
తొక్కిసలాటపై విచారణ జరగకపోవడం దారుణం
ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న గోదావరి పుష్కర ఘాట్ మరణాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న గోదావరి పుష్కర ఘాట్ మరణాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పుష్కర తొక్కిసలాట ఘటనపై ఇంతవరకు ఎందుకు విచారణ జరగలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పుష్కర ఘాట్లోనే స్నానం చేశారని ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం దారుణం అని ఉండవల్లి అన్నారు.