ధీరేంద్రశాస్త్రిని ఆస్ట్రేలియా నుంచి రప్పించిన అంబానీ | Ambani Sent Plane to Australia for Baba Bageshwar | Sakshi
Sakshi News home page

ధీరేంద్రశాస్త్రిని ఆస్ట్రేలియా నుంచి రప్పించిన అంబానీ

Published Tue, Jul 16 2024 8:34 AM | Last Updated on Tue, Jul 16 2024 9:35 AM

Ambani Sent Plane to Australia for Baba Bageshwar

ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ వేడుకలకు హాజరైన అతిథుల సంఖ్య కూడా భారీగానే ఉంది.

బాలీవుడ్ సెలబ్రిటీలు మొదలుకొని ప్రపంచంలోని ప్రముఖ గాయకులు, నేతలు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి  అనంతరం అనంత్ అంబానీ, రాధికలను ఆశీర్వదించేందుకు ప్రముఖ సాధువులు కూడా తరలివచ్చారు. ఈ వివాహానికి తాను ఎలా హాజరైనదీ మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్‌ ధామ్‌కు చెందిన స్వామీజీ ధీరేంద్ర శాస్త్రి ఒక ప్రసంగంలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన బాబా బాగేశ్వర్ ధామ్ ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.

అనంత్ అంబానీ వివాహానికి సంబంధించి తనకు ఆహ్వానం అందిందని, అయితే తాను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉండటంతో తొలుత నిరాకరించానని ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. అయితే అంబానీ తన కోసం ఆస్ట్రేలియాకు విమానాన్ని పంపారని, సకల సదుపాయాలు ఏర్పాటు చేశారని, దీంతో తాను అనంత్‌ అంబానీ వివాహానికి హాజరయ్యానన్నారు. తనతో పాటు కొందరు శిష్యులు కూడా విమానంలో ముంబై చేరుకున్నామని తెలిపారు. అనంతరం అనంత్‌, రాధికలను ఆశీర్వదించి, తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement