కేంద్రంలోని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. రెండు పార్టీల నేతలు రాజకీయ విమర్శలు చేసుకుంటుండగా.. ఆప్ మాత్రం బీజేపీకి చాన్స్ ఇవ్వడం లేదు. మరోవైపు.. తమ ప్రభుత్వానికి ఢోకా లేదంటూ ఇటీవలే క్రేజీవాల్ అసెంబ్లీ విశ్వాస తీర్మానం నెగ్గారు.
మరోవైపు.. కేజ్రీవాల్ ఈ ఏడాది చివరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోస్ పెట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ రాజ్‌కోట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్‌లో ఆప్ విజయం సాధింస్తుంది. సూరత్‌లో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 7 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. మీరు భయపెడితే భయపడటానికి కాంగ్రెస్ నాయకులం కాదు.. మేం సర్దార్ వల్లభాయ్ పటేళ్లం.. భగత్ సింగ్‌లం.. భయపడం.. పోరాడుతామని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామని తెలిస్తే చాలు బీజేపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీపై మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ఆప్ నాయకుడు మనోజ్ సోరథియాపై దాడిని ప్రస్తావించారు. మనోజ్‌పై దాడి చేయడాన్ని సూరత్ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. బీజేపీ గుండాలు దాడి చేయడంతో.. గుజరాత్‌లోని ఆరు కోట్ల మంది ప్రజలు ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఓ నాయకుడిపై దాడి చేయడం మన దేశ సంస్కృతి కాదు. అసలు గుజరాత్ సంస్కృతి కాదంటూ వ్యాఖ్యలు చేశారు.
गुजरात में BJP के सभी पन्ना प्रमुख और कार्यकर्ताओं से मेरी अपील-
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 3, 2022
हमारे पास पैसा नहीं है, पैसा भाजपा से लो लेकिन काम AAP के लिए करो।
AAP की सरकार आएगी तो आपको भी फ्री बिजली, अच्छे स्कूल और मुफ़्त इलाज मिलेगा। pic.twitter.com/KcYVVia26t
Comments
Please login to add a commentAdd a comment