ఆప్‌ హోదాలో కాదు.... వ్యక్తిగతంగా పాల్గొన్నా! | Rajendra Pal Gautam Said Arvind Kejriwal Did Not Know That Event | Sakshi
Sakshi News home page

అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆ ఈవెంట్‌ గురించి తెలియదు! వ్యక్తిగతంగా పాల్గొన్నా

Published Mon, Oct 10 2022 1:06 PM | Last Updated on Mon, Oct 10 2022 1:07 PM

Rajendra Pal Gautam Said Arvind Kejriwal Did Not Know That Event - Sakshi

న్యూఢిల్లీ: మతమార్పిడి వివాదం ఎదుర్కొంటున్న ఆప్‌ మంత్రి  రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ వివాదం మరింత వివాదాస్పదంగా అవుతుందన్న భయంతోనే గౌతమ్‌ చేత బలవంతంగా రాజీనామ చేయించారంటూ విమర్మలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గౌతమ్‌ వివరణ ఇస్తూ తాను ఎవరి బలవంతంతోనూ రాజీనామ చేయలేదని, తన ఇష్ట ప్రకారమే రాజీనామ చేశానని చెప్పారు.

ఈ మేరకు రాజేంద్ర గౌతమ్‌ అక్టోబర్‌ 5న వేలాది మంది బౌద్ధమతంలోకి మారుతున్న కార్యక్రమంలో తాను విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులను పూజించను అని చెబుతూ ప్రమాణం చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో ఈ వీడియో ఆధారంగా బీజేపీ ఆప్‌పై పలు ఆరోపణలు చేసింది. మతమార్పిడి పేరుతో హిందూ దేవుళ్లును దూషించారంటూ విమర్శలు చేసింది. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్‌కి ఈ వివాదం పెద్ద అడ్డంకిగా మారింది. పైగా బీజేపీ ఈ వీడియోనే లక్ష్యంగా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్‌ని హింది వ్యతిరేకిగా చిత్రీకరించడం మొదలు పెట్టింది. 

దీంతో గౌతమ్‌ ఈ కార్యక్రమం గురించి అసలు అరవింద్‌ కేజ్రీవాల్‌కు అసలు తెలియదని. ఇది సామాజిక మత సంబంధ కార్యక్రమమని అన్నారు. అలాగే బీఆర్‌ అంబేద్కర్ దేశానికి 22 వాగ్దానాలు ఇచ్చారని గుర్తుచేశారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరిగిందని, ఇలా 1956 నుంచి జరుగుతుందని అందులో అలా చెప్పడం సాధారణమని వివరణ ఇచ్చారు. అయినా బీజేపీ దేశంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలలు గురించి మాట్లాడటం మాని ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూడటం బాధకరమని ఆవేదనగా అన్నారు.

అదీగా ఈ గుజరాత్‌ ఎన్నికల సమయంలో బీజీపీ నాయకులు ఆప్‌ గురించి చెడుగా ప్రచారం చేయడమే గాకుండా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన హిందూ వ్యతిరేకి అని పోస్టర్‌లు కూడా పెట్టారని  అన్నారు. అసలు ఈ విషయాన్ని రాజకీయం చేయాల్సిన పనిలేదని, తాను ఈ కార్యక్రమంలో ఆప్‌ మంత్రిగా కాకుండా వ్యక్తిగత హోదాలో పాల్గొన్నానని చెప్పారు. ఇందులోకి తమ నాయకుడిని, పార్టీని ఎందుకు లాగుతున్నారంటూ గౌతమ్‌ ఆక్రోశించారు. 

(చదవండి: మాకు సీక్రెట్‌గా సపోర్ట్‌ ఇవ్వండి.. బీజేపీ నేతలకు ఆఫర్‌ ఇచ్చిన కేజ్రీవాల్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement