బ్యాంకులో తోపులాట: ఇద్దరికి గాయాలు
Published Sat, Dec 3 2016 2:38 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
పాలకొల్లు: నోట్ల రద్దు చేసి 25 రోజులైనా పూర్తి స్థాయిలో నగదు అందక ప్రజలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద
ప్రజలు గంటల తరబడి ఉన్నా రెండు వేలు కూడా దొరకని పరిస్థితి. దీంతో తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఓ బ్యాంకులో తోపులాట జరిగింది. స్థానిక ఎస్‌బీఐకు నగదు చేరుకుందని తెలుసుకున్న ఖాతాదారులు భారీగా తరలివచ్చారు. శనివారం బ్యాంకు ఒక్కపూటే పని చేయడం, ఆదివారం సెలవు కావడంతో నగదు అందదేమోనని ఆందోళన చెందారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగి బ్యాంకు అద్దాలు పగిలాయి. ఇద్దరు ఖాతాదారులకు గాయాలయ్యాయి.
Advertisement
Advertisement