సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం బాబా. ఆయనే కథ కథనాలను సమకూర్చారు. ఈ చిత్రానికి అన్నామలై వీరా, బాష వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. నటి మనిషా కొయిరాలా కథానాయకిగా నటించిన ఇందులో గణేష్ సుజాత ఎంఎన్ నంబియార్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, సంగవి, కరుణాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చోటా.కే.నాయుడు చాయాగ్రహణను, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.
రజనీకాంత్‌తో దర్శకుడు సురేష్ కృష్ణ
2002 భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. అప్పట్లో ఈ చిత్రంపై రాజకీయ వ్యతిరేకత కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఇందులోని మాయా మాయా, శక్తి కొడూ.. కిచ్చూ కిచ్చూ పాటలు ప్రజాధరణ పొందాయి. ఈ పాటలకు నృత్య దర్శకత్వం వహించిన బృందా, ప్రభు దేవా, లారెన్స్‌కు మంచి గుర్తింపు వచ్చింది. చిత్రంలో రజనీకాంత్ తరచూ చేతి వేళ్లతో చూపించే బాబా ముద్ర చిన్న పిల్లలకు రీచ్ అయింది.
అలాంటి చిత్రాన్ని నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించి మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్ర కథలో కూడా మార్పులు చేస్తున్నట్లు, పాటలను కూడా రీమిక్స్ చేసి డాల్ఫీ సౌండ్ సిస్టంలో రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment