దివ్యమైన సేవ
దివ్యమైన సేవ
Published Sat, Apr 1 2017 9:33 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
బైక్‌కు ఇరువైపులా బాటిళ్లను పెట్టుకొని రోడ్ల వెంట వెళ్లే ప్రజల దాహార్తిని తీరుస్తూ ఓ దివ్యాంగుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. నంద్యాల పట్టణం దేవనగర్‌కు చెందిన షేక్ హుసేన్‌వలీకి రెండు కాళ్లు లేవు. కుటుంబానికి భారం కాకుండా.. గొడుగులు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన 20 ఏళ్ల వయస్సులో ఎండలకు ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకొని మొబైల్ చలివేంద్రాన్ని ప్రారంభించాడు. మొదట ట్రైసైకిల్‌పై బాటిళ్లను పెట్టుకొని పట్టణమంతా తిరిగి ఉచితంగా తాగునీరు అందించేవాడు. కాలక్రమేణ బైక్‌పై సంచరిస్తూ తోడుపు బండ్ల వ్యాపారులు, ఆటో వాలా, రిక్షవాలాలతోపాటు పాదచారులకు తాగునీరు అందిస్తూ దాహాన్ని తీరుస్తున్నాడు. ప్రతి రోజూ 150 బాటిళ్లతో తాగునీటి అందిస్తున్నట్లు హుసేన్‌వలీ తెలిపారు. ప్రజల దాహార్తి తీరుస్తున్నప్పుడు తనకు గర్వంగా ఉంటుందని, సాయం చేయడం తనకు దేవుడిచ్చిన వరమని హుసేన్‌వలీ తెలిపారు.
- నంద్యాల వ్యవసాయం
Advertisement