోసం కోజికోడ్‌లోని వైద్య కళాశాలకు వెళ్లింది బాధితురాలు హర్షీనా అశ్రఫ్. ఆపరేషన్ చేసిన తర్వాత పొట్టలో విపరీతమైన నొప్పి ఏర్పడిందని.. నొప్పి తీవ్రమవటం వల్ల మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. స్కానింగ్ తీయగా పొట్టలో కత్తెర ఉన్నట్లు తెలిసింది. ‘2017, సెప్టెంబర్ 30 ఆపరేషన్ కోసం వెళ్లాను. ఆ తర్వాత నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. పలువురు వైద్యులను కలిసినా నా నొప్పికి పరిష్కారం లభించలేదు. ఆ తర్వాత సిటీ స్కాన్ చేయగా అసలు విషయం తెలిసింది. పొట్టలో ఇనుప వస్తువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత కత్తెరగా చెప్పారు.’ అని బాధితురాలు తెలిపారు. కత్తెర ఉన్నట్లు తెలిసిన తర్వాత మళ్లీ తనకు ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అదే ఆసుపత్రికి వెళ్లారు బాధితురాలు. వైద్యులకు విషయం తెలపగా.. ఆపరేషన్ చేసి కత్తెరను తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తాను అనుభవించిన నరకంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్‌లకు ఫిర్యాదు చేశారు బాధితురాలు హర్షీనా అశ్రఫ్. దీంతో ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు ఆరోగ్య మంత్రి. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన -
దూషించొద్దు అన్నందుకు స్నేహితులే హత్య చేశారు!
ఘజియాబాద్: కుల వివక్షత నేరం అని తెలిసి కూడా చాలా మంది కులం పేరుతో బడుగు బలహీన వర్గాలను దూషిస్తూనే ఉంటున్నారు. పైగా వాళ్లను అనేక రకాలుగా బాధపెడుతూ అవమానిస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఘజియాబాద్‌లో జరిగింది. (చదవండి: చపాతీలు కోసం చంపేశారు..!) అసలు విషయంలోకెళ్లితే... ఘజియాబాద్‌లో ఓ దివ్యాంగుడు తనపై చేసిన కులపరమైన దూషణలకు అభ్యంతరం చెప్పడంతో అతని స్నేహితులే అత్యంత పాశవికంగా హత్య చేసి చంపేశారు. ఈ మేరకు మృతుడి హర్బన్స్ నగర్ కాలనీలో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుందని నగర సర్కిల్ ఆఫీసర్ అవినాష్ కుమార్ అన్నారు . పైగా నిందితులు ఆ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసి, కత్తెరతో పొడిచి చంపడమే కాక మృత దేహాన్నిచెత్త కుప్పపై వేసి కాల్చేశారని వెల్లడించారు. ఈ మేరకు మృతిడి సోదరులు సందీప్, విశాల్ అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారని అన్నారు. అయితే ఆ సోదరులు కాలిపోయిన దుస్తులు అవి చూసి తమ సోదరుడిగా గుర్తించారని చెప్పారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమే కాక నిందితులు సౌరభ్, వివేక్, రవిలుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నాం అని అన్నారు. అయితే సచిన్ అనే వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) -
చూసి చూసి.. రిబ్బన్ తీసిపడేసిన సీఎం కేసీఆర్
-
కడుపులో కత్తెర మరిచారు
-
కడుపులో కత్తెర మర్చిపోయారు
సాక్షి, వరంగల్ : కడుపు నొప్పితో వచ్చిన రోగికి ఆపరేషన్ చేసి కడుపులోనే కత్తెర మర్చిపోయారు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు. కడుపునొప్పి ఎక్కువై తిరిగి మళ్లీ ఆస్పత్రికి రాగా, ఎక్స్‌రే తీయడంతో డాక్టర్ల తీరు బట్టబయలు అయింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా బెల్లంపల్లి శాంతిఖనికి చెందిన రాజాం(55) కొద్దిరోజులుగా అల్సర్‌తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎంజీఎంకు తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆరు నెలల కింద ఆయనకు సర్జరీ చేశారు. కొద్దిరోజులుగా ఆయనకు కడుపులో నొప్పి ఎక్కువవుతుండటంతో రెండు రోజుల కిందట మళ్లీ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. బుధవారం ఎక్స్‌రే తీయగా కడుపులో కత్తెర ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు తలపట్టుకున్నారు. ఈ విషయం బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తలలో కత్తెర దిగినా.. బస్సెక్కి ఆసుప్రత్రికి..
బీజింగ్ : మనకేమైనా ప్రమాదం ఏర్పడి తృటిలో తప్పిపోతే... హమ్మయ్యా పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశామో? అనుకుంటాం. చైనాకు చెందిన ఓ మహిళ కూడా ఇలానే అనుకునే సందర్భం ఎదురైంది. కత్తెరతో చెట్ల ఆకులను కత్తిరిస్తోండగా ప్రమాదవశాత్తు ఆమె తలలోకి కత్తెర దూసుకెళ్లింది. వెంటనే ఆమె అలాగే బస్సు ఎక్కి హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకుంది. ఉదయాన్నే ఇంట్లోని మొక్కలకు ఉన్న ఆకులను కత్తిరిస్తూ ఉంది. అక్కడే ఉన్న వెదురు చెట్టుకు ఆ కత్తెరను గుచ్చిపెట్టింది. దురదృష్టవశాత్తు గుచ్చిన కత్తెర జారీ కింద ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు మహిళకు చికిత్స చేసి ఆ కత్తెరను తొలగించారు. తలలో రెండు నుంచి మూడు మిల్లిమీటర్ల దూరం కత్తెర దూసుకెళ్లిందని వైద్యులు పేర్కొన్నారు. కత్తెర నిలువుగా మహిళ తలలోకి దూసుకెళ్లి వుంటే ఆమె కోమాలోకి వెళ్లిపోయేదని చెప్పారు. ప్రస్తుతం ఆమెను పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. -
కటింగ్ కోసం వచ్చి కత్తెరతో దాడి
-
భారతీయురాలికి బంగారు కత్తెర
వాషింగ్టన్: అమెరికాలో కాలంచెల్లిన నియంత్రణల రద్దులో కీలక పాత్ర పోషించిన ఇండో–అమెరికన్ నయోమి జహంగీర్ రావ్‌కు తగిన గుర్తింపు లభించింది. శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ ఆమెకు బంగారు కత్తెరను బహూకరించారు. 1960ల నాటి, ప్రస్తుత నియంత్రణలను కలిగిన ప్రతులను చుట్టిన రెడ్ టేప్(కఠిన నియంత్రణలకు సూచిక)ను ట్రంప్ ఈ కత్తెరతోనే కత్తిరించి రావ్‌కు అందించారు. 2017 జూలై 18 నుంచి శ్వేతసౌధ సమాచార, నియంత్రణ వ్యవహారాల హెడ్‌గా వ్యవహరిస్తున్న రావ్ పాత నిబంధనలు, నియంత్రణల తొలగింపుకు కృషిచేశారు. ట్రంప్ ప్రతి కొత్త నియంత్రణకు 22 పాత వాటిని ఎత్తివేశారు. సంస్కరణలతో సుమారు రూ.51925 కోట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు. -
నా షాపు ముందే కూర్చుంటావా అని..
హైదరాబాద్: టైలర్ షాపు ముందు కూర్చున్న ఓ వ్యక్తి పై షాపు యజమాని కత్తెరతో దాడి చేసిన సంఘటన నగరంలోని ఎల్బీ నగర్ ఎన్.టి.ఆర్ నగర్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రాజు అనే వ్యక్తి టైలర్ షాపు ముందు కూర్చున్న సమయంలో షాపు యజమాని కత్తెరతో పొడిచాడు. దీంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.