
'నాన్న..' తొలిసారి ఆ పిలుపెంత మధురం!
'నాన్న'.. మధురమైన పిలుపు అది. పెళ్లయ్యాక ప్రతి పురుషుడు తపించేది ఆ పిలుపు కోసమే. తమ పిల్లలు నోరారా 'నాన్న' అని పిలిస్తే.. పులకించని తండ్రి హృదయం ఉండదు. అలాంటి మధురానుభూతి నూతన సంవత్సరం సందర్భంగా బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌కు లభించింది. జనవరి 1నాడు రితేశ్, జెనీలియా దంపతుల గారాల కొడుకు రియాన్ 'బాబా' అని పిలిచాడట. ఆ మ్యాజికల్ మోమెంట్స్‌ను రితేశ్ ఎంతో సంబురపడుతూ ట్విట్టర్‌లో పంచుకున్నాడు.
'నా కొడుకు నన్ను చూస్తూ 'బాబా' (నాన్న) అన్నాడోచ్.. 2016కు ఇంతకంటే గొప్ప స్వాగతం ఏముంటుంది' అంటూ రితేశ్ ట్విట్టర్‌లో తెలిపాడు. 2016లో 'బ్యాంక్ చోర్', 'గ్రేట్ గ్రాండ్ మస్తీ', 'హౌస్‌ఫుల్ 3' సినిమాలతో రితేశ్ ప్రేక్షకులను పలుకరించనున్నాడు.
What a start to 2016 - My Son looks at me n calls out 'Baba' for the first time. #magical
— Riteish Deshmukh (@Riteishd) January 1, 2016