ఘజియాబాద్: కుల వివక్షత నేరం అని తెలిసి కూడా చాలా మంది కులం పేరుతో బడుగు బలహీన వర్గాలను దూషిస్తూనే ఉంటున్నారు. పైగా వాళ్లను అనేక రకాలుగా బాధపెడుతూ అవమానిస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఘజియాబాద్‌లో జరిగింది.
(చదవండి: చపాతీలు కోసం చంపేశారు..!)
అసలు విషయంలోకెళ్లితే... ఘజియాబాద్‌లో ఓ దివ్యాంగుడు తనపై చేసిన కులపరమైన దూషణలకు అభ్యంతరం చెప్పడంతో అతని స్నేహితులే అత్యంత పాశవికంగా హత్య చేసి చంపేశారు. ఈ మేరకు మృతుడి హర్బన్స్ నగర్ కాలనీలో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుందని నగర సర్కిల్ ఆఫీసర్ అవినాష్ కుమార్ అన్నారు . పైగా నిందితులు ఆ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసి, కత్తెరతో పొడిచి చంపడమే కాక మృత దేహాన్నిచెత్త కుప్పపై వేసి కాల్చేశారని వెల్లడించారు.
ఈ మేరకు మృతిడి సోదరులు సందీప్, విశాల్ అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారని అన్నారు. అయితే ఆ సోదరులు కాలిపోయిన దుస్తులు అవి చూసి తమ సోదరుడిగా గుర్తించారని చెప్పారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమే కాక నిందితులు సౌరభ్, వివేక్, రవిలుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నాం అని అన్నారు. అయితే సచిన్ అనే వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment