గవ్వల బాబా అరెస్ట్‌ | gavvala baba arrest | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 19 2017 7:29 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

gavvala baba arrest

కరీంనగర్‌: మంత్రతంత్రాలు, మాయమాటలతో అమాయక ప్రజలను మోసగిస్తున్న గవ్వల బాబాను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌లోని ఇందిరమ్మ కాలనీ రేకుర్తికి చెందిన నడిగొట్టు రాజేష్(32) తనకు మంత్రాలు, మాయలు వచ్చని, వాటితో సంతానం కలిగించడం, ఉద్యోగాలు రప్పించడం, అనారోగ్యాలు నయం చేయడం, వశీకరణం చేయడం, అందరి బాధలు పోగొట్టడం, కిడ్నీ సమస్యలు తగ్గించడం, ధన ప్రాప్తి కలిగించడం చేస్తానని మాయమాటలు చెప్పి అమాయకులను మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్నాడు. తన దగ్గరకు వచ్చిన వారి మానసిక స్థితిని గమనించి గవ్వలు వేసి వాటితో వచ్చే నెంబరుతో మీకు మంచి జరగదని, అందుకు పూజలు చేయాలని, మంత్రాలుతంత్రాలు చేయాలని చెప్పి తాయత్తులు కట్టించి ధనార్జనే ధ్యేయంగా వారాలు వారాలు రావాలని చెబుతూ మోసం చేస్తున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టికి వచ్చింది. అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతనిపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిఐ శ్రీనివాసరావు, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు, కొత్తపల్లి ఎస్సై రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement