differently abled person
-
రెండు చేతులూ లేవు..పైలట్‌గా రికార్డ్! ఈమె గురించి తెలిస్తే, గూస్బంప్స్ ఖాయం!
The Success Story Jessica Cox శరీరంలో ఏదైనా ఒక అవయవ లోపం ఉంటేనే కృంగిపోతారు చాలామంది. కానీ కొందరు మాత్రం ఎలాంటి లోపం ఉన్నాదాన్ని చాలెంజ్‌గా స్వీకరిస్తారు. అద్బుతమైన కృషితో పట్టుదలతో తామేంటే నిరూపించుకుంటారు. అలా రెండు చేతులు లేకపోయినా పైలట్‌గా రాణిస్తోంది. జెస్సికా ప్రపంచంలోనే తొలి చేతులు లేని లైసెన్స్ పొందిన తొలి పైలట్‌గా చరిత్ర సృష్టించింది.వండర్ విమెన్ అమెరికాకు చెందిన జెస్సికా కాక్స్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అరుదైన పుట్టుకతో వచ్చే లోపం కారణంగా జెస్సికాకు పుట్టుకతోనే నుండే రెండు చేతులు లేవు. అయినా ఆమె తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడలేదు.అలాగే జెస్సికా కూడా రెండు చేతులు లేకపోయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. లేని చేతుల గురించి బాధపడుతూ కూర్చోలేదు. తన రెండు కాళ్లే చేతులుగా మార్చుకుంది.రెండు కాళ్లతో సాధారణ ప్రజలు ఎలాంటి పనులు చేసుకుంటారో అంతే సునాయాసంగా తానూ అలవాటు చేసింది. కొన్నాళ్లపాటు కృత్రిమ చేతులు ధరించినా ఆ తరువాత వాటిని కూడా తీసివేసింది. అరిజోనాలోని సియెర్రా విస్టాలో 1983లో జన్మించిన జెస్సికా తన పాదాలతో తన జీవితాన్ని గడపడం నేర్చుకుంది. చిన్నతనంలో, ఆమె తన సొంత పట్టణంలో నృత్యం అభ్యసించింది. 14 సంవత్సరాలు నృత్యం కొనసాగించింది. (ఉద్యోగానికి అప్లయ్ చేస్తే.. ఇదేందయ్యా ఇది, ఎక్కడా సూడ్లా!) 22 ఏళ్ల వయసులో పైలెట్‌గా శిక్షణ పొందింది. లెట్‌గా శిక్షణ పొందింది.కేవలం మూడు సంవత్సరాల్లో పైలెట్‌గా పూర్తి చేసింది. అంతేకాదు ఈత కొట్టడం, డ్రైవింగ్ చేయడం (కారు), విమానం నడపడంలో ప్రావీణ్యం సంపాదించింది. 2008, అక్టోబరు 10న జెస్సికా తన పైలట్ సర్టిఫికేట్‌ను పొందింది. ఆమె 10,000 అడుగుల ఎత్తులో తేలికపాటి క్రీడా విమానాన్ని నడిపేందుకు అర్హత పొందింది.2004లో, జెస్సికా మొదటిసారిగా రైట్ ఫ్లైట్ ద్వారా సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపింది. రెండు ముఖ్యమైన అవయవాలు లేనప్పటికీ టైక్వాండోలో రెండు బ్లాక్ బెల్ట్‌లను కూడా సంపాదించింది. 2019లో, కాక్స్ నాల్గవ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించింది. అమెరికన్ టైక్వాండో అసోసియేషన్‌లో బ్లాక్ బెల్ట్ సంపాదించిన చేతులు లేని తొలి వ్యక్తి. (మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) జెస్సికా కాక్స్ అచీవ్ మెంట్స్ ♦ జెస్సికా యునైటెడ్ స్టేట్స్‌లోని అరిజోనా విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. ♦బ్రాండ్లారేట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ పర్సనాలిటీ అవార్డు ♦AOPA LIVE పైలట్స్ ఛాయిస్ అవార్డ్ 2010: జెస్సికా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన మహిళా ఏవియేటర్‌గా మారింది. ♦ఫిలిపినో ఉమెన్స్ నెట్వర్క్: 2009లో అమెరికాలో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన ఫిలిపినో మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ♦ది సక్సెస్ స్టోరీ జెస్సికా కాక్స్ 2009లో రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్లో కూడా పబ్లిష్ అయింది. ఇదీ చదవండి: క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి! ♦ ఫిలిపినో అమెరికన్ జర్నల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ , 2008లో అత్యుత్తమ ఫిలిపినో అవార్డు లభించింది. ‘♦ ‘వైకల్యం అంటే అసమర్థత కాదు" అని రైట్‌ఫుటెడ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ మిషన్‌ను ప్రచారం చేయడానికి తాను విమానాన్ని ఉపయోగిస్తానని ఆమె పేర్కొంది ♦ 2015లో కాక్స్ తన జీవితంలో నేర్చుకున్న పాఠం ద్వారా స్వంత సవాళ్లను అధిగమించడానికి ప్రజలను ప్రేరేపించేలా డిసార్మ్ యువర్ లిమిట్స్ అనే పుస్తకాన్ని రచించారు. దాదాపు 26 దేశాల్లో మోటివేషనల్ స్పీకర్ కూడా -
దూషించొద్దు అన్నందుకు స్నేహితులే హత్య చేశారు!
ఘజియాబాద్: కుల వివక్షత నేరం అని తెలిసి కూడా చాలా మంది కులం పేరుతో బడుగు బలహీన వర్గాలను దూషిస్తూనే ఉంటున్నారు. పైగా వాళ్లను అనేక రకాలుగా బాధపెడుతూ అవమానిస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఘజియాబాద్‌లో జరిగింది. (చదవండి: చపాతీలు కోసం చంపేశారు..!) అసలు విషయంలోకెళ్లితే... ఘజియాబాద్‌లో ఓ దివ్యాంగుడు తనపై చేసిన కులపరమైన దూషణలకు అభ్యంతరం చెప్పడంతో అతని స్నేహితులే అత్యంత పాశవికంగా హత్య చేసి చంపేశారు. ఈ మేరకు మృతుడి హర్బన్స్ నగర్ కాలనీలో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుందని నగర సర్కిల్ ఆఫీసర్ అవినాష్ కుమార్ అన్నారు . పైగా నిందితులు ఆ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసి, కత్తెరతో పొడిచి చంపడమే కాక మృత దేహాన్నిచెత్త కుప్పపై వేసి కాల్చేశారని వెల్లడించారు. ఈ మేరకు మృతిడి సోదరులు సందీప్, విశాల్ అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారని అన్నారు. అయితే ఆ సోదరులు కాలిపోయిన దుస్తులు అవి చూసి తమ సోదరుడిగా గుర్తించారని చెప్పారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమే కాక నిందితులు సౌరభ్, వివేక్, రవిలుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నాం అని అన్నారు. అయితే సచిన్ అనే వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) -
అనుచిత ప్రవర్తన.. పోలీస్ సస్పెన్షన్
లక్నో: పొట్టకూటి కోసం రిక్షా నడుపుకుంటున్న ఓ వికలాంగుడితో అనుచితంగా ప్రవర్తించిన ఓ పోలీస్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. రాష్ట్ర రాజధాని లక్నోకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనౌజ్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద ఓ కానిస్టేబుల్ ఏ మాత్రం మానవత్వం లేకుండా వికలాంగుడిని చెంపదెబ్బ కొట్టి నేలమీదకు తోసేశాడు. ఇదంతా జరుగుతున్నా చుట్టూ ఉన్న పోలీసులు కూడా స్పందించలేదు. కాగా.. రోడ్డు పక్కనే ఉన్న ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా కానిస్టేబుల్ తనపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు చెప్తుండగా.. సదురు వ్యక్తి తప్పుగా ప్రవర్తించాడని కానిస్టేబుల్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై కనౌజ్ జిల్లా పోలీస్ సూపరిండెంట్‌ను అమరేంద్ర ప్రతాప్ సింగ్‌ను వివరణ కోరగా.. కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించి, ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కొన్ని సందర్భాలలో పోలీసు అధికారులు 'తమను తాము నియంత్రించుకోవాలే కానీ.. ప్రజలతో తప్పుగా ప్రవర్తించరాదు' అని సింగ్ అన్నారు. (గత 24 గంటల్లో 93,337 కరోనా కేసులు) -
వేధించాలనుకున్నాడు... కానీ అంతలోనే
సాక్షి, ముంబై : తనను వేధింపులకు గురిచేసిన ఆకతాయికి సరైన బుద్ధి చెప్పిందో బాలిక. దివ్యాంగురాలు అయినంత మాత్రాన తనను తేలికగా తీసుకోవద్దని అతడి వేళ్లు పాక్షికంగా విరిచేసి పోలీసులకు పట్టించింది. అసలేం జరిగిందంటే... ముంబైకి చెందిన ఓ పదిహేనేళ్ల బాలిక తన తండ్రితో కలిసి లోకల్ ట్రెయిన్లో ప్రయాణిస్తుంది. దివ్యాంగురాలు(అంధురాలు) కావడంతో తమ కోసం ప్రత్యేకంగా కేటాయించడిన కంపార్ట్మెంట్లో ఎక్కింది. ఆ సమయంలో ఆమెకు తోడుగా తండ్రి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో విశాల్ బలరామ్ సింగ్ అనే యువకుడు వీరు ఉన్న కంపార్ట్మెంట్లోకి వచ్చాడు. రాత్రి పూట కాబట్టి రద్దీ ఎక్కువగా లేకపోవడంతో బాలికను వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టడంతో ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. అయితే ఆమె తండ్రి హెచ్చరించినప్పటికీ కూడా అతడు పట్టించుకోకుండా అలాగే ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన బాలిక స్కూళ్లో నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్సింగ్ స్కిల్క్స్ను అతడిపై ప్రయోగించింది. యువకుడి చేయి గట్టిగా మెలితిప్పి వేళ్లను పాక్షికంగా విరిచేసింది. ఈ చర్యతో కంగుతిన్న ఆ యువకుడు నిశ్చేష్టుడైపోయాడు. ఈలోపు ఆమె తండ్రి రైల్వే పోలీసులకు ఫోన్ చేయడంతో దాదర్ రైల్వే స్టేషన్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మమ్మల్ని తేలికగా తీసుకుంటారు.. ‘దివ్యాంగులు అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. వీళ్లను ఏం చేసినా పడి ఉంటారులే అనుకుంటారు. కానీ మా స్కూళ్లో కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. ఆత్మరక్షణ కోసం ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదని మా టీచర్లు ఆత్మవిశ్వాసం నింపారు. అదే ఈరోజు పనికివచ్చింది. అతడు ఇంకోసారి ఎవరితో అసభ్యంగా ప్రవర్తించకూడదనే అలా చేశాను’ అంటూ బాలిక తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. -
దివ్యమైన సేవ
బైక్‌కు ఇరువైపులా బాటిళ్లను పెట్టుకొని రోడ్ల వెంట వెళ్లే ప్రజల దాహార్తిని తీరుస్తూ ఓ దివ్యాంగుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. నంద్యాల పట్టణం దేవనగర్‌కు చెందిన షేక్ హుసేన్వలీకి రెండు కాళ్లు లేవు. కుటుంబానికి భారం కాకుండా.. గొడుగులు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన 20 ఏళ్ల వయస్సులో ఎండలకు ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకొని మొబైల్ చలివేంద్రాన్ని ప్రారంభించాడు. మొదట ట్రైసైకిల్‌పై బాటిళ్లను పెట్టుకొని పట్టణమంతా తిరిగి ఉచితంగా తాగునీరు అందించేవాడు. కాలక్రమేణ బైక్‌పై సంచరిస్తూ తోడుపు బండ్ల వ్యాపారులు, ఆటో వాలా, రిక్షవాలాలతోపాటు పాదచారులకు తాగునీరు అందిస్తూ దాహాన్ని తీరుస్తున్నాడు. ప్రతి రోజూ 150 బాటిళ్లతో తాగునీటి అందిస్తున్నట్లు హుసేన్‌వలీ తెలిపారు. ప్రజల దాహార్తి తీరుస్తున్నప్పుడు తనకు గర్వంగా ఉంటుందని, సాయం చేయడం తనకు దేవుడిచ్చిన వరమని హుసేన్‌వలీ తెలిపారు. - నంద్యాల వ్యవసాయం