మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మత గురువుల ప్రాధాన్యత అంతకంతకూ పెరిగిపోతోంది. రాజకీయ పార్టీలు బాబాల దయ కోసం వెంపర్లాడుతున్నాయి. కొందరు బాబాలు అధికార పక్షం వారిని ఆశీర్వదిస్తుండగా, మరికొందరు బాబాలు ప్రతిపక్షాలపై ఆశీస్సులు కురిపిస్తున్నారు.
సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ నుంచి శివరాజ్ సింగ్ వరకు బాబాల వైభవాన్ని కొనియాడుతున్నారు. బాబాలకు భక్తులుగా మారేందుకు పోటీ పడుతున్నారు. కొన్నిసార్లు కమల్‌నాథ్.. బాగేశ్వర్ ధామ్‌లోని ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో కనిపిస్తుండగా, మరికొన్నిసార్లు శివరాజ్ సింగ్ చౌహాన్.. ప్రదీప్ మిశ్రా ఆశ్రమంలో సేదతీరుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాబాల ఆధిపత్యం అధికంగా కనిపించింది.
ఇప్పటి (2023) విషయానికొస్తే కొత్త బాబాలు చాలామంది పుట్టుకు వచ్చారు. ఈ జాబితాలో కంప్యూటర్ బాబా, బాగేశ్వర్ ధామ్ సర్కార్, ప్రదీప్ మిశ్రా, పండోఖర్ సర్కార్, జయ కిషోరి, రావత్‌పురా సర్కార్, సంత్ రవిశంకర్, కమల్ కిషోర్ నాగర్ తదితరులు ఉన్నారు. వీరిని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీకి హిందుత్వ అనే ట్యాగ్‌లైన్ ఉంది. కాంగ్రెస్ లౌకిక పార్టీ.. అయినా కమల్ నాథ్ మతతత్వవాది. చింద్వారాలో బాబా బాగేశ్వర్‌ను తరచూ కలుస్తుంటారు. ఈ బాబాతో కలిసి హెలికాప్టర్‌లో తిరుగుతూ చాలాసార్తు కనిపించారు. ఈ బాబా కాంగ్రెస్‌కు మద్దతి ఇచ్చినా, బీజేపీకి కూడా వత్తాసు పలుకుతుంటారు.
ఛతర్‌పూర్ ఎమ్మెల్యే అలోక్ చతుర్వేది నిత్యం బాబాల సేవలో ఉంటారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతి కార్యక్రమంలో బాబాలను సన్మానిస్తుంటారు. బాబా బాగేశ్వర్ నుండి రుద్రాక్ష్ బాబా (ప్రదీప్ మిశ్రా) వరకు అందరూ బీజేపీని ఆశీర్వదించారు. అయితే ఈ బాబాల ఆశీస్సులను కాంగ్రెస్ కూడా కోరుకుంటుంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త జయ కిషోరిని కూడా తమ వైపునకు తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. కాగా మత ప్రచారకుల మొగ్గు బీజేపీ వైపు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్.. మత పెద్దల ఆశీర్వాదాలను కోరుకుంటోంది. ఈ విధంగా ఓటు బ్యాంకు పెంచుకోవాలని ఆ పార్టీ తాపత్రయ పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఖలీద్ మషాల్ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment