హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో సత్సంగ్ ఆర్గనైజింగ్ నిర్వాహకులతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరు సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులు, సేవాదార్‌లుగా పనిచేస్తున్నారని అలీగఢ్ ఐజీ శలభ్ పేర్కొన్నారు.
ప్రధాన నిర్వాహకుడిని పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు తెలిపారు. త్వరలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. జనాలు ఒకేసారి గుంపుగా రాగా.. నిర్వాహకులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత ఒకేసారి బయటకు రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మహిళలు, పిల్లలు ఒకరిపై పడిపోయారన్నారు.
భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఐజీ వెల్లడించారు. అయితే, సత్సంగ్‌కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. అప్పటి వరకు 121 మంది మృతి చెందారని.. మృతుల ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment