religious
-
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు
అయోధ్య: దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్ వేడుకలకు యూపీలోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్టోబర్ 30న జరిగే దీపోత్సవ్ కోసం రామనగరిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తివిశ్వాసాల కలబోతతో అయోధ్య వెలుగులమయం కానుంది.అయోధ్యలో జరిగే 8వ దీపోత్సవంలో అవధ్ యూనివర్సిటీకి చెందిన 30 వేల మంది వాలంటీర్లు దీపోత్సవ్ స్థలంలో 28 లక్షల దీపాలను అమర్చేందుకు కృషి చేస్తున్నారు. రామ్ కీ పైడిలోని 55 ఘాట్ల వద్ద జై శ్రీరామ్ నినాదాలతో వెలుగుల పండుగలో వాలంటీర్లు పాల్గొననున్నారు.శ్రీరాముడు కొలువైన అయోధ్య ఈ సంవత్సరం దీపోత్సవం సందర్భంగా డిజిటల్ సిటీగా కనిపించబోతోంది. వెలుగుల సంగమం ఆవిష్కృతం కానుంది. ధరంపథ్ నుండి లతా మంగేష్కర్ చౌక్ వరకు, రంగురంగుల లైట్లు ఆకర్షణీయంగా కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా లతా మంగేష్కర్ చౌక్ వెలుగు జిలుగులతో అత్యంత సుందరంగా కనిపించనుంది.దీపోత్సవ వేడుకలకు నగరమంతా త్రేతాయుగంలా ముస్తాబైంది. త్రేతాయుగంలో రాముడు లంకను జయించి అయోధ్యకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసేలా అయోధ్యను రంగురంగుల దీపాలతో అలంకరించారు.లతా మంగేష్కర్ చౌక్ నుండి వివిధ కూడళ్లలో రామభక్తుల కోసం డిజిటల్ డిస్ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామభక్తులు దీపోత్సవ్ ప్రదేశానికి వెళ్లలేకపోయినా, డిజిటల్ తెరలపై దీపోత్సవాన్ని చూసి ఆస్వాదించవచ్చు.రంగురంగుల దీపాలు అయోధ్య అందాన్ని మరింత పెంచుతున్నాయి. రామభక్తులు రాత్రిపూట అయోధ్య వీధుల్లోకి వెళ్లినప్పుడు తమను తాము మైమరచిపోయేలా దీపోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.ఇది కూడా చదవండి: అత్యంత వృద్ధ మహిళ అస్తమయం -
సొంత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న మసీదు కమిటీ
ముంబై: ముంబైలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు నేటి (సోమవారం)తో గడువు ముగిసింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తోంది. బీఎంసీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మసీదు ట్రస్ట్ స్వయంగా ఈ చర్య చేపట్టింది.అక్రమ నిర్మాణం కూల్చివేతలో ముందుగా మసీదుపై అక్రమంగా నిర్మించిన గోపురాన్ని కూల్చివేస్తున్నారు. ఆ తర్వాత ఇతర అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు. దీనికిముందు మసీదు ట్రస్టు అక్రమ నిర్మాణంలో కొంత భాగాన్ని పచ్చటి పరదాతో కప్పివుంచింది. బీఎంసీ బృందం మసీదును పరిశీలించేందుకు వచ్చి, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.అయితే ఈ మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని మసీదు ట్రస్టు స్వయంగా హామీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో మసీదు కూల్చివేత పనులను సోమవారం ప్రారంభించింది. హిమాచల్‌లోని కులులో అక్రమ మసీదు నిర్మాణంపై హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూణెలో అక్రమంగా నిర్మితమైన మసీదు, మదర్సా కూల్చివేత పనులను పూణే మహానగర పాలక సంస్థ చేపట్టింది.ఇది కూడా చదవండి: ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా? -
Rajasthan: ధార్మిక ఊరేగింపులో ఉద్రిక్తత
భిల్వారా: రాజస్థాన్‌లోని షాపురా జిల్లాలో గల జహజ్‌పూర్‌లో జల్ఝులానీ ఏకాదశి ఊరేగింపులో రాళ్ల దాడి చోటుచేసుకుంది. కోట నుండి వస్తున్న పీతాంబర్ రాయ్ మహారాజ్ ఊరేగింపుపై ఒక మతపరమైన స్థలం వెలుపల రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు, కొందరు యువకులు, బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు. రాళ్లదాడి అనంతరం ఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జహజ్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఈ ఘటన నేపధ్యంలో పలు దుకాణాలు మూతపడ్డాయి. పట్టణంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి షాపురా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ కన్వత్ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టణంలో మత సామరస్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ రాజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ఏదైనా పండుగ నిర్వహించే ముందుగా ఇరు వర్గాల సమావేశం నిర్వహించాలని ఎస్‌డిఎం, పరిపాలనాధికారులకు సూచించారు. ఘటన ఎలా జరిగిందనే విషయమై విచారణ జరుపుతున్నామన్నారు. సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. ఇది కూడా చదవండి: నిమజ్జనానికి 2,500 వాహనాలు -
PM Narendra Modi: లౌకిక పౌరస్మృతి!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మతపరమైన పౌరస్మృతి అమల్లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దాన్ని 75 ఏళ్లుగా భరిస్తున్నాం. ఆ స్మృతికి చరమగీతం పాడి దాని స్థానంలో దేశ ప్రజలందరికీ సమానంగా వర్తించే ‘లౌకిక’ పౌరస్మృతిని రూపొందించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే. దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ఉండాలని ఆదేశిక సూత్రాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ఆవశ్యకతను సుప్రీంకోర్టు కూడా పలుమార్లు నొక్కిచెప్పింది. ఆ మేరకు తీర్పులు వెలువరించింది’’ అని గుర్తు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం మోదీ ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఆయనకిది వరుసగా పదకొండోసారి కావడం విశేషం. బీజేపీ ఎజెండా అంశాల్లో, ప్రధాన ఎన్నికల ప్రచార నినాదాల్లో ఒకటైన యూసీసీని వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తామని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ‘‘ప్రస్తుత పౌరస్మృతి ఒకవిధంగా మతపరమైనదన్న అభిప్రాయం సమాజంలోని మెజారిటీ వర్గంలో ఉంది. అందులో వాస్తవముంది. ఎందుకంటే అది మతవివక్షతో కూడినది. అందుకే దాన్నుంచి లౌకిక స్మృతివైపు సాగాల్సి ఉంది. తద్వారా రాజ్యాంగ నిర్మాతల కలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అది తక్షణావసరం కూడా’’ అని పేర్కొన్నారు. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ కూడా దేశానికి చాలా అవసరమని మోదీ అన్నారు. ‘‘2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేసుకుందాం. అందుకు 140 కోట్ల పై చిలుకు భారతీయులంతా భుజం భుజం కలిపి కలసికట్టుగా సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. రంగాలవారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని 98 నిమిషాల పాటు వివరించారు. తద్వారా అత్యంత ఎక్కువ సమయం పాటు పంద్రాగస్టు ప్రసంగం చేసిన ప్రధానిగా సొంత రికార్డు (94 నిమిషాల)నే అధిగమించారు. కొత్తగా 75,000 వైద్య సీట్లు ‘‘వైద్య విద్య కోసం మన యువత విదేశీ బాట పడుతోంది. ఇందుకోసం మధ్యతరగతి తల్లిదండ్రులు లక్షలు, కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అనామక దేశాలకు కూడా వెళ్తున్నారు’’ అని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. వచ్చే ఐదేళ్లలో 75 వేల వైద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ‘‘ఉన్నత విద్య కోసం యువత భారీగా విదేశాలకు వెళ్తోంది. దీన్ని సమూలంగా మార్చేస్తాం. విదేశాల నుంచే విద్యార్థులు మన దగ్గరికొచ్చే స్థాయిలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. అలనాటి నలంద విశ్వవిద్యాలయ స్ఫూర్తితో 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతాం. నూతన విద్యా విధానానిది ఇందులో కీలక పాత్ర కానుంది.కిరాతకులకు వణుకు పుట్టాలి మహిళలపై హింసకు తక్షణం అడ్డుకట్ట వేయాల్సిందేనని మోదీ అన్నారు. ‘‘మహిళలపై అకృత్యాలకు తెగించేవారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. ఉరి తప్పదన్న భయం రావాలి. మహిళలను ముట్టుకోవాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి కలి్పంచడం చాలా ముఖ్యం. ఇలాంటి కేసుల్లో పడ్డ శిక్షల గురించి అందరికీ తెలిసేలా మీడియాలో విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. అప్పుడే ప్రజల్లో తిరిగి విశ్వాసం పాదుగొల్పగలం’’ అన్నారు. కోల్‌కతాలో వైద్యురాలిపై దారుణ హత్యాచారం దేశమంతటినీ కుదిపేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘మహిళల భద్రత బాధ్యత కేంద్రంపై, రాష్ట్రాలపై, ప్రజలందరిపై ఉంది. కోల్‌కతా ఘోరంపై దేశమంతా తీవ్రంగా ఆక్రోశిస్తున్న తీరును అర్థం చేసుకోగలను. నాదీ అదే మనఃస్థితి. నేనెంత బాధ పడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఆ కేసు విచారణను సత్వరం ముగించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నీచకృత్యాలు పదేపదే జరుగుతుండటం బాధాకరం’’ అన్నారు. బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరం కల్లోల బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో ఆందోళన నెలకొందని మోదీ అన్నారు. అక్కడ త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వెలిబుచ్చారు. అందుకు భారత్ అన్నివిధాలా సహకారం అందిస్తుందని చెప్పారు.లక్ష మంది యువత రాజకీయాల్లోకిరాజకీయ రంగంలో కుల, కుటుంబవాదాలకు అడ్డుకట్ట వేయాలని మోదీ అన్నారు. అందుకోసం ఏ రాజకీయ నేపథ్యమూ లేని లక్ష మంది యువతీ యువకులు ప్రజా జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. ‘‘వారికి నచి్చన పారీ్టలో చేరి అన్ని స్థాయిల్లోనూ ప్రజాప్రతినిధులుగా మారాలి. కొత్త ఆలోచనలతో కూడిన ఆ కొత్త రక్తం మన ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయగలదు’’ అన్నారు.ప్రతికూల శక్తులతో జాగ్రత్త దేశ ప్రగతిని కొందరు ఓర్వలేకపోతున్నారని విపక్షాలనుద్దేశించి మోదీ విమర్శించారు. ‘‘ప్రతిదాన్నీ ధ్వంసం చేయాలని వాళ్లు కలలుగంటున్నారు. అవినీతిని ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రతికూల శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’’ అన్నారు. అంతర్గతంగా, బయటి నుంచి భారత్ లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.రాజస్తానీ రంగుల తలపాగా ఎప్పట్లాగే ఈ పంద్రాగస్టు సందర్భంగా కూడా మోదీ ప్రత్యేక తలపాగాతో మెరిసిపోయారు. పసుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన రాజస్తానీ సంప్రదాయ లెహరియా తలపాగాతో ఆకట్టుకున్నారు. తెల్ల కుర్తా, చుడీదార్, నీలిరంగు బంద్గలా ధరించారు. -
అమెరికా మత స్వేచ్ఛ రిపోర్టు.. రిజెక్ట్ చేసిన భారత్
న్యూఢిల్లీ: అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023 పూర్తిగా పక్షపాతవైఖరితో కూడినదని భారత్ విమర్శించింది. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం(జూన్28) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. భారత్‌లో సామాజిక కూర్పును అర్థం చేసుకోకుండా కేవలం ఓట్‌బ్యాంకు పాలిటిక్స్ ఆధారంగా తయారు చేసిన నివేదికలా అది కనిపిస్తోందన్నారు. ‘రిపోర్టులో చాలా పొరపాట్లున్నాయి. ఎంపిక చేసుకున్న అంశాలను వారికి కావల్సిన చోట కావల్సినట్లుగా అన్వయించుకున్నారు. పక్షపాత వైఖరితో తయారు చేశారు. రాజ్యాంగ నిబంధనలను చట్టాలకు కూడా తమకు కావల్సినట్లుగా భాష్యం చెప్పారు’అని జైస్వాల్ తెలిపారు. -
US: అమెరికాలో భక్తి ఇంతలా ఉంటుందా?
అందరి దేశం అమెరికా. ఏ ఒక్క జాతికో మతానికో పరిమితమైన దేశం అనే పరిస్థితి మాత్రం అక్కడ లేదు. నానా జాతులు, భిన్న మతస్తులు, ఎన్నో సంస్కృతుల వారంతా కలిసి అమెరికా సంయుక్త రాష్ట్రాల పేర ఒక ఆధునికమైన దేశాన్ని నిర్మించుకున్నారు. ఒక కొత్త సంస్కృతికి బాటలు వేశారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనున్న జనాభా దాదాపు దాదాపు 33 లేదా 34 కోట్లు మాత్రమే, మన దేశంతో ( 140 కోట్ల పైనే ) పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. యూ ఎస్ జనాభాలో తెల్లవారు దాదాపు 75 శాతం ( వైట్స్ 57, లాటినోస్ 18 ) నల్లవారు 12 శాతం, మిగతా వారు అమెరికా భూమి పుత్రులైన రెడ్ ఇండియన్స్, ఆసియా, ఫసిఫిక్ వగైరా దేశస్తులు. మత పరంగా చూసినప్పుడు 2022 అంచనా ప్రకారం క్రిస్టియన్ ప్రొటెస్టెంట్లు (34 శాతం ) ముందు వరసలో వారి తర్వాతి స్థానం ( 23 శాతం ) క్యాతోలిక్స్ది. యూదులు 2 శాతం కాగా, ఇతర చిన్న మతాల వారు 3 శాతం లేదా ఏ మతంతో సంబంధం లేదు అనేవారు 38 శాతం అమెరికాలో ఏ పట్టణానికి వెళ్లినా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రముఖమైన అన్ని మతాల ప్రార్థణా మందిరాలు కనబడతాయి. ముఖ్యంగా మెజారిటీ వర్గానికి సంభందించిన చర్చిలకు కొదవ లేదు. అయితే వీటికి రెగ్యులర్‌గా హాజరు అయ్యేవారి సంఖ్య మాత్రం అంతంతేనని చెప్పవచ్చు. ఇక్కడ భక్తులను ఆకర్షించడానికి నిర్వాహకులు ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగమే ఉచిత వారాంత లంచ్‌లు, వైద్య శిభిరాలు, ఆస్పత్రులు, అనాథ, వృద్ధ ఆశ్రమాలు, విద్యా సంస్థల నిర్వహణ వంటివి. అవి ఏవైనా, ఏ మతం వారు చేసినా "మానవ సేవే మాధవ సేవ"గా భావించి చేసిన కార్యక్రమాలతో పేద వర్గాలకు అంతో ఇంతో మేలు జరుగుతుంది. అమెరికన్ చర్చిల్లో ఎక్కువగా కనబడేవారు అక్కడ స్థిరపడిన చైనా, దక్షిణ కొరియా ,జపాన్, తైవాన్, థాయిలాండ్, వియత్నాం, మెక్సికో, టర్కి, జర్మనీ తర్వాత మనవారు. అమెరికా వైశాల్యంలో భారత్ కన్నా చాలా పెద్ద దేశం. వాళ్లకు భూమి కొరత లేదు. అందుకే అక్కడి ప్రార్థణా స్థలాలు ఏ మతం వారివైనా విశాలమైన ప్రాంగణాల్లో ఉంటాయి. రోడ్ల పక్క, కూడళ్లలో ఎక్కడ ఉచిత స్థలం దొరికితే అక్కడ ప్రార్థణా స్థలాలు నిర్మించడం, మైకులు పెట్టి శబ్ద కాలుష్యం సృష్టించడం వాళ్లకు నచ్చదు. కాకపోతే కరపత్రాలు వేస్తారు, పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు, ప్రచార సాహిత్యాన్ని పంచుతారు, ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకుంటారు. అమెరికన్ చర్చిల్లో చాలాచోట్ల ఆటస్థలాలు, ప్లే స్కూల్లు, గ్రంధాలయాలు, సమావేశ మందిరాలు ఉంటాయి. ఇక పార్కింగ్ స్థలాల గురించి చెప్పే పని లేదు. ఆ సౌకర్యం లేకుండా వాళ్ళు అలాంటి నిర్మాణాలను అనుమతించకపోవడం విశేషం. క్రైస్తవేతర మతాలయాల విషయంలో హిందువులు, ముస్లింలు, బౌద్దులు ముందున్నారని చెప్పవచ్చు. అమెరికాలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా భారతీయులు కనబడుతారు ముఖ్యంగా మన తెలుగువారికి కొదువ లేదు, అదే విధంగా హిందూ దేవుళ్ళు దర్శన మిస్తారు. ఒక అంచనా ప్రకారం ఆ దేశంలో నున్న హిందువుల సంఖ్య దాదాపు రెండున్నర మిలియన్లు. హిందూ ఆలయాల్లో ప్రసిద్ధమైనవి పిట్స్ భర్గ్ వెంకటేశ్వరాలయం, న్యూ జెర్సీ, అట్లాంటా , హ్యూస్టన్‌లోని స్వామి నారాయణ్ అక్షరధాంలు, వెస్ట్ వెర్జినియాలోని బృందావనం, మేరీలాండ్‌లోని శివ విష్ణు ఆలయం, న్యూయార్క్ గణేష, ఇవేకాక మీనాక్షి , హనుమాన్, సాయిబాబా వంటి మందిరాలు మనకు ఎన్నో చోట్ల దర్శనం ఇస్తాయి. హరే కృష్ణ, రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, గురు రవిశంకర్ గారి ఈషా యోగా ధ్యాన కేంద్రాలు, గతంలో ఒక వెలుగు వెలిగిన మహేష్ యోగి, ఓషో వంటి వారివి ఇలా అక్కడ తమ కార్యకలాపాలు సాగించిన భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో. ఇలాంటివి భారతీయులు కలుసుకోడానికి, సేవా కార్యక్రమాలు చేపట్టడానికి, పరస్పరం సహాయ సహకారాలు అందించుకోడానికి కూడా ఉపయోగ పడుతున్నాయి. ఈ మందిరాల నిర్వాహకులు భారత్ నుంచి తరచుగా గురువులను, ప్రభోదకులను ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివాటి వల్ల భారత్ నుంచి అమెరికా వెళ్లిన వాళ్లకు కూడా స్వదేశంలో ఉన్న భావన కలగడం సహజం . నేను 2006 మొదలు 2022 వరకు ఒక దశాబ్దంన్నర కాలంలో పదికి పైగా పర్యాయాలు ఒకసారి జంటగా మరోసారి ఒంటరిగా, అమెరికాలోనున్న మా పిల్లలను చూడడానికి వెళ్ళిన ప్రతిసారి ఏవోకొన్ని పర్యాటక ప్రాంతాలను, అక్కడి హైందవ ఆలయాలను దర్శించు కున్నప్పుడు ఆ దేశస్తుల్లో గమనించిన పరమత సహనం ప్రశంసనీయం ! వేముల ప్రభాకర్ (చదవండి: విమానం కన్నా హాయిగా అమెరికాలో బస్సు జర్నీ!) -
కన్నడ కాంతార కాదు.. కేరళ కలియట్టం
-
ప్రపంచంలోని గొప్ప మతపరమైన భవనాలు (ఫోటోలు)
-
బాబాల మాయలో మధ్యప్రదేశ్ సర్కార్? ‘ఓట్ల ఆశీర్వాదం’ కోసం పడిగాపులు?
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మత గురువుల ప్రాధాన్యత అంతకంతకూ పెరిగిపోతోంది. రాజకీయ పార్టీలు బాబాల దయ కోసం వెంపర్లాడుతున్నాయి. కొందరు బాబాలు అధికార పక్షం వారిని ఆశీర్వదిస్తుండగా, మరికొందరు బాబాలు ప్రతిపక్షాలపై ఆశీస్సులు కురిపిస్తున్నారు. సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ నుంచి శివరాజ్ సింగ్ వరకు బాబాల వైభవాన్ని కొనియాడుతున్నారు. బాబాలకు భక్తులుగా మారేందుకు పోటీ పడుతున్నారు. కొన్నిసార్లు కమల్‌నాథ్.. బాగేశ్వర్ ధామ్‌లోని ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో కనిపిస్తుండగా, మరికొన్నిసార్లు శివరాజ్ సింగ్ చౌహాన్.. ప్రదీప్ మిశ్రా ఆశ్రమంలో సేదతీరుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాబాల ఆధిపత్యం అధికంగా కనిపించింది. ఇప్పటి (2023) విషయానికొస్తే కొత్త బాబాలు చాలామంది పుట్టుకు వచ్చారు. ఈ జాబితాలో కంప్యూటర్ బాబా, బాగేశ్వర్ ధామ్ సర్కార్, ప్రదీప్ మిశ్రా, పండోఖర్ సర్కార్, జయ కిషోరి, రావత్పురా సర్కార్, సంత్ రవిశంకర్, కమల్ కిషోర్ నాగర్ తదితరులు ఉన్నారు. వీరిని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీకి హిందుత్వ అనే ట్యాగ్‌లైన్ ఉంది. కాంగ్రెస్ లౌకిక పార్టీ.. అయినా కమల్ నాథ్ మతతత్వవాది. చింద్వారాలో బాబా బాగేశ్వర్‌ను తరచూ కలుస్తుంటారు. ఈ బాబాతో కలిసి హెలికాప్టర్లో తిరుగుతూ చాలాసార్తు కనిపించారు. ఈ బాబా కాంగ్రెస్‌కు మద్దతి ఇచ్చినా, బీజేపీకి కూడా వత్తాసు పలుకుతుంటారు. ఛతర్పూర్ ఎమ్మెల్యే అలోక్ చతుర్వేది నిత్యం బాబాల సేవలో ఉంటారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతి కార్యక్రమంలో బాబాలను సన్మానిస్తుంటారు. బాబా బాగేశ్వర్ నుండి రుద్రాక్ష్ బాబా (ప్రదీప్ మిశ్రా) వరకు అందరూ బీజేపీని ఆశీర్వదించారు. అయితే ఈ బాబాల ఆశీస్సులను కాంగ్రెస్ కూడా కోరుకుంటుంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త జయ కిషోరిని కూడా తమ వైపునకు తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. కాగా మత ప్రచారకుల మొగ్గు బీజేపీ వైపు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్.. మత పెద్దల ఆశీర్వాదాలను కోరుకుంటోంది. ఈ విధంగా ఓటు బ్యాంకు పెంచుకోవాలని ఆ పార్టీ తాపత్రయ పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఖలీద్ మషాల్ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి? -
సిక్కు మత్త పెద్దలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
-
ఆప్ హోదాలో కాదు.... వ్యక్తిగతంగా పాల్గొన్నా!
న్యూఢిల్లీ: మతమార్పిడి వివాదం ఎదుర్కొంటున్న ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ వివాదం మరింత వివాదాస్పదంగా అవుతుందన్న భయంతోనే గౌతమ్ చేత బలవంతంగా రాజీనామ చేయించారంటూ విమర్మలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ వివరణ ఇస్తూ తాను ఎవరి బలవంతంతోనూ రాజీనామ చేయలేదని, తన ఇష్ట ప్రకారమే రాజీనామ చేశానని చెప్పారు. ఈ మేరకు రాజేంద్ర గౌతమ్ అక్టోబర్ 5న వేలాది మంది బౌద్ధమతంలోకి మారుతున్న కార్యక్రమంలో తాను విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులను పూజించను అని చెబుతూ ప్రమాణం చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో ఈ వీడియో ఆధారంగా బీజేపీ ఆప్‌పై పలు ఆరోపణలు చేసింది. మతమార్పిడి పేరుతో హిందూ దేవుళ్లును దూషించారంటూ విమర్శలు చేసింది. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్‌కి ఈ వివాదం పెద్ద అడ్డంకిగా మారింది. పైగా బీజేపీ ఈ వీడియోనే లక్ష్యంగా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్‌ని హింది వ్యతిరేకిగా చిత్రీకరించడం మొదలు పెట్టింది. దీంతో గౌతమ్ ఈ కార్యక్రమం గురించి అసలు అరవింద్ కేజ్రీవాల్‌కు అసలు తెలియదని. ఇది సామాజిక మత సంబంధ కార్యక్రమమని అన్నారు. అలాగే బీఆర్ అంబేద్కర్ దేశానికి 22 వాగ్దానాలు ఇచ్చారని గుర్తుచేశారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరిగిందని, ఇలా 1956 నుంచి జరుగుతుందని అందులో అలా చెప్పడం సాధారణమని వివరణ ఇచ్చారు. అయినా బీజేపీ దేశంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలలు గురించి మాట్లాడటం మాని ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూడటం బాధకరమని ఆవేదనగా అన్నారు. అదీగా ఈ గుజరాత్ ఎన్నికల సమయంలో బీజీపీ నాయకులు ఆప్ గురించి చెడుగా ప్రచారం చేయడమే గాకుండా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన హిందూ వ్యతిరేకి అని పోస్టర్లు కూడా పెట్టారని అన్నారు. అసలు ఈ విషయాన్ని రాజకీయం చేయాల్సిన పనిలేదని, తాను ఈ కార్యక్రమంలో ఆప్ మంత్రిగా కాకుండా వ్యక్తిగత హోదాలో పాల్గొన్నానని చెప్పారు. ఇందులోకి తమ నాయకుడిని, పార్టీని ఎందుకు లాగుతున్నారంటూ గౌతమ్ ఆక్రోశించారు. (చదవండి: మాకు సీక్రెట్‌గా సపోర్ట్ ఇవ్వండి.. బీజేపీ నేతలకు ఆఫర్ ఇచ్చిన కేజ్రీవాల్!) -
మతం, మార్కెట్ కలిసిన రాజకీయం
స్వేచ్ఛా మార్కెట్టు అనే భావనలో ఎటువంటి స్వేచ్ఛా లేదు. అది... మధ్యతరగతి వాళ్ళకు ‘మేం మంచిగానే ఉన్నా’మనిపించే కొనుగోలుదారీతనపు మానసిక తృప్తినీ, పేద సాదలకు కేవలం నానా ఇబ్బందులూ పడి రోజువారీ బతుకు బత్తెం సంపాదించుకునే అవకాశాన్నీ ఇచ్చే నిర్మాణం మాత్రమే! ఇక్కడ విజయానికీ, ఓటమికీ పూర్తిగా బాధ్యులు వ్యక్తులే గానీ వ్యవస్థ కాదు. ఇక, అంతిమ సత్యాన్ని వ్యక్తి అర్థం చేసుకోవడానికి మతం ఒక దారి చూపుతుంది. ఫలితాల సాధనకు గానీ, సాధించలేనితనానికి గానీ సంపూర్ణ బాధ్యత సాధకులదే తప్ప మరొకరిది కాదు. ఈ రకంగా దేశంలో మతమూ, మార్కెట్టూ నడుమ భావనాత్మక ఐక్యత కుదిరింది. ఇప్పుడు మతం సామాజిక జీవితాన్ని నయా ఉదారవాద మార్కెట్‌కు అనుకూలంగా మార్చే పనిముట్టు మాత్రమే! మతమూ, వ్యాపారమూ అనే జోడుగుర్రాల మీద నయా ఉదారవాద హిందూత్వం సవారీ చేస్తూ, వ్యక్తి వాద ఆత్మ తృప్తిని గొప్ప విలువగా ప్రచారం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా ప్రజలను తిప్పుకునే కార్యక్రమంలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి మతాన్ని రాజకీయ పనిముట్టుగా మార్చడం అయితే, మరోటి ఉదారవాద మార్కెట్టును ఆయుధంగా మార్చడం. తీవ్రమైన నయా ఉదార వాదం... సాయుధమూ, హింసాత్మకమూ అయిన మత ప్రతీకలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ప్రభుత్వ రంగ వనరులను కుదువ బెట్టి డబ్బుచేసుకోవడం, ప్రజల వనరులను ప్రైవేటు రంగానికి అప్పచెప్పడం అనే ఆర్థిక కార్యక్రమం... ఆదే సమయంలో వ్యక్తిగత వ్యవహారంగా ఉండాల్సిన మతాన్ని బజారుకు ఈడ్వడం అనే వ్యూహం ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్నాయి. వాస్తవానికి స్వేచ్ఛా మార్కెట్టు అనే భావనలో ఎటువంటి స్వేచ్ఛా లేదు. అది మధ్యతరగతి వాళ్ళకు ‘మేం మంచిగానే ఉన్నాం’ అని అనిపించే కొనుగోలుదారీతనపు మానసిక తృప్తినీ, పేద సాదలకు కేవలం నానా ఇబ్బందులూ పడి రోజు వారీ బతుకు బత్తెం సంపా దించుకునే అవకాశాన్నీ ఇచ్చే నిర్మాణం మాత్రమే! ఇంకా ఇప్పుడు బజార్లలో మనకి కనిపిస్తున్న మతానికి ఆధ్యాత్మిక వికాసంతో ఎటువంటి సంబంధం లేదు. అది ఇప్పుడు అధిక సంఖ్యాకుల ఆధిపత్యాన్ని గట్టి పరిచే పనిముట్టు మాత్రమే. దోపిడీని స్వేచ్ఛ అని చూపే నయా ఉదార మార్కెట్టు, బజారుకెక్కి హింసాత్మక అధి పత్యాన్ని గట్టిపరిచే మతం... ఒకదానితో ఒకటి పెనవేసుకొన్న కొంగొత్త దృశ్యం ఇది! భారతదేశంలో హిందుత్వ రాజకీయాలు... మార్కెట్టునూ, మతాన్నీ రెండింటినీ కలిపి జనాన్ని తన వైపు తిప్పుకోవడానికి వాడుకుంటున్న వైనం స్పష్టం. అంతిమ సత్యాన్ని వ్యక్తి అర్థం చేసుకోవడానికి మతం ఒక దారి చూపుతుంది. విశ్వాసపూరిత మత ప్రధాన ఆచరణ ద్వారానే అంతిమ సత్యం లేదా దైవం అనుభవం లోకి వస్తుందనేది మతం చెప్పే కీలక విషయం. దైవాన్ని లేదా అంతిమ సత్యాన్ని తెలుసుకోలేదు అంటే... అనుమానాలు, సందేహాలు లేని పూర్ణ విశ్వాసం లేకపోవడమే కారణం అనే తర్కాన్ని మతాలు వాడుతాయి అని కొంచం కొంచం పరిశీలించే వారికి తెలిసి పోతుంది. అంటే విశ్వాసం లేకపోవడం వల్లనే విశ్వాసం ఇచ్చే అనుభవాన్ని పొందలేకపోవడానికి అడ్డంకి అనే విచిత్రమైన తర్కాన్ని మతం ముందుకు తెస్తుంది. అంటే మతాన్ని పాటించాలి అంటే ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు. రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయో అన్న సంశయాత్మక దృష్టి కలిగి ఉండటం అంటేనే మతం పట్ల విశ్వాసం లేని స్థితి అవుతుంది. ఈ తర్కం నీకు అచంచల విశ్వాసం లేకుంటే (పూర్ణ విశ్వాసిగా) నీవు అనుకున్న ఫలితాలు సాధించలేవు అనే వైపునకు దారి తీస్తుంది. ఫలితాల సాధనకు గానీ, సాధించలేని తనానికి గానీ సంపూర్ణ బాధ్యత సాధకులదే తప్ప మరొకరిది కాదు అనే నిరంకుశ తర్కం ఇది. ఇక్కడ నేటి భారత దేశంలో ఉపయోగిత ప్రధానమైన మార్కెట్ తర్కంతో మనం ఆత్మ నిర్భరత సాధించాలి అంటున్నాం. ఈ ఆత్మ నిర్భరత శిఖరాన్ని చేరుకోవాలంటే ఒక్కో అంచె ఎక్కడానికి మనం చాలా ప్రయాస పడాలి. ఒకవేళ ఆ అంచెను ఎక్కడంలో విఫలం అయితే దానికి వ్యక్తుల అసమర్థత మాత్రమే కారణం (దానికి వ్యవస్థా గత కారణాలు ఉండవు). ఎవరి విజయానికి వారే బాధ్యులు అని గుర్తు పెట్టుకోవాలి. ఈ రకమైన చట్రం నుండి చూస్తే ఇక్కడ భద్రత అన్నది ప్రధాన విలువ అని తెలుస్తుంది. స్వేచ్ఛ అనే దానికి ఇక్కడ చోటు లేదు. వ్యక్తుల సముదాయాలు తమ తమ వ్యక్తిగత బాధ్యతా యుత ప్రయత్నాల ద్వారా మాత్రమే భద్రతను సాధించుకోవాలి. నిర్భయస్థితికి చేరుకోవాలి! మొత్తంగా వ్యక్తిగత భద్రత లేక నిర్భ యత్వం సాధించాలంటే స్వేచ్ఛను పక్కకు పెట్టి బాధ్యతగా పనిచేయ డమే దిక్కు అనేది ఈ తర్కం చెప్పుతున్న విషయం. మన దేశంలో ఈ రకంగా మతమూ, మార్కెట్టూ రెండూ వ్యక్తి బాధ్యతకు అధిక ప్రాధా న్యతని ఇస్తూ ఉన్నాయి. అట్లా వాటి నడుమ భావనాత్మక ఐక్యత కుదిరింది. గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న ప్రైవేటీకరణా, నయా ఉదరవాద ఆర్థిక సంస్కరణలూ, వాటి ఫలితాల వల్ల... స్వాతంత్య్రం తరువాత కాలంలో దేశంలో ప్రజలందరూ నిలబడిన జాతీయ విలువల సాధికారత నశించి పోయింది. ఇప్పుడు సంక్షేమం అంటే బుజ్జగింపో, లేక దానం పొందే అనుచరులను తయారు చేసుకునే వ్యవహారంగానో మారిపోయింది. హింసాత్మక నిరాకరణకు గురి కావడమో లేక పూర్తి విశ్వాస పూరిత విధేయత ప్రదర్శించడమో అనేవి మాత్రమే ఇప్పుడు సంక్షేమాన్ని ఆశించే వారి ముందున్న రెండు దారులుగా మారిపోయిన దుఃస్థితి ఉన్నది. అధికారానికి పూర్తిగా విధేయులుగా ఉన్నాం అని చెప్పుకునే దానికి ప్రమాణంగా ‘పరాయి వారు’గా ముద్రితమైన ముస్లింలను దూరం పెట్టాలి అనే ఒత్తిడి ఎల్లెడలా ఉంది ఇప్పుడు. ఈ నిరాకరణ– విధేయత చట్రానికి బయట ఉండే వారు పూర్తిగా ఒంటరులు. అదృష్టం, అరకొర అవకాశాల కోసం ఎదురు చూసే నిస్సహాయులు! ఇదీ ఈ దేశంలో ప్రస్తుతం విపరీతంగా ఊపులో ఉన్న హిందూ ఏకీకరణకు అందుతున్న మద్దతుకు వెనుక ఉన్న వాస్తవం. పెచ్చు పెరిగిపోతున్న వ్యక్తివాదం పక్కనే ఈ హిందూత్వ సాముదాయిక ఏకీకరణ కూడా జరుగుతోంది. ఇది ఒక విషాద వైపరీత్యం. వాస్తవానికి ఇది మతాన్ని సాయుధంగా మార్చి మార్కెట్ విస్తరణను నిరంతరాయంగా కొనసాగించే వ్యవహారం. ఇప్పుడు మన దేశంలో రాజ్య యంత్రానికి ఈ వ్యవస్థీకృత దుర్మార్గాన్ని, చట్టబద్ధ పాలన నుండి తప్పించే కొత్త బాధ్యత ఏర్పడింది. చట్టం అమలును పక్కన పెట్టివేయడం ఇప్పుడు నిత్య కృత్యం అయిపోయింది. ఢిల్లీ మత కల్లోలాల సందర్భంలో తప్పుడు కేసులు పెట్టడం, జహాంగీర్ పురిలో కూల్చివేతలు... ఈ నూతన రాజ్య ప్రవర్తనకు ఉదాహరణలు. చట్ట బద్ధ పాలన అనేది మెజారిటీ ప్రజల భద్రతకు అవరోధం అనే భావం బాగా ప్రచారం అవుతున్నది. చట్టబద్ధ పాలన, రాజ్యాంగ బద్ధ ప్రవర్తన అనే మాటలకు – ‘మైనారిటీలను బుజ్జగించడం’ అనే విపరీ తార్థాలు తీస్తున్నారు. మన నడుమ ఇప్పుడు మతంగా ఉన్నది సామాజిక జీవితాన్ని మొత్తంగా నయా ఉదారవాద మార్కెట్‌కు అనుకూలంగా మార్చే ప్రక్రియకి పనికి వచ్చే పెద్ద పనిముట్టు మాత్రమే. వ్యక్తివాదం, హద్దూ అదుపూ లేని ప్రైవేటు లాభాపేక్షను పెంచే నయా ఉదార వాద మార్కెట్ అనే నేలలో ఈనాటి మతోన్మాద మూలాలు ఉన్నాయన్నది గమనించాల్సిన వాస్తవం. పండుగలు ఇప్పుడు ఉత్సాహాన్నీ, ఆనం దాన్నీ పంచుకునే సందర్భాలు కావు. అవి హింసాత్మక శక్తి ప్రదర్శన లుగా మారిపోయాయి. ఈ దుర్భర పరిస్థితిని ఎదుర్కోవడానికి మన దేశంలో అంతర్గతంగా చాలా ప్రయత్నాలు జరగాలి. బయటి నుండి వచ్చి ఎవరూ మనలను కాపాడే స్థితి లేదు. తక్కువలో తక్కువ ప్రయ త్నంగా, ముందుగా ఎట్టి పరిస్థితిలోనూ హింసకు ఆమోదం తెలప కుండా, మెజారిటీ ప్రజలకు ఉన్న అభద్రత ఏమిటి? దాని కారకాలు ఏమిటి? అన్న అంశాలను పట్టించుకోవాలి. మీ మంచికీ, చెడుకూ మీరే కారణం అని చెప్పే మార్కెట్ ఆధారిత స్వచ్ఛందతా ఉప దేశాలను వెనక్కు నెట్టేసి... నియమ బద్ధమూ, వ్యవస్థీకృతమూ అయిన సంక్షేమాన్ని ముందుకు తేవాలి. విషపూరిత మత వాదానికి... మెజారిటీ, మైనారిటీ మతçస్థులు ఎవరు పాల్పడినా ఎటువంటి మిన హాయింపు ఇవ్వకుండా దాన్ని ఎండగట్టి, తీవ్ర విమర్శకు నిలపడం ఇప్పుడు జరగాలి. దేశంలో నిండి పోతున్న విషాలకు ఇప్పుడు విరుగుడు కావాలి. అది దేశం లోపటినుండే రావాల్సి ఉంది. వ్యాసకర్త: ప్రొ‘‘ అజయ్ గుడవర్తి ఢిల్లీ జేఎన్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్ -
ప్రార్థనా మందిరాలు కూల్చారు... బాబుకు బుద్ది చెబుదాం
సాక్షి, అమరావతి : అధికారం అండతో ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పేట్రేగి పోయిందని.. హిందూ, ముస్లిం, క్రైస్తవుల మనోభావాలని దెబ్బతీస్తూ వారి ప్రార్థనా మందిరాలను అడ్డగోలుగా కూల్చివేసిందని పలువురు మతగురువులు ఆరోపించారు. ఇప్పుడు ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు సిద్ధమైందని.. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే తరుణం వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల మంచిచెడుల గురించి ఆలోచించే పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలో సోమవారం ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యోగాగురు బాబా పాండురంగం, కపాలానంద స్వామి, బిషప్ కాటూరి ప్రభుదాస్, ముస్లిం మత గురువులు అబ్దుల్ కరీమ్ రిజ్వీ, సయ్యద్ ఖలీల్ అహ్మద్ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యంగబద్ధంగా అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తూ పరిపాలన చేయాల్సిన టీడీపీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా హిందూ, ముస్లిం, క్రైస్తవుల పట్ల లెక్కలేనితనాన్ని, చులకన భావాన్ని ప్రదర్శించిందని ఆరోపించారు. ముఖ్యంగా విజయవాడలో పుష్కరాల పేరిట 43 దేవాలయాలు కూల్చివేసిందని పేర్కొన్నారు. దీని వెనుక విజయవాడ టీడీపీ ఎంపీ కేశినాని శ్రీనివాస్ (నాని) హస్తం ఉందన్నారు. అలాగే పవిత్ర ముస్లిం దర్గాపై దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టవద్దన్నా ఎంపీ నాని ఒత్తిడితో దాన్ని పూర్తి చేస్తున్నారని తెలిపారు. అలాగే బీఆర్టీఎస్ రోడ్డులోని ఓ చర్చిని కూలగొట్టి.. కనీసం మరోచోట నిర్మించడానికి ముందుకురాలేదని వివరించారు. ఇలా అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ తీరును తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. పైగా ఇన్నేళ్లు బీజేపీతో అంటకాగి బయటకొచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికలొచ్చేసరికి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో పొత్తు ఉన్నట్లు ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. టీడీపీ కుట్రలను అన్నివర్గాలవారు గమనించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేసే పార్టీకి ఓటు వేయాలని మత గురువులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మసీదులు, దర్గాలనుకూల్చే వారికి ఓటు వేయొద్దు మసీదులు, దర్గాలను కూల్చే వారికి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఓటు వేయకపోయినా నష్టమే జరుగుతుంది కాబట్టి కచ్చితంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడేవారిని ఎన్నుకోండి. – అబ్దుల్ కరీమ్ రిజ్వీ, ముస్లిం మతగురువు కేశినేని కో హఠావో.. బెజవాడ కో బచావో! రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోసం విజయవాడ ఎంపీ కేశినేని నాని దేవాలయాలను కూలగొట్టించారు. ఇలాంటి వారికి పతనం తప్పదు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయి కాబట్టి మళ్లీ కుటిల రాజకీయాలకు యత్నిస్తున్నారు. మా మనోభావలను దెబ్బతీసిన వారిని మేము ఎన్నటికీ మర్చిపోలేదు. రాజధాని ప్రాంతం విజయవాడలో అన్నివర్గాలు ప్రశాంతంగా జీవించాలన్నా.. బెజవాడను రక్షించాలన్నా.. ఈ ఎన్నికల్లో ‘కేశినేని కో హఠావో.. బెజవాడ కో బచావో’ అనే నినాదంతో ప్రజలు ఓట్లు వేయాలి. – బాబా పాండురంగం, యోగ గురు దశాదిశ కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి... క్రైస్తవులు, ముస్లింలు, హిందువులకు నష్టం కలిగించిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఎన్నికల సమయంలో మొసలికన్నీరు కారుస్తూ మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారు. విజయవాడలో బీఆర్టీఎస్ రహదారిలోని ఓ చర్చిని పాలకులు అన్యాయంగా కూల్చివేశారు. దానిని మరో చోట నిర్మించాలని కోరినా మొండివైఖరి చూపారు. అధికారపార్టీ నాయకుడెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి బాధ్యత కలిగిన, నిర్దిష్టమైన ఆలోచనలు కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. – కాటూరి ప్రభుదాస్ యాదవ్, బిషప్ ఏడు కొండలు, కనకదుర్గను రక్షించేవారికే ఓటు వేయండి త్రిపురలో ఉండే నేను ఇక్కడకు వచ్చి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే తెలుగు కూడా నేర్చుకున్నా. నాలుగు నెలల కిందట విజయవాడకు వచ్చి వెళ్లాను. ఈ రాష్ట్రంలో మనందరికీ తెలిసినవాడు ఏడు కొండలవాడు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. పైగా అర్చకులకు అరకొర వేతనాలు ఇస్తున్నారు. కొందరికీ అసలే లేవు. ఏడు కొండలస్వామిని, కనకదుర్గను రక్షించే వారికే ఓటు వేయాలి. – కపాలనంద స్వామి, హిందూ మతగురువు టీడీపీ అరాచకాలను ముస్లింలు మర్చిపోరు విభజన తర్వాత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును ప్రజలు గద్దెనెక్కించారు. ఈ ఐదేళ్లలో జరిగినన్ని అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలు మరెప్పుడూ జరగలేదు. పుష్కరాలను అడ్డుపెట్టుకుని దేవాలయాలు, మసీదులు, చర్చిలను కూలగొట్టారు. రామవరప్పాడులో ముస్లింల దర్గాను కూల్చివేశారు. ఆ ఘటనను ముస్లింలు ఎవ్వరూ మర్చిపోలేరు. – సయ్యద్ ఖలీల్ అహ్మద్ రిజ్వీ, ముస్లిం మతగురువు -
మానవత్వాన్ని, ప్రేమను ఎవరైనా తృణీకరించగలరా?
భగవంతుడే ఈ నిరుపేద రూపంలో వచ్చినట్లు స్వామీజీ భావించారు. అతడి వంక చూస్తూ ఆయన, ‘‘తినడానికి ఏమైనా ఇవ్వగలవా?’’ అని అడిగారు. అది రాజస్థాన్‌లోని రైలు నిలయం. స్వామి వివేకానంద అక్కడ బస చేసి ఉన్నారు. పగలంతా జనం తీర్థప్రజలా ఆయన దర్శనార్థం వచ్చిపోతూనే ఉన్నారు. మతం, ధార్మికత వంటి అంశాలపై అడిగిన సందేహాలన్నింటికీ అనర్గళంగా సమాధానాలు చెబుతూనే ఉన్నారు. ఈ విధంగా మూడు పగళ్లు, మూడు రాత్రుళ్లు గడిచాయి. ధార్మిక ప్రబోధంలో స్వామీజీ ఎంతగా లీనమైపోయారంటే, ఆహారం స్వీకరించడానికి కూడా ఆయన ప్రబోధాన్ని ఆపింది లేదు. ఆయన చుట్టూ గుమికూడిన జనాలకు తినడానికి ఏమైనా ఆహారం ఉందా అని ఆయనను అడగాలని కూడా స్ఫురించలేదు. మూడవరోజు రాత్రి సందర్శకులందరూ వెళ్లిపోయాక ఒక నిరుపేద వ్యక్తి ఆయనను సమీపించి అభిమానపర్వకంగా ‘‘స్వామీజీ! ఈ మూడురోజుల నుంచీ మీరు నిర్విరామంగా మాట్లాడుతూనే ఉన్నారు. గుక్కెడు నీళ్లు కూడా తాగింది లేదు. అది చూసి నేను ఎంతో బాధపడుతున్నాను’’ అన్నాడు అభిమాన పూర్వకంగా. భగవంతుడే ఈ నిరుపేద రూపంలో వచ్చినట్లు స్వామీజీ భావించారు. అతడి వంక చూస్తూ ఆయన, ‘‘తినడానికి ఏమైనా ఇవ్వగలవా?’’ అని అడిగారు. అతడు ‘‘స్వామీజీ, మీకు చపాతీలు ఇవ్వాలని నా హృదయం పరితపిస్తోంది. కాని ఎలా ఇవ్వగలను? నేను వాటిని తాకాను. మీరు అనుమతి ఇస్తే పిండి, పప్పు తెచ్చిపెడతాను. మీరు స్వయంగా వండుకోవచ్చు’’ అని చెప్పాడు. అందుకు స్వామీజీ, ‘‘లేదు నాయనా, నువ్వు వండిన చపాతీలనే తెచ్చి నాకు ఇవ్వు. సంతోషంగా వాటిని తింటాను’’ అన్నారు. ఆ మాట విని అతడు భయంతో వణికిపోయాడు. చర్మకారుడైన తాను ఒక సన్న్యాసికి చపాతీలు ఇచ్చాననే సంగతి మహారాజు చెవిన పడితే పరిణామాలు దారుణంగా ఉంటాయని భీతి చెందాడు. కాని స్వామీజీ ఆకలి తీర్చాలనే తపన అతడి భయాన్ని దిగమింగింది. వెంటనే ఇంటికి వెళ్లి తాజాగా చపాతీలు వండి తెచ్చి స్వామీజీకి ఇచ్చాడు. నిరుపేదవాడి నిస్వార్థ ప్రేమాభిమానాలను చూసి స్వామీజీ కళ్లు చెమ్మగిల్లాయి. – డి.వి.ఆర్ -
పార్టీలోవారికి ప్రవేశం లేదు
చెన్నై: తమ పార్టీలోకి కుల, మత సంస్థల నేతలకు ప్రవేశం ఉండబోదని తమిళ స్టార్ రజనీకాంత్ నెలకొల్పిన ‘రజనీ మక్కల్ మండ్రం’ స్పష్టం చేసింది. నిబంధనలతో కూడిన 36 పేజీల కరపత్రాన్ని ఆ పార్టీలోని వివిధ విభాగాలకు అందజేసింది. దీని ప్రకారం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు, చెడు అలవాట్లకు బానిసలైన వారికి పార్టీలోకి ప్రవేశం ఉండదు. సంస్థాగత నిర్మాణం, ప్రవర్తనావళి, వివిధ విభాగాల్లో చేరికలకు సంబంధించిన అంశాలపైనా ఇందులో వివరణ ఉంది. రజనీకాంత్ ‘రజనీ మక్కల్ మండ్రం’ ఏర్పాటు చేసి, వివిధ స్థాయిల్లో పార్టీ ఆఫీస్ బేరర్లను నియమించుకుని, సంస్థాగత నిర్మాణ పనుల్లో ఉన్నారు. త్వరలోనే పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. -
‘యోగా చేస్తే మతం నుంచి బహిష్కరించారు’
మాచారెడ్డి: యోగా చేసినందుకు తనను మతం నుంచి బహిష్కరించారని కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన షహనాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. యోగా డే సందర్భంగా మండల కేంద్రంలోని ఓం శాంతి కేంద్రంలో యోగా చేశానని, పలువురు ముస్లిం యువకులు తనపై దాడి చేసి మతం నుంచి బహిష్కరించారని వాపోయారు. ఆరోగ్యం కోసం యోగా చేయడం తప్పెలా అవుతుం దని ఆమె ప్రశ్నించారు. తన మీద దాడి చేసినప్పుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసి పరువు తీశారన్నారు. తనతో ఎవరు మాట్లాడినా రూ. 5 వేల జరిమానా విధిస్తామని బెదిరించడంతో ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదుకు చందా ఇవ్వడానికి వెళ్తే తీసుకోవడం లేదని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్న ఆమె..తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. -
విశ్వాసముంటే.. నాలుగేళ్ల అధికాయుష్షు!
దైవాన్ని, మతాన్ని నమ్మేవారు ఇతరుల కంటే నాలుగేళ్లు ఎక్కువ బతికేందుకు అవకాశముంది అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలో ఇటీవల ఒక అధ్యయనం జరిపి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని లారా వాలెస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సాధారణంగా మతాన్ని నమ్మిన వాళ్లు ధార్మిక కార్యక్రమాలు లేదంటే సామాజిక కార్యకలాపాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉంటారని.. ఇలాంటి వారు ఇతరుల కంటే ఎక్కువ కాలం బతుకుతారని గతంలోనే అనేక పరిశోధనలు స్పష్టం చేశాయని లారా అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము మతాల వివరాలను సేకరించేందుకు సంస్మరణ సభలను ప్రాతిపదికగా తీసుకున్నామని, కుటుంబ సభ్యులు, మిత్రులు చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. మరణించిన వ్యక్తి స్త్రీయా, పురుషుడా? వివాహమైందా? లేదా? అన్నవీ గమనించి పరిశీలించినప్పుడు మతాన్ని నమ్మినవారు దాదాపు 6.48 ఏళ్లు ఎక్కువ జీవించేందుకు అవకాశముందన్న అంచనాకు వచ్చామని వివరించారు. అమెరికాలోని మొత్తం 43 ప్రధాన నగరాల్లోని 1096 మందిపై జరిగిన రెండో అధ్యయనంలో ఇది 5.64 ఏళ్లుగా ఉన్నట్లు స్పష్టమైందని, మొత్తమ్మీద చూస్తే మతవిశ్వాసాలు కలిగి ఉండటం.. ధార్మిక, సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం నాలుగేళ్ల ఆయుష్షునిస్తుందని తెలుస్తోందని లారా చెప్పారు. -
కన్నడ బరిలో మఠాధిపతులు...!
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటకలో పలువురు మఠాధిపతులు ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కాషాయాంబరధారులైన ఈ మఠాధిపతులు ఇంత పెద్ద సంఖ్యలో పోటీ చేసేందుకు సమాయత్తం కావడం ఆ రాష్ట్రంలో ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. బ్రాహ్మణేతర గోరఖ్‌నాథ్ మఠం అధిపతిగా ఉన్న యోగి ఆదిత్యానాథ్ తొలుత ఎంపీగా ఆ తర్వాతి ఉత్తరప్రదేశ్ సీఎంగా కీలక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరంతా కూడా ఆయననే ఆదర్శంగా తీసుకుని ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. వచ్చే నెల 12న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీకి నలుగురు మఠాధిపతులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆయన పనితీరును వారు ప్రశంసిస్తున్నారు. వీరంతా కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని నలుగురు మంత్రులపై పోటీకి సై అంటున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అంతకు ముందు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పలు మఠాలను సందర్శించారు. ఈ సందర్భంగానే వివిధ మఠాధిపతులను తమ పార్టీ పక్షాన పోటీ చేయించేందుకు బీజేపీ నాయకులు సిద్ధపడుతున్నట్టు వార్తలొచ్చాయి. ఎవరీ మఠాధిపతులు..? ఎన్నికల రంగంలోకి దిగేందుకు ఉత్సాహాన్ని చూపుతున్న వారిలో ఉడుపిలోని ఓ మఠానికి చెందిన లక్ష్మీవార తీర్థస్వామి, ధార్వాడ్ మఠానికి చెందిన బసవానంద స్వామి, చిత్రదుర్గలోని మఠానికి చెందిన మదర చెన్నయ్యస్వామి, దక్షిణ కన్నడలోని ఓ మఠానికి చెందిన రాజశేఖరానంద స్వామి ఉన్నారు. వీరిలో శ్రీ గురు బసవ మహామనే మఠాధిపతి బసవానంద స్వామికి దృష్టిలోపముంది. లింగాయత్ మఠానికి చెందిన బసవానంద కాలాఘటగి నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర కార్మికమంత్రి, మైనింగ్ అధిపతి సంతోష్‌లాడ్‌పై పోటీకి సిద్ధమంటున్నారు. 2013లోనే ఆయన బీజేపీలో చేరిన హాసన్ లోక్‌సభ నుంచి మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హేచ్‌డీ దేవెగౌడపై పోటీ చేయాలని కోరుకున్నారు. అయితే పార్టీ ఆయనకు టికెటివ్వలేదు. ఉడుపి మఠాలు ఎనిమిదింటిలో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న షిరూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మీవర తీర్థస్వామి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పక్షంలో ఈ మఠాల నుంచి పోటీ చేసిన తొలివ్యక్తిగా నిలుస్తారు. అయితే ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆయన నిర్ణయం పట్ల సీనియర్ మఠాధిపతి విశ్వేష తీర్థస్వామి మొదలుకుని ఇతర మఠాధిపతులు అసంతృప్తితో ఉన్నారు. మత్స్యశాఖ మంత్రి ప్రమోద్ మధ్వరాజ్పై పోటీ చేయాలని లక్ష్మీవర తీర్థస్వామి భావిస్తున్నారు. వివాదస్పద ప్రసంగాలకు ప్రసిద్దుడైన మంగళూరుకు సమీపంలోని వజ్రదేహి మఠానికి చెందిన రాజశేఖరానంద స్వామి భజరంగ్‌దళ్, వీహేచ్‌పీ, ఇతర మితవాద గ్రూపులతో సంబంధాలున్నాయి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అటవీశాఖ మంత్రిగా ఉన్న రామనాథ్ రాయ్‌పై పోటీ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. చిత్రదుర్గ జిల్లాలోని శ్రీశివ శరణ మదర గురు పీఠానికి చెందిన మదర చెన్నయ్య స్వామి బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఒకరనే ప్రచారం జరుగుతోంది. దళిత వర్గంలో మంచి ఆదరణ ఉన్న ఆయనకు మాజీ సీఎం యెడ్యూరప్ప, సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్పల సన్నిహితుడిగా పేరుంది. ఎన్నికల్లో పోటీకి సంబంధించి చెన్నయ్యస్వామి బహిరంగ ప్రకటనేది చేయలేదు. ఇటీవల ఈ మఠాన్ని అమిత్ షా సందర్శించడంతో హోలాల్ఖేరే రిజర్వ్ స్థానం నుంచి ఆయన పోటీ చేయవవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానానికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి హెచ్. ఆంజనేయ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనితో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ చెన్నయ్యస్వామిని బీజేపీ బరిలోకి దింపవచ్చుననే వార్తలొచ్చాయి. ఈ జాబితాలో మరికొందరు... ఈ నలుగురు మఠాధిపతుల పేర్లతో పాటు మరికొందరు కూడా జేడీ(ఎస్) తరఫున లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచనతో ఇటీవలే పరమానంద రామరుధస్వామి జెడీ (ఎస్) పార్టీలో చేరారు. బాగల్కోట్ జిల్లాలోని బిలాగి నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. కల్బుర్ఘి జిల్లాలోని జేవార్గి నుంచి పోటీకి అందోలలోని కరుణేశ్వర మఠాధిపతి, శ్రీరామ్‌సేన అధ్యక్షుడు సిద్ధలింగ స్వామి ప్రణాళికలు సిద్ధం చేశారు. సామాజికసేవకే జీవితాన్ని అంకితం చేసిన ఫాదర్ జాకబ్ పల్లిపురతి 1983లో కల్ఘట్గి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. అయితే కర్ణాటకలో మతపెద్దలు, మఠాధిపతులుగా ఉన్నవారు ఎన్నికల్లో గెలిచిన ఉదంతాలు చాలా తక్కువే. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రధాని మోదీ ఫొటో పెట్టం!
డెహ్రాడూన్ : ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డెహ్రాడూన్ మదర్సా కమిటీ తిరస్కరించింది. మతపరమైన కారణాలవల్ల మదర్సా ప్రాంగణంలో మోదీ ఫొటో పెట్టేది లేదని మదర్సా బోర్డు శుక్రవారం స్పష్టం చేసింది. ముస్లిం విద్యాసంస్థలైన మదర్సాలు.. ప్రభుత్వ పర్యవేక్షణ, మార్గదర్శకంలో పనిచేయడం లేదని ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ (యూఎంఈబీ) తేల్చిచెప్పింది. మదర్సా ప్రాంగణంలో ఎటువంటి వ్యక్తుల ఫొటోలు, ఛాయాచిత్రపటాలను పెట్టేందుకు ఇస్లాం సంప్రదాయం అంగీకరించదని బోర్డు తెలిపింది. మత సంప్రదాయం ప్రకారం.. మోదీ ఫొటో సహా ఎవరి ఫొటోను మదర్సాలోకి అనుమతించమని బోర్డు పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు వల్ల విద్యావ్యవస్థకు కూడా మతం రంగు పులముకుంటుందని ఒక మదర్సా టీచర్ అన్నారు. ఇదిలావుండగా.. 2017 స్వతంత్ర దినోత్సం సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని మదర్సాల్లోనూ ప్రధాని ఫొటోను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
మోదీది హిందూ అజెండా!?
సాక్షి, శ్రీనగర్ : దేశంలోకి ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను అనుమతించకపోవడంపై హురియత్ కాన్ఫెరెన్స్ ఛైర్మాన్ మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని మతరాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ట్విటర్ వేదికగా హురియత్ నేత కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు చాలా కాలంగా ఇస్లామింగ్ బ్యాంకింగ్ కోసం డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇస్లామ్ చట్టాల ప్రకారం విధులు నిర్వహించే ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల జమ్మూ కశ్మీర్ ప్రజల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. -
దేవతా విగ్రహాలు కూడా అక్కడి నుంచే..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయుల్లో జాతీయ భావం పెరిగింది. ఫలితంగా దేశంలో ఉన్న 82 శాతం హిందూ మత విశ్వాసకుల్లో దైవ చింతన కూడా పెరిగి దేవతా విగ్రహాల కొనుగోళ్లు కూడా పెరిగిందట. ఏ పట్టణంలో, ఏ బజారుకెళ్లిన మనకు నచ్చే దేవతా విగ్రహాలు ఇట్టే దొరుకుతున్నాయి. అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయో మనకు తెలియదు. దుకాణదారుడికి కూడా తెలియకపోవచ్చు, తెలిసినా చెప్పడు. ఎందుకంటే అవన్ని కూడా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయట. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల విగ్రహాలను చైనా మార్కెట్ భారత్‌లో విక్రయించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వచ్చీరాగానే ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని తీసుకొచ్చారు. దానికి విస్తత ప్రచారాన్ని కల్పించారు. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో విస్తతంగా ప్రచారం జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే చైనా వస్తువులు దేశీయంకన్నా చౌకవడమే. డబ్బుల దగ్గరకి వచ్చేసరకల్లా భారతీయులు జాతీయ భావాన్ని పక్కన పడేస్తున్నారు. ఒక్క 2016 సంవత్సరంలోనే భారత్ నుంచి చైనాకు 26,400 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరగ్గా, చైనా నుంచి భారత్‌కు 2,09,800 కోట్ల రూపాయల దిగుమతులు జరిగాయి. భారత్, చైనా మధ్య కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కూడా చైనాకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. చైనా, భారత్‌ల మధ్య ఎగుమతి, దిగుమతుల నిష్పత్తి రేషియో 6–1గా ఉంది. చైనా వస్తువులు చౌకవడానికి చాలా కారణాలున్నాయి. కారణాలు..... 1. ఏ వస్తువులనైనా చైనా భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఓ భారతీయ ఉత్పత్తిదారుడి వద్ద మూడు ప్లాస్టిక్ ఇంజెక్షన్ మౌల్డింగ్ యంత్రాలుంటే చైనా ప్రత్యర్థి వద్ద 70 ఉంటాయి. ఎక్కువ యూనిట్లు ఉండి, ఎక్కువ ఉత్పత్తి చేస్తే ధర తగ్గుతుందని తెల్సిందే. 2. మ్యాక్ కిన్సే రిపోర్టు ప్రకారం భారతీయ కార్మికులతో పోలిస్తే చైనా కార్మికుల ఉత్పాదన రేటు నాలుగు నుంచి ఐదింతలు ఎక్కువ. భారత కార్మికులకన్నా జీతాలు ఎక్కువ తీసుకున్నప్పటికీ చైనా కార్మికులు జీతంతో పోల్చినా భారతీయులకన్నా ఎక్కువ పనిచేస్తారు. భారతీయ కంపెనీల్లో అత్యాధునిక యంత్రాలు లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం, సప్లై చైన్‌ను సరిగ్గా లేకపోవడం తదితర కారణాలే కాకుండా 99 మంది కార్మికుల సంఖ్యను మించకుండా ఉండేందుకు ప్యాక్టరీ సామర్థ్యాన్ని పరిమితం చేయడం. వందా, ఆపైనా కార్మికులన్న కంపెనీకి 1947 నాటి పారిశ్రామిక వివాదాల చట్టం వర్తించడమే అందుకు కారణం. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కంపెనీలు నష్టాలు వచ్చినా ప్రభుత్వం అనుమతి లేకుండా కంపెనీని మూయరాదు, ఓ ఉద్యోగిని తీసేయరాదు. ఇలాంటి ఇబ్బందులు చైనా కంపెనీలకు లేవు. 3. అవినీతి ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 176 దేశాల జాబితాలో భారత్–చైనా దేశాలు రెండూ కూడా 79వ స్థానాన్ని ఆక్రమించాయి. చైనాలో ఉన్నత స్థాయిలో అప్పుడప్పుడు మాత్రమే అవినీతి జరుగుతుండగా, భారత్‌లో కిందిస్థాయిలో తరచూ జరుగుతుందీ. ఫలింగా ఉత్పత్తిపై చైనా అవినీతి ప్రభావం పెద్దగా ఉండడం లేదు. భారత్‌లో ఎక్కువగా ఉంటోంది. 4. కార్మికుల సమ్మెలు కూడా కారణమే భారత దేశంలో దాదాపు 16 వేల బలమైన కార్మిక సంఘాలు ఉన్నాయి. ఇవి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. కనుక సమ్మెలు, ఆందోళనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సమ్మెలను నియంత్రించేందుకు కార్మిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తానని నరేంద్ర మోదీ ప్రకటించారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశంలో సమ్మెల వల్ల ఏటా 2.30 కోట్ల మంది పని దినాల నష్టం జరుగుతోంది. చైనాలో అఖిల చైనా కార్మిక సంఘాల సమాఖ్య అనే ఏకైక కార్మిక సంఘం ఉంది. అది కూడా ప్రభుత్వం నియంత్రణలోనే ఉంటుంది. 5. విద్యుత్ అంతరాయం భారత్‌లో విద్యుత్ చార్జీలు ఎక్కువవడమే కాకుండా సరఫరాలో కూడా అంతరాయం ఎక్కువగా ఉంటుంది. పరిశ్రమలకు సరఫరాలో కోత కూడా విధిస్తారు. ఈ పరిస్థితి చైనాలో లేదు. పైగా భారత్‌తో పోలిస్తే చైనాలో రవాణా చార్జీలు కూడా చవకా. 6. స్థలం దొరకడం చాలా కష్టం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు స్థలం దొరకడం భారత్‌లో చాలా కష్టం. ఇరుదేశాల జనాభా దాదాపు ఒకే స్థాయిలో ఉన్న భారత భూభాగం చైనా భూభాగంలో మూడోవంతు ఉంది. కొత్త పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో కూడా భారత్‌లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. బ్యూరోక్రసి ఎక్కువ. 7. ఎగుమతులకు ప్రోత్సాహం చైనా ప్రభుత్వం తమ దేశం నుంచి ఎగుమతులను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అందుకు కారణం 45 శాతం ఉత్పత్తులు ప్రభుత్వరంగానివే కావడం. భారత్‌లో దేశీయ సరకులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, వాటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. -
మతపరమైన రిజర్వేషన్లు తగదు: బీజేపీ ధర్నా
హన్మకొండ: మతపరమైన రిజర్వేషన్ల నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలో ధర్నా చేపట్టారు. ఓటు బ్యాంకు కోసమే కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్ల అంశాన్ని తలకెత్తుకుందని విమర్శించారు. ఇప్పటికే 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను కోర్టు కొట్టివేసిందని, ఇపుడు 12 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాలో పార్టీ అర్బన్ శాఖ అధ్యక్షురాలు రావు పద్మ,, అమరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరావులు, మార్తినేని ధర్మారావు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. -
రాజధర్మం తప్పుతూనే ఉంటారా?
చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. బీజేపీ వంటి పార్టీలు అధికా రంలో ఉంటే చరిత్ర మరింత వేగంగా పునరావృతం అవుతుంది. గుజరాత్ లోని గోధ్రాలో 2002లో జరిగిన మత ఘర్షణల్లో ముస్లిం మైనారిటీలు ఊచ కోతకు గురైనప్పుడు దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తమ పార్టీకే చెందిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని ‘రాజధర్మం పాటించు’ అని సూచించారు. ‘జరిగిన దారుణానికి నీ ఉదాసీనతే కారణం సుమా!’ అని అటల్జీ మోదీని పరోక్షంగా హెచ్చరించారన్నది నిష్ఠుర సత్యం. ఇప్పుడు నరేంద్రమోదీ... భారతదేశ ప్రధాని. ఆయన ‘రాజధర్మం’ తప్పుతున్నా హెచ్చరించేందుకు బీజేపీలో ‘అటల్ బిహారీ వాజ్‌పేయి’ వంటి రాజనీతిజ్ఞులు కనిపించడం లేదు. పైగా, మోదీయే ప్రతిపక్షాల అసహనానికి బలిపశువు అవుతున్నారంటూ... వింతవాదన లేవనెత్తే వెంకయ్యనాయుడు వంటి మాట కారి నాయకులు ప్రధాని మోదీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ క్రమంలో ప్రతిపక్షాలను, రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను సైతం విమర్శిస్తు న్నారు. భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం గొప్పదనాన్ని, లౌకిక పునాదులపై నిర్మితమైన ప్రజాస్వామికవ్యవస్థ విలక్షణతను గుర్తుచేసే విధంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు చేస్తే... వాటిని స్వీకరించడానికి సిద్ధంగా లేని సంఘ్ పరివార్ మేధావులు ఆయనకూ రాజ కీయాలు ఆపాదిస్తున్నారు. మతపర అసహనంపై ఆత్మావలోకనం ఏది? దేశంలో స్పష్టంగా కనిపిస్తున్న మతపర అసహనం హఠాత్తుగా ఎక్కడనుంచో ఊడిపడలేదు. బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సాధ్వీలు, సాధువులు వివిధ సందర్భాల్లో చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే మొదలైంది. సామాజిక వేత్తలు దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యలు, అక్కడక్కడ రచయితల ముఖాలకు నల్లరంగు పూసిన సంఘటనలూ సమాజంలో భయాందోళనలు, అభద్రతాభావం పెంచాయి. ఈ పరిణామాల పట్ల కలత చెందిన ప్రముఖ రచయితలు, మేధావులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు... చివరకు వ్యాపార దిగ్గ జాలు సైతం పాలకపక్షం అనుసరిస్తున్న ‘మతపర అసహనం’ పట్ల నిరసన, ఆవేదన వ్యక్తం చేస్తుంటే జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామనే మాట బీజేపీ నేతల నుంచి రావడంలేదు. వారిలో ఆత్మావలోకనం ఏ కోశానా కనపడటం లేదు. ‘మతపర అసహనం’పై మాట్లాడే హక్కు అసలు కాంగ్రెస్ పార్టీకి లేదంటూ బీజేపీ అగ్రనేత ముప్పవరపు వెంకయ్యనాయుడు విమర్శిస్తున్నారు, జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పందించే నైతిక హక్కు లేదని కాసేపు అనుకొందాం. కాని, జరుగుతున్న దారుణాలపై ప్రధానమంత్రిగా మోదీ స్పందించాలి కదా? ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగిన వెంటనే... ప్రధాన మంత్రి ట్వీట్ క్షణాల్లో వచ్చేస్తుంది. అభినందనలు, ఖండనలు, విమర్శలు... ఒకటనే మిటి? సర్వం... మోదీ ట్వీట్ల పరంపరలు నిరంతరం వెలువడతాయని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ... దేశంలో దారుణ సంఘటనలు జరుగు తుంటే... ట్వీట్ చేయ డానికి కూడా ఆయనకు సమయం లేదు. తన పార్టీ సహచరులు చేస్తున్న విషపూరిత వ్యాఖ్యలు ఆయనకు వినిపించవు. రచ యితల ముఖాలకు నల్లరంగు పూస్తున్న వికృత సంఘటనలు ఆయన దృష్టికి సోకడం లేదు. కొందరు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే... ప్రస్తుతం దేశంలో నెలకొన్న మతపర అసహన వాతావరణం ఎవరి వల్ల ఏర్పడిందో తెలుస్తుంది. ‘‘మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ముస్లిం అయినప్పటికీ గొప్ప జాతీయవాది’’ అంటూ కేంద్ర మంత్రి రమేష్‌శర్మ చేసిన వ్యాఖ్య దేశంలో కలకలం సృష్టించింది. ఒక గొప్ప వ్యక్తిని దారుణంగా కించపర్చే వ్యాఖ్య అది. మరోవైపున ‘‘భారతదేశంలో ముస్లింలు జీవించాలంటే వారు గోమాంసం తినడం మానేయాలి’’ అని హరియాణా రాష్ట్ర బీజేపీ ముఖ్య మంత్రి మనోహర్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. ఏం తినాలో ఎవరు నిర్ణయించాలి! బీజేపీ నేతల భావజాల వైరుధ్యానికి ఓ చిన్న ఉదాహరణ. బిహార్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న నరేంద్రమోదీ, అమిత్‌షాలు తమ ప్రసంగాల్లో ‘స్వేచ్ఛ’ అనే పదాన్ని తరచుగా ఉపయోగించారు. ఎక్కడికెళ్లినా వారు ‘‘నితీష్, లాలూల మాయలో పడకండి... స్వేచ్ఛగా ఓటేయండి’’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ‘స్వేచ్ఛ’ను గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు మిగతా సమయాల్లో మాత్రం- ‘‘ప్రజలు ఏమి తినాలి? ఏమి కట్టుకోవాలి? ఏమి రాయాలో, ఎంత మంది పిల్లల్ని కనాలో’’ నిర్దేశిస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు. గోమాంసం తినేవారు అసలు హిందువులే కారంటూ హిందూ మతానికి నూతన భాష్యాలు చెప్పుకొస్తున్నారు. ‘బీఫ్’ తింటే తప్పులేదని చెప్పేవారు అసలు హిందువులే కారంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు స్వర్గీయ స్వామి రంగధానంద మాటలు గుర్తుతెచ్చుకోవాలి. ఆయన ఒక సందర్భంలో ‘ఎవరు హిందువు?’ అనే అంశంపై ఏమన్నారంటే ‘‘మీరు పుట్టుకతోనే హిందువు అయిపోరు. హిందువు కావాలంటే హిందూమతం ధర్మాల్ని ఆచరించాలి. హిందూమతం... సహనాన్ని బోధిస్తుంది. ఇతరుల పట్ల ప్రేమానురాగాల్ని చూపమంటుంది. ఇటువంటి విలువల్ని పాటిస్తేనే మిమ్మల్ని మీరు హిందు వుగా చెప్పుకోగలరు’’ అంటూ స్వామి రంగధానంద హిందూమతంలోని ఔన్నత్యాన్ని చెప్పారు. కాని... ఇప్పుడు బీజేపీలోని కొందరు హిందూమతం ఔన్నత్యాన్ని దెబ్బతీస్తూ... మరోపక్క తాము హిందూమత పరిరక్షకులుగా చిత్రీకరించుకొనే యత్నం చేస్తున్నారు. ఎన్డీయే పాలనలో కనిపిస్తున్న విద్వేషపూరిత వాతావరణం పట్ల కవులు, రచయితలు, కళాకారులు తమ నిరసనను వ్యక్తం చేస్తుంటే... ‘పరిస్థితి తీవ్రత’ను అర్థం చేసుకోకుండా వారందర్నీ కాంగ్రెస్ పార్టీ అనుకూల శక్తు లుగా, బీజేపీ వ్యతిరేక మూకలుగా పేర్కొంటున్నారు. ప్రముఖ రచయిత్రి నయనతార సెహగాల్ గొప్ప రచయిత్రి. సాహిత్య అకాడమీ అవార్డు విజేత. పండిట్ జవహర్లాల్ నెహ్రూకు మేనకోడలు. కన్నడ రచయిత కల్బుర్గీ హత్య తర్వాత... నయనతార తన నిరసన వ్యక్తం చేస్తూ... తాను పొందిన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగిచ్చేస్తున్నానంటూ ప్రకటించగానే ఆమెను కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరురాలంటూ బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. అయితే నయనతార సెహగాల్... ఎమర్జెన్సీని గట్టిగా వ్యతిరేకించి... శ్రీమతి ఇందిరా గాంధీని తీవ్రంగా విమర్శించిన విషయం బహుశా చాలామంది బీజేపీ నేతలకు తెలిసి ఉండకపోవచ్చు. నిరసన గళాల్లో రాజకీయ ఉద్దేశాలా? ఎన్డీయే పాలనపై మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు తెలియజేస్తున్న నిరసనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ‘‘తయారు చేయబడిన తిరుగు బాటు (మాన్యుఫాక్చర్డ్ రెబెల్లియన్)’’గా కొట్టిపారేస్తున్నారు. తిరుగుబాటు ఏ రూపంలో వ్యక్తం అయినా అది సహజసిద్ధంగా రావాల్సిందే తప్ప... తయారు చేస్తే నిలబడేది కాదని.. అరుణ్‌జైట్లీ వంటి మేధావికి తెలియదా? దేశంలో నెలకొన్న ఈ కలుషిత వాతావరణం ఆర్థిక రంగానికి చేటు కలిగి స్తుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ చేసిన హెచ్చరికల వెనుక ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, రాహుల్ బజాజ్, హర్ష గోయెంకా వంటి పారిశ్రామికవేత్తలు... దేశ ఆర్థిక రంగానికి ప్రస్తుతం నెలకొని ఉన్న పరిణామాలు చేటు కలిగిస్తాయంటూ ఆందోళన వ్యక్తపర్చడం స్వతహాగా చేసినవా? లేక వారి వెనుక ఎవరైనా ఉన్నారని అనుమానించ గలమా? చివరకు ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ సైతం... దేశం అభివృద్ధి పథంలోకి దూసుకొని వెళ్లాలంటే సామరస్య వాతావరణం అవసరం అని స్పష్టం చేశారు. పైనుంచి కిందిస్థాయి వరకు బీజేపీ నేతల్లో అసహనం గూడుకట్టుకొని పోయింది. ఇచ్చిన హామీలు ఆచర ణలో కనిపించకపోవడంతో వివిధవర్గాల ప్రజల నుండి ఎదురవుతున్న ప్రశ్న లకు సమాధానం చెప్పుకోలేని ఆత్మరక్షణలో బీజేపీ నేతలు పడిపోయారు. అందుకే ఈ అసహనం. తాజాగా విజయవాడలో ‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా’పై విద్యార్థి జేఏసీ నాయకులు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ప్పుడు వారిపై జరిగిన దాష్టీకం దారుణం. బీజేపీ నేతలు సృష్టిస్తున్న ఈ వికృత వాతావరణం తొలగిపోవాలంటే మరిన్ని చైతన్యవంతమైన గళాలు గట్టిగా వినిపించాల్సిందే. నిరసన వివిధ రూపాల్లో తెలియజెప్పాల్సిందే. -సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఎమ్మెల్సీ, ప్రతిపక్ష నేత, ఏపీ శాసనమండలి మొబైల్: 81063 15555 -
కలసి తిరిగారంటే ఖతమ్..
మోరల్ పోలీసింగ్... ఇటీవల ఈ మాట తరచుగా వినిపిస్తూనే ఉంది. యువకులు, ప్రేమ జంటలపై మోరల్ పోలీసింగ్ పేరుతో మత ఛాందస వాదులు దాడులు చేయడం సర్వసాధారణమైపోయింది. కొన్ని మత సంస్థలకు చెందిన ముఠాలు నవ్యనాగరికతపై కన్నెర్ర చేస్తూ దాడులకు తెగబడుతున్నాయి. రాజ్యాంగం వీరికి ఎటువంటి హక్కులూ కట్టబెట్టక పోయినా... మతోన్మాదానికి మోరల్ పోలీసింగ్ పేరు పెట్టి హింసాతక్మక చర్యలకు పాల్పడుతున్నా, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటున్నా పట్టించుకునే నాధుడే ఉండడు. మోరల్ పోలీసింగ్ అంటూ ఇటీవల మంగుళూరులో ఓ ముస్లిం వ్యక్తిని కరెంటు స్తంభానికి కట్టి చావబాదారు. హిందూ మహిళతో మాట్లాడటమే అతడి తప్పైంది. కర్నాటక కోస్తా తీర ప్రాంతంలో మత, మూఢవిశ్వాసాలకు ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే మంగుళూరుకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని ఓ కళాశాలనుంచి ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేయడం, వారు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడం వెనుక కూడ మత విశ్వాసాన్ని అతిక్రమించడమే కారణంగా కనిపిస్తుంది. నిజానికి మోరల్ పోలీసింగ్ మాటున మారుమూల గ్రామాల్లో జరుగుతున్న కొన్ని మతతత్వ దాడులు వెలుగులోకి కూడా రావడం లేదు. కొంతకాలం క్రితం కర్నాటకలోని మారుమూల ప్రాంతంలో జరిగిన మూడు ఘటనలను గమనిస్తే ఈ నిజం తెలుస్తుంది. మంగుళూరుకు దగ్గరలోని విట్టల్ గ్రామంలోముగ్గురు యువకులు 'ముఠా' కాలేజీ క్యాంపస్ లో యువతీ యువకులు మాట్లాడుకుంటుండగా వారిపై దాడి చేశారు. దీని వెనుక మతతత్వం కనిపిస్తుంది. వారిద్దరూ రెండు మతాలకు చెందినవారు కావడమే కారణం. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేయడంతో వాతావరణం సర్దుమణిగింది. అలాగే పుత్తూరులోని ఓ సినిమాహాలు వద్ద ముస్లిం యువతితో హిందూ యువకుడు మాట్లాడినందుకు జరిగిన ఘటన మోరల్ పోలీసింగ్ పేరిట మతతత్వ దాడులకు దారి తీసింది. కర్నాటక కోస్తా తీర ప్రాంతంలో ఈ దాడులు సర్వ సాధారణమైపోయాయి. వందలాది ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలన్నీ జరిగిన సమయంలో ఏదో స్థానిక వార్తల్లో ఏమూలో కనిపించి మాయమవ్వడమే తప్ప... బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియడం లేదు. ముఖ్యంగా మోరల్ పోలీసింగ్ పేరున కర్నాటక దక్షిణ కోస్తాలో ఈ దాడులు తీవ్రమౌతున్నాయి. మోరల్ పోలీసింగ్ మాటున మూఢత్వం పెచ్చుమీరుతోంది. యువసంఘాలూ, సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి... సమాజానికి క్రమశిక్షణ నేర్పుతామన్న ధోరణిలో దాడులకు తెగబడుతున్నాయి. స్థానిక పౌరులను ప్రజలనూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పోలీసులే చెప్తున్నారు. వీటిలో చాలావరకూ కనీసం పోలీస్ స్టేషన్ వరకూ కూడ రావడం లేదు. ఈ ఏడాది పన్నెండు మోరల్ పోలీసింగ్ ఘటనలు ఈ ప్రాంతంలో వెలుగు చూశాయంటే ఇక్కడ వీరి ప్రభావం ఎంతగా ఉందో తెలుస్తుంది. ఇక స్థానిక ప్రజలు కూడ మోరల్ పోలీసింగ్ భయంతో వణికిపోతున్నారు. తల్లితండ్రులు తమ పిల్లలకు భద్రత లేకుండాపోయిందని వాపోతున్నారు. స్నేహితులపై కూడా దాడులకు పాల్పడుతున్న నేటి పరిస్థితుల్లో ప్రాచీన నాగరికతను దృష్టిలో పెట్టుకొని రాసిన కొన్ని చట్టాలను ఆధునిక సమాజంలో తిరగ రాయాల్సిన అవసరం ఉందని అభ్యుదయ వాదులు అభిప్రాయ పడుతున్నారు. అసభ్యత, అశ్లీలత వంటి సంఘటనలు వెలుగు చూసినప్పుడు పోలీసులు కేసులు పెట్టాలి. విచారించి చర్యలు తీసుకోవాలి. కానీ యువత మోరల్ పోలీసింగ్ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నైతిక విలువలను కాపాడేందుకు ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ఛాందస వాదాన్ని భుజాన వేసుకొని దాడులకు తెగబడటం ఎంతమాత్రం సమంజసం కాదు. -
ఆధ్యాత్మిక సంపద మన సొంతం
తిరుపతి సిటీ : భారతీయులుగా మనకున్న ఆధ్యాత్మిక, ధార్మిక సంపద ప్రపంచంలో ఏ దేశానికీ లేదని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎంజీ.గోపాల్ ఉద్ఘాటించారు. శుక్రవారం ఉదయం స్థానిక టీటీడీ పరిపాలన భవనం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం పరేడ్ ఇన్చార్జి కూర్మారావు నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక గ్రంథాల మీద ప్రమాణం చేసి న్యాయస్థానాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటే భారతీయుల ఆధ్యాత్మిక సంపద ఎంత ప్రాశస్త్యమైందో అర్థమౌతుందున్నారు. శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తులకు, అంకిత భావంతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రానున్న ఏడాది కాలంలో నూతనంగా అమలు చేయనున్న వాటిని వివరించారు. చేపట్టనున్న నూతన కార్యక్రమాలు.. శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా 18 వేల రూ.300 శీఘ్రదర్శన టికెట్లను ఈ-దర్శన్, ఇంటర్నెట్ ద్వారా కేటాయింపు. తిరుమలలో రూ.50 కోట్లతో సువిశాలమైన కారు పార్కింగ్ ఏర్పాటు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్మెంట్లలో 108 అంగుళాల ప్లాస్మా టీవీలు, భక్తుల భద్రతను పటిష్ట పరిచేందుకు 2 వేల సీసీ కెమెరాల ఏర్పాటు. తిరుచానూరులో నూతన అన్నదాన భవనం, యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం. శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో రూ.70 కోట్ల వ్యయంతో ప్రత్యేక వసతి సముదాయం. దేశవాళీ గోజాతిని అభివృద్ధి పరిచేందుకు పలమనేరు వద్ద 450 ఎకరాల్లో థీమ్‌పార్క్ ఏర్పాటు. ఆకట్టుకున్న విన్యాసాలు.. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో పరేడ్‌లో నిర్వహించిన కవాతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు చేపట్టిన గుర్రపుస్వారీ, టీటీడీ డాగ్ స్క్వాడ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన డాగ్‌షో విశేషంగా ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులు, అధికారులకు ఈవో ఎంజీ గోపాల్ వెండి డాలర్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డీఎల్వో నాగార్జున, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖరరెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఇతర విభాగాధిపతులు, ఉగ్యోగులు పాల్గొన్నారు.