
ఆశ్రమాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అనంతపురం,ఉరవకొండ: వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని గోవిందప్ప ఆశ్రమ పీఠాధిపతి గురునాథస్వామి ఓ భక్తురాలిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లున్న ఆడియో టేప్ ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. వేలాదిమంది తరలివచ్చే ఈ ఆశ్రమంలో అమావాస్య రోజు పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక భజనలు, పూజలు చేస్తుంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లాకు చెందిన ఓ భక్తురాలిని పీఠాధిపతి లైంగికంగా వేధించినట్లు ఓ ఆడియో టేపు ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉరవకొండ సీఐ సయ్యద్ చిన్నగౌస్ సోమవారం ఆశ్రమానికి వెళ్లి విచారించారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ఆశ్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment