జనసేన సభలో జనసైనికుల అత్యుత్సాహం | Janasena Formation Day Stamped Guntur District | Sakshi
Sakshi News home page

జనసేన సభలో జనసైనికుల అత్యుత్సాహం

Published Mon, Mar 14 2022 9:04 PM | Last Updated on Mon, Mar 14 2022 9:08 PM

Janasena Formation Day Stamped Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి ఇప్పటంలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో జనసైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో సభ ప్రాంగణం వద్ద భారీగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన శ్రీదేవి ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయింది.

ఈ తోపులాటలో ఆమె ఎడమ కాలు విరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సభను కవర్‌చేస్తూ.. ఫోటోలు తీస్తున్న ఇద్దరు ఫోటోగ్రాఫర్ల కెమెరాలను లాక్కుని జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement