
చెన్నై: తమ పార్టీలోకి కుల, మత సంస్థల నేతలకు ప్రవేశం ఉండబోదని తమిళ స్టార్ రజనీకాంత్ నెలకొల్పిన ‘రజనీ మక్కల్ మండ్రం’ స్పష్టం చేసింది. నిబంధనలతో కూడిన 36 పేజీల కరపత్రాన్ని ఆ పార్టీలోని వివిధ విభాగాలకు అందజేసింది. దీని ప్రకారం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు, చెడు అలవాట్లకు బానిసలైన వారికి పార్టీలోకి ప్రవేశం ఉండదు. సంస్థాగత నిర్మాణం, ప్రవర్తనావళి, వివిధ విభాగాల్లో చేరికలకు సంబంధించిన అంశాలపైనా ఇందులో వివరణ ఉంది. రజనీకాంత్ ‘రజనీ మక్కల్ మండ్రం’ ఏర్పాటు చేసి, వివిధ స్థాయిల్లో పార్టీ ఆఫీస్ బేరర్లను నియమించుకుని, సంస్థాగత నిర్మాణ పనుల్లో ఉన్నారు. త్వరలోనే పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు.