హత్రాస్‌ తొక్కిసలాట: భయంతో మరో బాబా వినతి | Dhirendra Krishna Shastri Scared Made Big Appeal | Sakshi
Sakshi News home page

హత్రాస్‌ తొక్కిసలాట: భయంతో మరో బాబా వినతి

Published Wed, Jul 3 2024 11:08 AM | Last Updated on Wed, Jul 3 2024 11:26 AM

Dhirendra Krishna Shastri Scared Made Big Appeal

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల సంఖ్య 121 దాటింది. ఈ ప్రమాదం నేపధ్యంలో అప్రమత్తమైన మధ్యప్రదేశ్‌కు చెందిన మరో బాబా తన అనుచరులను ఉద్దేశిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి భక్తులు, అనుచరులు అధిక సంఖ్యలో ఉన్నారు. జూలై నాలుగున జరిగే అతని పుట్టిన రోజుల వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హత్రాస్‌ ఘటన నేపధ్యంలో మరోమారు అలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి  తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో షేర్‌ చేశారు.

ఆ వీడియోలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి  ‘జూలై 4న నా  పుట్టిన రోజు. ఆ రోజు నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గుతుంది. అయితే ఆరోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వీడియో ద్వారా ఒక అభ్యర్థన  చేస్తున్నాను. జూలై నాలుగున జరిగే వేడుకలకు దూరప్రాంతాల నుంచి రావాలనుకుంటున్నవారు తమ ఇళ్లలోనే పూజలు చేసుకోవాలి. ఇప్పటికే ఇక్కడ భక్తుల రద్దీ పెరిగింది. భద్రత దృష్ట్యా  ఎక్కడివారు అక్కడే వేడుకలు చేసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement