ఎస్బీఐలో తొక్కిసలాట
ఎస్బీఐలో తొక్కిసలాట
Published Mon, Dec 5 2016 11:07 AM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
- ఐదుగురికి అస్వస్థత
బద్వేల్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సోమవారం తొక్కిసలాట జరిగింది. నిన్న సెలవు కావడంతో.. సోమవారం తెల్లవారుజాము నుంచే కస్టమర్లు బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. పింఛన్లు కూడా బ్యాంకుల్లోనే ఇస్తుండటంతో వృద్ధులు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గేట్లు తెరవగానే.. జనాలంతా ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు ఈ తొక్కిసలాటలో కిందపడిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో ఐదుగురు వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. భారీగా జనం బ్యాంకు వద్దకు చేరుకున్నా పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో.. అరకోర సిబ్బంది జనాన్ని నిలవరించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదరైందని స్థానికులు అంటున్నారు.
Advertisement
Advertisement