
సాక్షి, వరంగల్ : కడుపు నొప్పితో వచ్చిన రోగికి ఆపరేషన్ చేసి కడుపులోనే కత్తెర మర్చిపోయారు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు. కడుపునొప్పి ఎక్కువై తిరిగి మళ్లీ ఆస్పత్రికి రాగా, ఎక్స్‌రే తీయడంతో డాక్టర్ల తీరు బట్టబయలు అయింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా బెల్లంపల్లి శాంతిఖనికి చెందిన రాజాం(55) కొద్దిరోజులుగా అల్సర్‌తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎంజీఎంకు తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆరు నెలల కింద ఆయనకు సర్జరీ చేశారు.
కొద్దిరోజులుగా ఆయనకు కడుపులో నొప్పి ఎక్కువవుతుండటంతో రెండు రోజుల కిందట మళ్లీ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. బుధవారం ఎక్స్‌రే తీయగా కడుపులో కత్తెర ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు తలపట్టుకున్నారు. ఈ విషయం బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment