Stamped
-
హత్రాస్ తొక్కిసలాట: ఆరుగురి అరెస్ట్, అవసరమైతే బాబాను విచారణ
హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో సత్సంగ్ ఆర్గనైజింగ్ నిర్వాహకులతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరు సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులు, సేవాదార్లుగా పనిచేస్తున్నారని అలీగఢ్ ఐజీ శలభ్ పేర్కొన్నారు.ప్రధాన నిర్వాహకుడిని పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు తెలిపారు. త్వరలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. జనాలు ఒకేసారి గుంపుగా రాగా.. నిర్వాహకులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత ఒకేసారి బయటకు రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మహిళలు, పిల్లలు ఒకరిపై పడిపోయారన్నారు. భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఐజీ వెల్లడించారు. అయితే, సత్సంగ్‌కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. అప్పటి వరకు 121 మంది మృతి చెందారని.. మృతుల ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
చంద్రబాబు కందుకూరు రోడ్ షో లో అపశృతి
-
జనసేన సభలో జనసైనికుల అత్యుత్సాహం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి ఇప్పటంలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో జనసైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో సభ ప్రాంగణం వద్ద భారీగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన శ్రీదేవి ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయింది. ఈ తోపులాటలో ఆమె ఎడమ కాలు విరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సభను కవర్‌చేస్తూ.. ఫోటోలు తీస్తున్న ఇద్దరు ఫోటోగ్రాఫర్ల కెమెరాలను లాక్కుని జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. -
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో తొక్కిసలాట
-
ఎస్బీఐలో తొక్కిసలాట
- ఐదుగురికి అస్వస్థత బద్వేల్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సోమవారం తొక్కిసలాట జరిగింది. నిన్న సెలవు కావడంతో.. సోమవారం తెల్లవారుజాము నుంచే కస్టమర్లు బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. పింఛన్లు కూడా బ్యాంకుల్లోనే ఇస్తుండటంతో వృద్ధులు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గేట్లు తెరవగానే.. జనాలంతా ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు ఈ తొక్కిసలాటలో కిందపడిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో ఐదుగురు వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. భారీగా జనం బ్యాంకు వద్దకు చేరుకున్నా పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో.. అరకోర సిబ్బంది జనాన్ని నిలవరించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదరైందని స్థానికులు అంటున్నారు. -
బ్యాంకులో తోపులాట: ఇద్దరికి గాయాలు
పాలకొల్లు: నోట్ల రద్దు చేసి 25 రోజులైనా పూర్తి స్థాయిలో నగదు అందక ప్రజలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు గంటల తరబడి ఉన్నా రెండు వేలు కూడా దొరకని పరిస్థితి. దీంతో తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఓ బ్యాంకులో తోపులాట జరిగింది. స్థానిక ఎస్బీఐకు నగదు చేరుకుందని తెలుసుకున్న ఖాతాదారులు భారీగా తరలివచ్చారు. శనివారం బ్యాంకు ఒక్కపూటే పని చేయడం, ఆదివారం సెలవు కావడంతో నగదు అందదేమోనని ఆందోళన చెందారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగి బ్యాంకు అద్దాలు పగిలాయి. ఇద్దరు ఖాతాదారులకు గాయాలయ్యాయి. -
' గోదావరి పుష్కరాల నివేదికను బయట పెట్డండి'
హైదరాబాద్: కృష్ణా పుష్కరాల లోపు రాజమండ్రి పుష్కర తొక్కిసలాట నివేదిక బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రచార యావ కారణం గానే పుష్కరాల్లో 29 అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సంవత్సరం పూర్తయినా విచారణ నివేదిక ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్నా దానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. -
మహా పోటీ
-
ఖైరతాబాద్‌లో తొక్కిసలాట : భక్తులకు గాయాలు
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాదం పంపిణీ సందర్భంగా శుక్రవారం భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. 11 రోజుల పాటు ఖైరతాబాద్ మహాగణపతి చేతిలో విశేష పూజలందుకున్న మహాలడ్డూ ప్రసాదాన్ని ఈ నెల 30న పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పోలీస్ బందోబస్తుకు వీలు కాకపోవడంతో ఆక్టోబర్ 2వ తేదీ పంపిణీ చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ప్రసాదం కోసం భక్తులు శుక్రవారం అధిక సంఖ్యలో ఖైరతాబాద్ తరలివచ్చారు. మింట్ కాంపౌండ్‌వైపు ఉన్న మహిళా క్యూ లైన్, రైల్వేగేటు వైపు ఉన్న పురుషుల క్యూలైన్ బారీగా జనంతో నిండిపోయారు. ఉదయం 7 గంటలకు లడ్డూ దాత, సురుచీఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు పూజలు చేశారు. ఆ తరువాత ఆనవాయితీ ప్రకారం మల్లిబాబుకు లడ్డూలో 50 శాతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా స్థానిక నాయకులు అడ్డుకున్నారు. 50 శాతం ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు. దీంతో మల్లిబాబుకు స్థానిక నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని మల్లిబాబుకు 15 శాతం లడ్డూను ఇచ్చి పంపించేశారు. అనంతరం భక్తులకు ప్రసాద పంపిణీ ప్రారంభమైంది. ప్రసాదం కోసం ఒక్కసారిగా అందరూ ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. దీంతో స్థానిక బీజేపీ నాయకుడికి తలకు తీవ్రగాయమైంది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డితో పాటు పలువురు పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రసాద పంపిణీని నిలిపివేశారు. ప్రసాద పంపిణీ పూర్తయిందని మెగాఫోన్‌లో ప్రకటించారు. భద్రత నడుమ మిగిలిన లడ్డూను వాహనంలో తరలించారు. -
తొక్కిసలాటపై విచారణ జరగకపోవడం దారుణం
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న గోదావరి పుష్కర ఘాట్ మరణాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పుష్కర తొక్కిసలాట ఘటనపై ఇంతవరకు ఎందుకు విచారణ జరగలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పుష్కర ఘాట్‌లోనే స్నానం చేశారని ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం దారుణం అని ఉండవల్లి అన్నారు. -
ఉల్లి కోసం బారులు.. తొక్కిసలాట
కంచరపాలెం: విశాఖనగరం కంచరపాలెంలోని ఉల్లిగడ్డల విక్రయ కేంద్రం వద్ద మహిళల తోపులాట యుద్ధ వాతారణాన్నిమరిపించింది. సోమవారం ఉదయం ఏడు గంటలకే కంచరపాలెం రైతు బజార్లో కిలో రూ.20 కే ఉల్లి పాయల విక్రయ కేంద్రం మొదలైంది. మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటయ్యాయి. అయితే, 8 గంటలకల్లా మహిళల క్యూలైన్ మాత్రం కిలోమీటర్ మేర పెరిగిపోయింది. పంపిణీ ఆలస్యం అవుతుండటంతో మహిళల క్యూలో తోపులాట మొదలైంది. అక్కడ మహిళల సిగపట్లు ముదిరిపోయి పరిస్థితి అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా రైతుబజార్ లో గందరగోళం ఏర్పడింది. దీంతో అధికారులు ఉల్లి విక్రయాలను నిలిపి వేశారు. పురుషుల క్యూలైనును మాత్రం కొనసాగించారు. గంట తర్వాత పోలీసుల సహాయంతో విక్రయాల కౌంటర్‌ను తిరిగి ప్రారంభించారు. కాగా, కేంద్రంలో మూడు కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేయటంతో రద్దీ ఎక్కువగా ఉందని, మరిన్ని కౌంటర్లు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. -
11మంది చనిపోయారనగానే బాబు ఘాట్ విడిచారు
హైదరాబాద్: తొక్కిసలాట సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడ ఉన్నారని స్పష్టమైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ జిల్లా ఎస్పీ చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని వెలువరించింది. ఘటన జరిగిన వెంటనే నలుగురు చనిపోయినట్లు ఎస్పీ తొలుత చెప్పినప్పుడు చంద్రబాబు అక్కడే ఉన్నారని, పదకొండు మంది చనిపోయారని చెప్పిన తర్వాత మాత్రం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారని ఎస్పీ చెప్పినట్లు పత్రిక వెల్లడించింది. పుష్కర ఘాట్ వద్ద చేసిన ఏర్పాట్లలో లోపాలున్నట్లు కూడా ఎస్పీ తెలిపారని కథనం వెలువరించింది. బారికేడ్లు తొక్కిసలాటను నివారించలేకపోయాయని ఆ పత్రికతో ఎస్పీ చెప్పారు. ముఖ్యమంత్రి ఉదయం 6.26 నిమిషాల సుముహుర్తానికి పుష్కరస్నానం చేశారని భక్తులందరికీ తెలుసని, అదే సమయంలో స్నానం చేయాలని భక్తులు కుప్పలుగా వచ్చారని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ స్పష్టం చేసినట్లు ఆంగ్ల పత్రిక వెలువరించింది. -
టికెట్ల తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి!
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో విషాదం నెలకొంది. స్థానిక శివ థియేటర్ లో టికెట్ల కోసం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక ఒక వ్యక్తి మృతి చెందాడు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపించారు. ప్రేక్షకులకు సరియైన ఏర్పాటు చేయడంలో విఫలం కావడం వల్లనే ఓ వ్యక్తి మరణానికి కారణమైందని పలువురు విమర్శిస్తున్నారు. థియేటర్ యాజమాన్య వైఖరి నిరసిస్తూ మృతదేహంలో బంధువు ఆందోళన చేపట్టారు.